Feeds:
Posts
Comments

Archive for August, 2011

గాయత్రి మంత్రము

gayatri mantram in telugu with meaning

gayatri mantram in telugu with meaning

”ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం
భర్గోదేవస్య ధీమహి – ధీయో యోనః ప్రచోదయాత్‌!”

గాయత్రికి మూడు పేర్లు. అవి గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఇంద్రియములకు నాయకత్వం   వహించునది గాయత్రి, సత్యమును పోషించునది సావిత్రి, వాగ్ధేవతా స్వరూపిణి సరస్వతి. అనగా హృదయము, వాక్కు, క్రియ… ఈ త్రికరణ శుద్ధి గావింఛునదే గాయత్రి మంత్రము. సకల వేదముల సారము ఈ గాయత్రి మంత్రము. ఈమెకు తొమ్మిది వర్ణనలున్నాయి.

1) ఓం 2) భూః 3) భువః 4) సువః 5) తత్‌ 6) సవితుర్‌ 7) వరేణ్యం 8) భర్గో 9) దేవస్య

ప్రతిపదార్ధం :

ఓం     :     ప్రణవనాదం  
భూః    :    భూలోకం, పదార్ధముల చేరిక, దేహము, హృదయం, మెటీరియలైజేషన్‌
భూవః    :    రువర్లోకం, ప్రాణశక్తి, వైబ్రేషన్‌
సువః    :    స్వర్గలోకం, ప్రజ్ఞానము, రేడియేషన్‌   ఈ మూడు లోకములు మన శరీరములోనే వున్నవి.
తత్‌     :    ఆ
సవితుర్‌     :    సమస్త జగత్తును
వరేణ్యం     :    వరింపదగిన
భర్గో    :    అజ్ఞానాంధకారమును తొలగించునట్టి
దేవస్య     :    స్వయం ప్రకాశ స్వరపమైన బ్రహ్మను
ధీమహి     :    ధ్యానించుచున్నాను
ధీయోయోనః ప్రచోదయాత్‌ : ప్రార్ధించుచున్నాను
కనుక వర్ణన, ధ్యానము, ప్రార్ధన – ఈ మూడు ఒక్క గాయత్రీ మంత్రములోనే లీనమై ఉన్నవి.  

Advertisements

Read Full Post »

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్‌

శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌|
ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వవిఘ్నోపశాన్తయే||     1
యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్‌|
విఘ్నం నిఘ్నన్తి సతతం విష్వక్సేనం తమాశ్రయే||     2
వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్ర మకల్మషం|
పరాశరాత్మజం వన్దే శుకతాతం తపోనిధిమ్‌||     3
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే|
సమోవై బ్రహ్మనిధయే వాశిష్ఠాయ నమోనమః||     4
అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే|
సదైకరూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే||     5
యస్య స్మరణమాత్రేణ జన్మసంసార బంధనాత్‌|
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే||     6
ఓం నమోవిష్ణవే ప్రభ విష్ణవే

శ్రీ వైశంపాయన ఉవాచ –
శ్రుత్వాధర్మా నశేషేణ పావనాని చ సర్వశః|
యుధిష్ఠిరః శాన్తనవం పునరే వాభ్యభాషత.     7

యుధిష్టిర ఉవాచ –
కిమేకం దైవతం లోకే కింవా ప్యేకం పరాయణమ్‌|
స్తువంతః కం కమర్చన్తః ప్రాప్నుయు ర్మానవాశ్శుభమ్‌||    8
కోధర్మః స్సర్వధర్మాణాం భవతః పరమోమతః|
కింజప న్ముచ్యతే జంతు ర్జన్మసంసార బంధనాత్‌||     9

శ్రీ భీష్మ ఉవాచ –
జగత్‌ ప్రభుం దేవదేవ మనంతం పురుషోత్తమమ్‌|
స్తువ న్నామసహస్రేణ పురుషః స్సతతోత్థితః||     10
తమేవ చా   ర్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయమ్‌|
ధ్యాయన్‌ స్తువ న్నమస్యంశ్చ యజమాన స్తమేవచ||     11
అనాదినిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరమ్‌|
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదఃఖాతిగో భవేత్‌||     12
బ్రహ్మణం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనమ్‌|
లోకనాధం మహద్భూతం సర్వభూతభవోద్భవమ్‌.     13
ఏష మే సర్వధర్మాణాం ధర్మో ధికతమో మతః||
యద్భక్త్యా పుండరీకాక్షం స్తవై రర్చే న్నరః స్సదా||     14
పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః|
పరమం యో మహద్బ్రహ్మ పరమం యంః పరాయణమ్‌||     15
పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళమ్‌|
దైవతం దేవతనాం చ భూతానాం యో వ్యయః పితా||     16
యతః స్సర్వాణి భూతాని భవన్త్యాదియుగాగమే|
యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే||     17
తస్య లోకప్రదానాస్య జగన్నాథస్య భూపతే|
విష్ణోర్నా మసహస్రం మే శృణు పాపభయాపహమ్‌||     18
యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః|
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే||     19
ఋషి ర్నామ్నాంసహస్య్ర వేదవ్యాసో మహామునిః|
ఛందో నుష్టుప్‌ తథా దేవో భగవాన్‌ దేవకీసుతః||     20
అమృతాంశూద్భవో బీజం శక్తి ర్దేవకినందనః|
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే||     21
విష్ణుంజిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్‌|
అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్‌||     22

అథపూర్వన్యాసః –
అస్యశ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్‌ ఋషిః, అనుష్టుప్‌ ఛందః, శ్రీ మహా విష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశూద్భవో బాను రితి బీజమ్‌, దేవకీ నందనః స్రష్టేతి శక్తిః, ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమోమంత్రః  శంఖభృన్నందకీ చక్రీతి కీలకమ్‌, శార్‌జ్గాధన్వా గదాధర ఇత్యస్త్రమ్‌, రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రమ్‌, త్రిసామా సామగః సామేతి కవచమ్‌, ఆనందం పరబ్రహ్మేతి యోనిః, ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్భంధః, శ్రీ విశ్వరూప ఇతి ధ్యానమ్‌, శ్రీమహావిష్ణు కైంకర్యరూపే సహస్రనామజపే వినియోగః.  

ధ్యానమ్‌
క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్‌సైకతే మౌక్తికానాం
మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభై ర్మౌక్తికై ర్మండితాంగః|
శుభ్రైరభ్రైరదభ్రై రుపరివిరచితై ర్ముక్త పీయూషవర్షైః
ఆనన్దీ నః పునీయాదరినలిన గదా శజ్ఖ పాణి ర్ముకుందః||         1

భూః పాదౌ యస్య నాభి ర్వియ దసు రనిల శ్చంద్రసూర్యౌ చ నేత్రే
కర్ణా వాసా శ్శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధి
అంతస్ధం యస్య విశ్వం సురనరఖగగో భోగిగంధర్వదైత్వైః
చిత్రం రంనమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి||         2
ఓం నమోభగవతే వాసుదేవాహ
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమ్‌,  
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్‌||             3

నమః సమస్త భూతనామ్‌ ఆది భూతమ భూభృతే
అవేక రూపరూపాయ విష్ణవే ప్రభనిష్ణువే||

మేఘశ్యామంపీతకౌశేయవాసం   
శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగమ్‌,
పుణ్యోపేతం పుండరీకాయతాక్షం
విష్ణుం వందే సర్వలోకైకనాథమ్‌                     4

సశంఖచక్రం సకిరీటకుండలం
సపీతవస్త్రం సరసీరు హేక్షణమ్‌
సహారవక్షస్ధలశోభి కౌస్తుభం
నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్‌||                 5

ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి,
ఆసీనం మంబుథ్యామ మాయతాక్షం మలంకృతమ్‌             6
చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసమ్‌,
రుక్మిణీసత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే                 7

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్‌
హరిః ఓమ్‌  

ఓం విశ్వం విష్ణుర్‌ వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః
భూతకృ ద్భూతభృ ద్భావో భూతాత్మా భూతభావనః    1
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః
అవ్యయః పురుషః స్సాక్షీ క్షేత్రజ్ఞో    క్షర ఏవ చ    2    
యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః
నారసింహవపు శ్ర్శీమాన్‌ కేశవః పురుషోత్తమః    3
సర్వ శ్శర్వ శ్శివ స్థాణు ర్భూతాది ర్నిధి రవ్యయః
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభు రీశ్వరః     4
స్వయమ్భూ శమ్భు రాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః
అనాదినిధనో ధాతా విధాతా ధాతు రుత్తమః     5
అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః
విశ్మకర్మా మనుస్త్వష్ఠా స్ధవిష్ఠః స్ధవిరో ధ్రువః     6
అగ్రాహ్యా శ్శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్ధనః
ప్రభూత స్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్‌     7
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః     8
ఈశ్వరో విక్రమీ ధన్వీ మేథావీ విక్రమః క్రమః
అనుత్తమో ధురాధర్షః కృతజ్ఞ కృతి రాత్మవాన్‌     9
సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః
అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః     10
అజః సర్వేశ్వరః సిద్దః సిద్దిః సర్వాది రచ్యుతః
వృషాకపి రమేయాత్మా సర్వయోగవినిస్సృతః     11
వసు ర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితః సమః
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః    12
రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిః శుచిశ్రవాః
అమృతః శాశ్వతస్థాణుర్‌ వరారోహో మహాతపాః     13
సర్వగః సర్వవిద్భానుః విష్వక్సేనో జనార్ధనః
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః     14
లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః
చతురాత్మా చతుర్వూహః చతుర్ధంష్ట్ర శ్చతుర్భుజః     15
భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః,
అనఘోవిజయో జేతా విశ్వయోనిః పునర్వసుః     16
ఉపేంద్రో వామనః ప్రాంశు రమోఘః శుచిరూర్జితః
అతీంద్రః సంగ్రహః సర్గోధృతాత్మా నియమో యమః     17
వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః     18
మహాబుద్ది ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః
అనిర్దేశ్యవపుః శ్రీమాన్‌ అమేయాత్మా మహాద్రిధృక్‌     19
మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాం గతిః,
అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాం పతిః     20
మరీచి ర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః     21
అమృత్యుః సర్వదృక్‌ సింహః సంధాతా సంధిమాన్‌ స్థిరః,
అజోదుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా.     22
గురుర్‌ గురుతమో ధామసత్యః సత్యపరాక్రమః    
నిమిషో నిమిషః స్రగ్వీ వాచస్పతి రుదారధీః     23
అగ్రణీ ర్గ్రామణీః శ్రీమాన్‌ న్యాయో నేతా సమీరణః,
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్‌.     24
అవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః
అహః సంవర్తకో వహ్నిః అనిలో ధరణీధరః    25
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః
సత్కర్తా సత్కృతః సాధుః జహ్నుర్నారాయణో నరః    26
అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః
సిద్దార్ధః సిద్ధ సంకల్పః సిద్దిదః సిద్ధిసాధనః     27
వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః,
వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శ్రుతిసాగరః     28
సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః,
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః     29
ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః
ఋద్ధః స్పష్టాక్షరో మంత్ర శ్చంద్రాంశు ర్భాస్కరద్యుతిః     30        
అమృతాంశూద్భవో భానుః శశిబిందుః సురేశ్వరః
ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమః     31
భూతభవ్యభవన్నాథః పవనః పావనో నలః,
కామహా కామకృత్‌ కాంతః కామః కామప్రదః ప్రభుః.     32
యుగాదికృదుగావర్తో నైకమాయో మహాశనః,
అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజి దనంతజిత్‌.     33
ఇష్టో విశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః
క్రోధహా క్రోధకృత్‌కర్తా విశ్వబాహు ర్మహీధరః     34
అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః
అపాం నిధి రధిష్ఠాన మప్రమత్తః ప్రతిష్ఠితః     35
స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః
వాసుదేవో బృహద్భాను రాదిదేవః పురందరః    36
అశోక స్తారణ స్తారః శూరః శౌరి ర్జనేశ్వరః,
అనుకూలః శతావర్తః పద్మీ పద్మ నిభేక్షణః    37
పద్మనాభో రవిందాక్షః పద్మగర్భః శరీరభృత్‌
మహర్ధి రృద్ధో వృద్దాత్మా మహాక్షో గరుడధ్వజః     38
అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః
సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్‌ సమితింజయః     39
విక్షరో రోహితో మార్గో హేతు ర్దామోదరః సహః,
మహీధరో మహాభాగో వేగవానమితాశనః     40
ఉధ్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః,
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః     41
వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః,
పరర్ధిః పరమస్పష్ట స్తుష్టః పుష్టః శుభేక్షణః    42
రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః
వీరః శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మ విదుత్తమః     43
వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః
హిరణ్య గర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః     44
ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః,
ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః     45
విస్తారః స్థావరః స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్‌,
అర్థో నర్ధో మహాకోశో మహాభోగో మహాధనః,     46
అనిర్విణ్ణః స్థవిష్ఠో భూర్ధర్మయూపో మహామఖః,
నక్షత్రనేమి ర్నక్షత్రీ క్షమః క్షామః సమీహనః     47
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాం గతిః,
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్‌     48
సువ్రతః సుముఖః సూక్ష్మ సుఘోషః సుఖదః సుహృత్‌,
మనోహరో జితక్రోధో వీరబాహు ర్విదారణః    49
స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్‌,
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః    50
ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్‌ క్షరమక్షరమ్‌,
అవిజ్ఞాతా సహస్రాంశు ర్విధాతా కృతలక్షణః     51
గభస్తినేమిః సత్త్వస్థః సింహో భూతమహేశ్వరః,
ఆదిదేవో మహాదేవో దేవోశో దేవభృద్గురుః     52
ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః
శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః    53
సోమపో మృతపః సోమః పురుజిత్‌ పురుసత్తమః
వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్వతాం పతిః,     54
జీవో వినయితా సాక్షీ ముకుందో మితవిక్రమః
అంభోనిధి రనంతాత్మా మహోదధిశయో  న్తకః     55
అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః
ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః     56
మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః,
త్రిపద స్త్రిథాధ్యక్షో మహాశృంగః కృతాన్తకృత్‌.     57
మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ,
గుహ్యో గభీరో గహనో గుప్త శ్చక్రగదాధరః     58
వేధాః స్వాంగో జితః కృష్ణో దృఢః సంకర్షణో చ్యుతః,
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః     59
భగవాన్‌ భగహా నందీ వనమాలీ హలాయుధః
ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణు ర్గతిసత్త    60
సుధన్వా ఖండపరశు ర్దారుణో ద్రవిణప్రదః,
దివిస్పృక్‌ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయోనిజః    61
త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్‌,
సన్న్యాసకృత్‌ శమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణమ్‌     62
శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః,
గోహితో గోపతి ర్గోప్తా వృషభాక్షో వృషప్రియః     63
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం వరః     64
శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః,
శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్‌లోకత్రయాశ్రయః     65
స్వక్షః స్వంగః శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః,
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తి శ్ఛిన్నసంశయః     66
ఉదీర్ణ సర్వతశ్చకక్షు రనీశః శాశ్వతస్థిరః,
భూశయో భూషణో భూతి ర్విశోకః శోకనాశనః     67
అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః,
అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః    68
కాలనేమినిహా వీరః శౌరిః శూరజనేశ్వరః,
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః     69
కామదేవః కామపాలః కామీ కాన్త కృతాగమః,     
అనిర్దేశ్యవపు ర్విష్ణు ర్వీరో నంతో ధనంజయ,     70
బ్రహ్మణ్యో బ్రహ్మకృత్‌ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః,
బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రహ్మణప్రియః     71
మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః,
మహాక్రతు ర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః     72
స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః  
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి రనామయః     73
మనోజవ స్తీర్ధకరో వసురేతా వసుప్రదః
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః    74
సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః,
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః     75
భూతావాసో వాసుదేవః సర్వాసునిలయో నలః
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరో థాపరాజితః     76
విశ్వమూర్తిర్మహామూర్తిః దీప్తమూర్తి రమూర్తిమాన్‌,
అనేక మూర్తి రవ్యక్తః శతమూర్తి శ్శతాననః     77
ఏకోనైకః సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్‌,
లోకబంధు ర్లోకనాథో మాధవో భక్తవత్సలః     78
సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ,
వీరహా విషమః శూన్యో ఘృతాశీ రచల శ్చలః     79
అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్‌,
సుమేధా మేధజో ధన్యః సత్యమేథా ధరాధరః     80
తేజోవృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాం వరః
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః     81
చతుర్మూర్తి శ్చతుర్బాహు శ్చతుర్వ్యూహ శ్చతుర్గతిః
చతురాత్మా చతుర్భావ శ్చతుర్వేదవి దేకపాత్‌.     82
సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా.     83
శుభాంగో లోకసారంగః సుతంతుస్తంతువర్ధనః,
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః     84
ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః  
అర్కో వాజసనః శృంగీ జయంతః సర్వవిజ్జయీ.     85
సువర్ణబిందు రక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః,
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః     86
కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో నిలః,
అమృతాశో మృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః     87
సులభః సువ్రతః సిద్ధః శత్రుజిత్‌ శత్రుతాపనః
న్యగ్రోధోదుంబరో శ్వత్థ్ధః చాణూరాంధ్రనిషూదనః    88
సహస్రార్చిః సప్తజిహ్వః సప్తైధాః సప్తవాహనః
అమూర్తిరనఘో చింత్యో భయకృద్భయనాశనః     89
అణుర్బృహత్‌ కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్‌,
అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్దనః    90
భారభృత్‌ కథితో యోగీ యోగీశః సర్వకామదః
ఆశ్రమః శ్రమణః క్షామః సుపర్ణో వాయువాహనః     91
ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః
అపరాజితః సర్వసహో నియంతా నియమో యమః    92
సత్వవాన్‌ సాత్త్వికః సత్యః సత్యధర్మపరాయణః
అభిప్రాయః ప్రియార్హో ర్హః ప్రియకృత్‌ ప్రీతివర్ధనః     93
విహాయసగతి ర్జ్యోతిః సురుచిర్‌ హుతభుగ్విభుః
రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః     94
అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకజో గ్రజః
అనిర్విణ్ణః సదామర్షీ లోకధిష్ఠాన మద్భుతః    95
సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః
స్వస్తిదః స్వస్తికృత్‌ స్వస్తి స్వస్తిభుక్‌ స్వస్తిదక్షిణః    96
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః
శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః     97
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణ కీర్తనః    98
ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుఃస్వుప్ననాశనః,
వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్థితః    99
అనంతరూపో నంతశ్రీ ర్జితమన్యు ర్భయాపహః
చతురస్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః     100
అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః
జననో జనజన్మాదిర్‌ భీమో భీమపరాక్రమః     101
ఆధారనిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః
ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః    102
ప్రమాణం ప్రాణ నిలయః ప్రాణభృత్‌ ప్రాణజీవనః
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః    103
భూర్భువస్స్వస్తరు స్తారః సవితా ప్రపితామహః
యజ్ఞో యజ్ఞపతి ర్యజ్వా యజ్ఞాంఘో యజ్ఞవాహనః     104
యజ్ఞభృద్యజ్ఞకృదజ్ఞీ యజ్ఞకృద్‌ యజ్ఞీ యజ్ఞబుగ్య యజ్ఞసాధనః,
యజ్ఞాంతకృద్యజ్ఞగుహ్యమ్‌ అన్నమన్నాద ఏవ చ     105
ఆత్మయోనిః స్వయంజాతో వైఖానః సామగాయనః,
దేవకీనందనః స్రష్టా క్షితీశః పాపనాశనః     106
శంఖభృన్నందకీ చక్రీ శార్‌ఙ్గధన్వా గదాధరః
రథాంగపాణి రక్షోభ్యః సర్వప్రహరణాయుధః     107

శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి
వనమాలీ గదీ శార్‌జ్గీ శంఖీ చక్రీ చ నందకీ     
శ్రీమాన్నారాయణో విష్నుర్వాసుదేవో భిక్షరతు.     108

ఉత్తరి పీఠిక (ఫలశ్రుతి)
ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః,
నామ్నాం సహస్రం దివ్యానా మశేషేణ ప్రకీర్తితమ్‌.     1
య ఇదం శౄణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తియేత్‌,
నాశుభం ప్రాప్నుయాత్‌ కించిత్‌ సో  ముత్రేహ చ మానవః    2
వేదాంతగో బ్రహ్మణః స్యాత్‌ క్షత్రియో విజయీ భవేత్‌,
వైశ్యో ధనసమృద్ధః స్యాత్‌ శూద్రః సుఖమవాప్నుయాత్‌.     3
ధర్మార్ధీ ప్రప్నుయా ద్ధర్మ మర్ధార్దీ చార్ధ మాపున్నయాత్‌,
కామానవాప్నుయాత్‌ కామీ ప్రజార్ధీ ప్రాప్నుయాత్‌ ప్రజామ్‌ః    4
భక్తిమాన్‌ః సదోత్థాయ శుచి స్తద్గతమానసః,
సహస్స్రం వాసుదేవస్య నామ్నామేతత్‌ ప్రకీర్తయేత్‌    5
యశః ప్రాప్నోతి విపులం యాతి ప్రధాన్యమేవ చ,
అచలాం శ్రియ మాప్నోతి శ్రేయః ప్రాప్నో త్యనుత్తమమ్‌     6
న భయం క్వచి దాప్నోతి వీర్యం తేజశ్చ విందతి,
భవత్యరోగో ద్యుతిమాన్‌ బలరూపగుణాన్వితః    7
రోగార్తో ముచ్యతే రోగాత్‌ బద్ధో ముచ్యేత బంధనాత్‌,
భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః    8
దుర్గా ణ్యతితర త్యాశు పురుషః పురుషోత్తమమ్‌,
స్తువన్‌ నామసహస్రేణ నిత్యం భక్తి సమన్వితః,     9
వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవపరాయణః,
సర్వపాపవిశుద్ధాత్మ యాతి బ్రహ్మ సనాతనమ్‌.     10
న వాసుదేవభక్తానామ్‌ అశుభం విద్యతే క్వచిత్‌,
జన్మమృత్యుజరావ్యాధిభయం నైవోపజాయతే.     11
ఇమంత స్తవ మధీయానః శ్రద్ధాభక్తిసమన్వితః,
యుజ్యేతాత్మా సుఖక్షాంతి శ్రీధృతిస్మృతికీర్థిభిః    12
న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతిః,
భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే.     13
ద్యౌః సచంద్రార్క నక్షత్రా ఖం దిశో భూర్మహోదధిః
వాసుదేవస్య వీర్యేణ విధౄతాని మహాత్మనః     14
ససురాసురగంధర్వం సయక్షోరగరాక్షసమ్‌,
జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరమ్‌.     15
ఇంద్రియాణి మనో బుధ్దిః సత్త్వం తేజో బలం ధృతిః,
వాసుదేవాత్మకాన్యాహుః క్షేత్రం క్షేత్రజ్ఞ ఏచ చ.     16
సర్వాగమానా మాచారః ప్రథమం పరికల్ప్యతే,
ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభు రచ్యుతః     17
ఋషయః పితరో దేవా మహాభూతాని ధాతవః,
జంగమాజంగమం చేదం జగ న్నారాయణోద్భవమ్‌.     18
యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యాః శిల్పాదికర్మచ,
వేదాః శాస్త్రాణి విజ్ఞాన మేతత్స సర్వం జనార్ధనాత్‌.     19
ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః,
త్రీల్లోకా వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః     20
ఇమం స్తవం భగవతో విష్ణో ర్వ్యాసేన కీర్తితమ్‌,
పఠేద్య ఇచ్ఛేత్‌ పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖాని చ.     21
విశ్వేశ్వర మజం దేవం జగతః ప్రభురవ్యయమ్‌,
భుజన్తి యే పుష్కరాక్షం నతే యాంతి పరాభవమ్‌.     22
సతేమాంతి …కాభవమ్‌ ఓం గరుః ఇత

అర్జున ఉవాచ :
పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ,
భక్తానా మనురక్తానాం త్రాతా భవ జనార్దన     23

శ్రీ భగవాన్‌ ఉవాచ :
యో మాం నామసహస్రేణ స్తోతు మిచ్ఛతి పాండవ,
సో హ మేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః.     24
    స్తుత ఏవ న సంశయ ఓం నమ ఇతి  

వ్యాస ఉవాచ :
వాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయమ్‌
సర్వభూతనివాసో సి వాసుదేవ నమో స్తుతే.    25         
    శ్రీ వాసుదేవ నమో స్తుత ఓం నమ ఇతి.

పార్వతువాచ :
కేనోపాయేన లఘునా విష్ణోర్నామసహక్రమ్‌,
పఠ్యతే పండితై ర్నిత్యం శ్రోతు మిచ్ఛా మ్యహం ప్రభో.    26

ఈశ్వర ఉవాచ :
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే,
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.     27
    శ్రీరామనామవరానన ఓం నమ ఇతి.

బ్రహ్మోవాచ :
నమో స్వనంతాయ సహస్రమూర్తయే
సహస్రపాదాక్షిశిరోరుబాహవే,
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే
సహస్ర కోటియుగధారిణే నమః సహస్రకోటి యుగ
ధారిణే నమ ఓంనమితి     28

సంజయ ఉవాచ :
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః,
తత్ర శ్రీ ర్విజయో భూతిర్‌ ధ్రవా నీతి ర్మతి ర్మమ.     29

శ్రీభగవాన్‌ ఉవాచ :
అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే,
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్‌.    30
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్‌,
ధర్మసంస్ధాపనార్ధాయ సంభవామి యుగే యుగే.     31

ఆర్తా విషణ్ణాః శిథిలాశ్చ భీతాః
    ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః,
సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం
    విముక్తదుఃఖాః సుఖినో భవంతి.     32
కాయేన వాచా మనసేంద్రియైర్వా
    బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్‌,
కరోమి యద్యత్‌ సకలం పరస్మై
    నారాయణాయేతి సమర్పయామి.     33.
ఓం శ్రీ మన్నా రామణమేతి సమర్పయామి

ఇతి శ్రీ మహాభారతే శతసాహస్రికాయాం
సంహితాయాం వైయాసిక్యామానుశాసనికపర్వణి
మోక్ష .. శ్రీభీష్మయుధిష్టర సంవాదే శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రం

సంపూర్ణం
ఓం తత సత్‌

– ముగింపు –

Read Full Post »

శ్రీ వేంకటేశ్వర గోవింద వ్రత మాల

Govinda Vrathamal

Govinda

వేంకటాద్రిసమం స్ధానం బ్రహ్మాణ్ణే నాస్తి కించన|
వేంకటేశనమో దేవో న భూతో న భవిష్యతి||

శ్రీవేంకటాచలంతో సమానమైౖనక్షేత్రం ఈ బ్రహ్మాండంలో మరొకటి లేదు. శ్రీవేంకటేశ్వరునితో సమానమైన దేవుడు ఇంతవరకూ లేడు, ఇకముందు ఉండబోడు.

మానవులు ఎన్నో కోర్కెలతో ఉంటారు. కోర్కెలు తీరాలంటే దైవాన్నిభజించాలి. అయితే కలియుగంలో శ్రీ”వేంకటేశ్వరుడొక్కడే ఆరాధ్యదైవం.అందుకే ”కలౌవేంకట నాయకః” అనిచెప్పారు. అభీష్ట సిద్ధికొఱకు శ్రీవేంకటాచల యాత్ర ఒకటే పరమ ఉపాయమని ఆదిత్య పురాణం పేర్కొంటున్నది. శ్రీవేంకటేశ్వరస్వామిని ఉద్దేశించి చేసే యాత్ర ఇహలోకంలోను, పరలోకంలోనూ అభీష్టాలను ప్రసాదిస్తుంది. దీనికి మరొక ఉపాయం లేదు. లక్ష్మీపతి దయాసముద్రుడు. ఆయన బ్రహ్మాదులకు కూడా వరమిచ్చే”ాడు. తిరుపతి యాత్రా విషయంలో సందేహంతగదు. భక్తితో త్వరగా యాత్రచేసి తరించాలి. శ్రీవేంకటేశ్వరుడు సకల దేవతా స్వరూపుడు. భగవదారాధనలో నామ సంకీర్తన చాలా ప్రధానమైనది. నామ సంకీర్తనతో కలియుగంలో సులభంగా తరించవచ్చు అని కలిసంతరణోపనిషత్తు ప్రభోదిస్తున్నది సమస్త పాపాలను పోగొట్టి దుఃఖం తొలగించగలది భగవన్నామమొక్కటే అని భాగవతం చెబుతున్నది.

భగవంతునికి ఎన్నో నామాలున్నాయి. ఆయనవేయినామాల విష్ణుదేవడు  కదా! అయినా గోవిందనామం చాలా ప్రశస్తమయినది. తిరుపతి యాత్రికులు శ్రీ వేంకటేశ్వరసామిని గోవిందనామంతోనే ఎక్కువగా కీర్తిస్తారు. గోశబ్దానికి అనేక అర్దాలున్నాయి. అందువల్ల గోవిందుడు అంటే వేదవాణిని పొందేవాడని, వేదప్రతిపాద్యుడనీ, గోవులను కాపాడేవాడని ఇలా ఎన్నో అర్ధాలు చెప్పవచ్చు. అందుచేత గోవిందనామాంకితమైన మాలను ధరించి శ్రీవేంకటేశ్వరవ్రతం ఆచరించే సంప్రదాయం ఏర్పడింది. ‘మాం లాతీతి మాలా’ అనే నిర్వచనాన్ని అనుసరించి ‘మాల’ అనే శబ్దానికి లక్ష్మిని కల్గించేది అని అర్ధం. అంటేఅశుభాలనుతొలగించి సకల సంపదలను కల్గించేది మాల.

శ్రీవేంకటేశ్వర వ్రతమాల వేయు విధానము

”ఓం శ్రీవేంకటేశ్వర పరబ్రహ్మణే నమః  ఓం శ్రీ గోవింద పరబ్రహ్మణే నమః ఓం శ్రీ నారాయణ పరబ్రహ్మణే నమః ఓం శ్రీ     ్టాసుదేవ పరబ్రహ్మణే నమః ”
భక్తులారా!
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ వైకుంఠవాసుడు అడుగడుగు దండాలవాడు, ఆపద్భాంధవుడు తిరుమల మందిర సుందరుడు  అయిన శ్రీవేంకటరమణస్వామివారి గోవిందమాల వ్రతమును ఆచరించి  పరమాత్మ అనుగ్రహమునకు పాత్రులుకండి.

ముడుపు

ఎవ్వరైతే దీక్షాధారణ ఛేయదలచారోదారు శ్రీవేంకటేశ్వరస్వామికి ముడుపు కట్టి దీక్షను ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలు రాకుండా ఆదేవదేవుడు కాపాడగలడు.
కావలసిన వస్తువులు :  అరచేయి వెడల్పు ఉన్న తెల్లని లేదా పసుపు వస్త్రము ఒక మీటరు. 7 రూపాయి బిళ్ళలు + 7 పావలా బిళ్ళలు.
తెల్లని వస్త్రమైతే దానికి పసుపు అద్ది ఆరబెట్టి బాగా ఆరిన తరువాత దీక్షకు కూర్చొని, మొదట మాలను క్రింద చెప్పిన విధంగా శుభ్రపరచుకొని ధూపదీప పూజా కార్యక్రమాలొనర్చి సిద్దపరచుకొనవలయును.తరువాత పసుపు వస్త్రమునుతీసికొని ఎడమఅరచేతిలో వుంచుకొని అందులో రూపాయి పావలా వుంచి శ్రీవేంకటేశ్వరస్వామి సకలాభీష్టసిద్ధి మంత్రమును జపిస్తూ ఒక ముడి”వేయవలెను.అలాగే కొంత స్ధలమిచ్ఛి రెండవ ముడి వేయవలెను.ఇందొక జాగ్రర్త వహించవలెను.రెండవ ముడి వేసేటప్పడు ఇదివరకువేసిన ముడిని ఎట్టి పరిస్ధితుల్లోనూ దాటించి ముడివేయరాదు. ఖాళీగా వున్న వస్త్రమునే త్రిప్పుతూ ముడివేయవలెను. ముడుపు కట్టే సమయములో ఎవ్వరితోను మాట్లాడరాదు. స్వామి అభీష్ట సిద్ధిమంత్రమును జపిస్తూ ఏడు ముడుపులు కట్టవలయును. ఈ ముడుపు కార్యక్రమము అయిన తర్వాత పూజా కార్యక్రమము కావించి మాలధారణ చేయవలెను.

మాలను పవిత్రము చేయు విధానము

1. ఆవు పంచితము 2. ఆవు పాలు 3. ఆవుపెరుగు 4.  ఆవు నెయ్యి, 5. తేనె 6. గంధము 7. నీళ్ళు వీనిచే మాలను అభిషేకము గావించి కర్పూర నీరాజనము సల్పి, గోవింద నామమును 108 పర్యాయములు జపించుచూ ధరించవలయును.
వ్రత నియమము
1.    వైకుంఠ ఏకాదశికి 7వారములు, 6వారములు, 5వారములు, 4వారములు, మరియు 7 రోజులు ముందుగా గాని ఈ వ్రతమును ఆచరించవచ్చును.
2.    పవిత్రమాలను తులసి పూసలతో గాని తామర పూసలతో గాని, పటిక పూసలతో గాని పవిత్రము చేసి శ్రీవేంకటేశ్వరస్వామికి  తమ శక్త్యనుసారము పూజకావించి ధరించవలయును.
3.    స్రీలు ఆచరించదలచినచో 7 రోజుల వ్రతమును ఆచరించవచ్చును.
4.    వైకుంఠ ఏకాదశి ముందురోజు ఉదయం 9-30 గంటలకు తిరుపతిలో గోవిందరాజస్వామిఆలయంవద్ద ”యాగపూజ -కంకణములు” కట్టుట జరుగును. భక్తులు విధిగా హాజరుకావలెను. భక్తులు యాగమునకు కావలసిన 7 రకముల సమిధలు 5 గ్రాముల నెయ్యి షేవలెను.
5.    శ్రీ స్వామివారికి ముఖ్యమయిన పసుపు వస్త్రములను విధిగా ధరించవలయును.  నుదుట తిరునామములు పెట్టుకోవలయును.
6.    వ్రతకాలములో ధూమము మద్యము, మత్తుపదార్దములు, మాంసాహారము      సేవించరాదు.దాంపత్యమునకు దూరముగా ఉండవలెను.సాత్వికాహారము ఉత్తమము.
7.    ప్రతి నిత్యము ఉదయము, సాయంకాలము 6-00 గంటలు 7-00 గంటల మధ్య స్నాన కార్యక్రమము ముగించుకొని శ్రీ స్వామి””వారి గోవిందనామము ధ్యానించవలయును. వీలైతే రోజుకు 1008 సార్లు ” ఓంనమోవేంకటేశాయ” అనే సకలాబీష్ట సిద్దిమంత్రమును జపించవలయును. భజనలో పాల్గొన వలయును.
8.    ఎదుటి వారిని తనమాటల చేతకాని, చేతలచేతగాని బాదింపరాదు.
9.    దీక్షాకాలములో ఇతరులను ”గోవిందా” అని పిలువవలెను.
10.    ఉపవాస కార్యక్రమమును తూ.చ. తప్పకపాటించవలయును.పె ౖవ్రతమును  అన్ని వర్ణములవారు ఆచరించవచ్చును. ఆచరించినవారు శ్రీవేంకటరమణ స్వామివారి కృపా కటాక్షము వలన తలచిన కోర్కెలు నెరవేర్చుకొని సకల సుఖములు పొందుదురు.

శ్రీవారి హుండి ముడుపు                 

1. పచ్చకర్పూరము 50 గ్రా.    2. జీడిపప్పు 50 గ్రా.        3. ఎండు ద్రాక్ష 50 గ్రా.            4. ఏలకులు 50 గ్రా.
5. మిరియాలు 50 గ్రా.           6. జీలకర్ర 50 గ్రా.             7. బియ్యము 50 గ్రా.              8. కర్పూరం 50 గ్రా.

ఇంటికి తెచ్చుకొను ముడుపు

    1.    బియ్యము 100 గ్రా.
    2.     టెంకాయ1
    3.     కర్పూరము 1 ప్యాకెట్టు
పై పదార్ధములు రెండు విడి విడి సంచులలవేరువేరుగా కట్టుకొని ముడుపుల మూటతో నడచి శ్రీ స్వామివారి సన్నిధి చేరవలయును. ఇంటికి తెచ్చుకొను ముడుపు మూటను దగ్గరిలో వచ్చు శనివారము రోజున వారి వారి ఇంటిలో తళిగలువేసికొని ముగించు కొనవచ్చును.

Read Full Post »

యేసు క్రీస్తు అందరికి ప్రభువు  –  భజనలు – పాటలు

telugu_christian_songs

Christian Telugu Songs

పాట – 1

ప||    నీ జీవితములో గమ్యంబు యేదో – ఒకసారి యోచించవా
    ఈనాడే నీవు ప్రభుయేసు కొరకు – నీ హృదయంబు నర్పింపవా
1.    నీ తల్లి గర్భాన నీవుండినపుడే – నినుజూచె ప్రభు కన్నులు
    యోచించినావా ఏ రీతి నిన్ను – నిర్మించె తన చేతులు
2.    నీలోన తాను నివసింపగోరి – దినమెల్ల చేజూచెను
    హృదయంబు తలపు – తెరువంగలేవా – యేసు ప్రవేశింపను
3.    తన చేతులందు రుధిరంపుధారల్‌ – స్రవించే నీ కోసమే
    భరియించే శిక్ష నీ కోసమేగా – ఒకసారి గమనించవా
4.    ప్రభు యేసు నిన్ను సంధించినట్టి – సమయంబు ఈనాడెగా
    ఈ చోట నుండి ప్రభు యేసు లేక – పోబోకుమో సోదరా

పాట – 2

ప||    యెహోవా నీ నీనామము – ఎంతో బలమైనది – ఎంతో బలమైనదీ
1.    యోషే ప్రార్ధింపగా – మన్నాను కురిపించితివి
    యోహోషువా ప్రార్ధించగా – సూర్యచంద్రుల నాపితివి     ||యోహోవా||
2.    నిప్రజల పక్షమున – యుద్దములు చేసినదేవా
    అగ్నిలో పడవేసిన – భయమేమి లేకుండిరి         ||యోహోవా||
3.    సింహముల బోనైనను – సంతోషముగా వెల్లిరి
    ప్రార్ధించినా వెంటనే – రక్షించే నీ హస్తము         ||యోహోవా||
4.    చెరసాలలో వేసినా – సంకెళ్ళు బిగియించిన
    సంఘము ప్రార్ధించగా – సంకెళ్ళు విడిపోయెను         ||యోహోవా||
5.    పౌలు సీలను బంధించి – చెరసాలలో వేసినా
    పాటలతో ప్రార్ధించగా – చెరసాల బ్రద్దలాయె         ||యోహోవా||

పాట – 3

ప||     ఎవరు నన్ను చేయి విడిచినా – నా యేసుడు చేయి విడువడ
    చేయి విడువడు (2) చేయి విడువడు – నన్ను చేయి విడువాడు
1.    తల్లి ఆయనే – తండ్రి ఆయనే
    లాలించును – నిన్ను పాలించును
    వేదనశ్రమలు – ఉన్నప్పుడెల్లా
    వేడుకొందును – కాపాడును                 ||ఎవరు||    
2.    రక్తముతోడ – కడిగిన నాడే
    రక్షణ సంతోషం – నాకు ఇచ్చాడే
    వాక్యముచే – నడుపుచున్నాడు                 ||ఎవరు||

పాట – 4

ప||    నీ వాక్యమే నన్ను బ్రతికించెను
    భాధలలో నెమ్మది నిచ్చెను
    కృపా శక్తి దయా సత్యసంపూర్ణుడా
    వాక్యమైయున్న యేసు వందనమయ్యా
1.    జిగటగఊబి నుండి – లేవనెత్తెను
    సమతలమగు – భూమిపైన నన్ను నిలిపెను
    నా పాదములకు – దీపమాయెను     
    సత్యమైన మార్గములో – నడుపుచుండెను         ||నీ వాక్య||
2.    వాడిగల రెండంచుల – ఖడ్గము వలెను
    నాలోని సర్వమును – విభజించి శోధించి
    పాపమన్యాయమును – తొలగించి వేయుచు
    అనుక్షణము క్రొత్త శక్తి – నిచ్చుచుండెను… ఆమెన్‌     ||నీ వాక్య||
3.    శత్రువును ఎదురుకునే – సర్వంధకవచమై
    యుద్ధమునకు సిద్దమనస్సు – నిచ్చుచుండెను
    అపవాది వేయుచున్న – అగ్నిబాణములను
    ఖడ్గమువలె అడ్డుకొని – ఆపివేయుచున్నది         ||నీ వాక్య||
4.    పాలవంటిది – జుంటి తేనెవంటిది
    నా జిహ్వకు – మహామధురమైనది
    మేలిమి బంగారుకన్న – మిన్నయైనది
    రత్నారాసులకన్న కోరదగినది                 ||నీ వాక్య||

పాట – 5

ప||    యెహోవయె మా ప్రభువు – నీవెగా
    ఆకాశములో మహిమా – నీవెగా
    కనపరుచు నీ మహిమా – చల్లగా
    దీవించు మమ్ములను చల్లగా – కలిగి నీ గొఱ్ఱెలుగా     ||యెహోవా||
1.    భూమి యందు నీ మహిమ – ఎంతో ప్రభావముంది
    నీ చేతిలో ఏదియైన – నీ ఆకాశంబులో
    సూర్యచంద్ర నక్షత్రముల నేను చూడగా
    నరుడు యేపాటివాడు – ఆ దేవుని సన్నిధిలో         ||యోహోవా||
2.    ఒకే కొమ్మ పువ్వువై – ఒకే దువుడవు నీవై
    పరిశుద్ద ఆత్మతతో – పశువుల పాకలో శిశువుగ జన్మించినావు
    పాకంత వెలుతురాయే – నీ చల్లని జన్మతో – లోకమంత
    వెలుగాయె నీ దివ్యజన్మతో                 ||యోహోవా||

పాట – 6

ప||    అందాల ఉద్యానవనమా – క్రైస్తవ సంఘమా
    పుష్పించలేక ఫలియించలేక మాడై మిగిలావు నీవు         ||2||
1.    ప్రభు ప్రేమతో బాగుచేసి – శ్రేష్ఠ ద్రాక్షగా నాటేడుగా
    కాశావు నీవు కారు ద్రాక్షలే     
    యెచించు ఇది న్యాయమేనా (4)             ||అందాల||
2.    ఆకలిగొని నీవైపు చూడ – ఆశ నిరాశయే ప్రభు యేసుకు
    పెరిగావు నీవు ఫలంపులేక
    యెచించు ఇది న్యాయమేనా (4)             ||అందాల||
3.    ప్రభు యేసులో నీవు నిలచి
    పరిశుద్దాత్మలో నీవు పయనించుమా
    ఇకనై నీవు నిజమైన ఫలముల్‌
    ప్రభుకొరకై ఫలయించలేవా (4)             ||అందాల||

పాట – 7

ప||    ఇది కోతకు సమయం – పనివారి తరుణం
    ప్రార్ధన చేయుదమా – పైరును చూచెదమా పంటను కోయుదుమా
1.    కోతెంతో విస్తారమాయెను – కోసేటి పనివారు కొదువాయెను
    ప్రభుయేసు నిధులన్ని నిలువాయెను                 ||ఇది
2.    సంఘమా మౌనము దాల్చకుమా కోసేటి పనిలోన పాల్గొందుమా
    యజమాని నిధులన్ని నికేగదా                     ||ఇది||
3.    శ్రమలేని ఫలితంబు నీకియ్యగా వలదంచు వెనుదీసి విడిదోదువా
    జీవార్ధ ఫలములను భుజింపవా                 ||ఇది||    

పాట – 8

ప||     ఎన్ని తలచినా ఏది అడిగినా – జరిగేది నీ చిత్తమే ప్రభువా         ||2||
    నీ వాక్కుకై వేచి యుంటిని – నా ప్రార్ధన ఆలకించుమా
    ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా
1.    నీతోడు లేక నీ ప్రేమలేక – ఇలలోన ఏ ప్రాణినిలువలేదు
    అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్ధన ఆలకించుమా     
    ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా                 ||ఎన్ని||     

2.    నా ఇంటి దీపం నీవే అని తెలిసి – నా హృదయం నీ కొరకు పదిలపరచితి
    ఆరిపోయిన నా వెలుగు దీపము – వెలిగించుము నీప్రేమతో
    ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో
3.    ఆపదలో నన్ను వెన్నంటియున్న – నా కాపరినీవై నన్నాదుకొంటివి
    లోకమంతయు నన్ను విడిచిన – నీ నుండి వేరు చేయవు
    ప్రభువా నీ నుండి వేరు చేయవు                 ||ఎన్ని||

పాట – 9

ప||    ఎన్నినాళ్ళ గమనమో – ఎంతదూరమో పయనమో
    ఈ ధరిత్రిలోన నీ – బ్రతుకు దినము లెన్నియో             ||ఎన్ని||
1.    గడ్డిపువ్వు వంటింది – భూనివాస జీవితం
    ఎంతలోన విరియునో – అంతోనే వాడును             ||ఎన్ని||
2.    నీటి మీద లేచిన – అవిరంటి బ్రతుకాయే
    క్షణము కూడ నిలువదు – గాలిలోనే కలియును             ||ఎన్ని||
3.    చేదనుండి జూరెడి – నీటి బిందు బ్రతుకాయే
    జారుచున్న బిందువు – ఎవరి తరము నిలుపగా             ||ఎన్ని||
4.    త్రాసుమీద దూళిలా – ఎగిరిపోవు జీవితం
    కలలుకన్న జీవితం – కలిసిపోయె నేలలో             ||ఎన్ని||
5.    నీటిమీద తేలిన – బుడగవంటి బ్రతుకాయే
    ఎపుడు పగిలిపోవునో – ఏ నరునికి తెలియదు             ||ఎన్ని||
6.    యేసే సత్యమార్గము – యేసే నిత్యజీవము
    యేసు నమ్మువారికి – నిత్యజీవ మొసుగును             ||ఎన్ని||

పాట – 10

ప||    మణులు మాణిక్యములున్నా – మేడమిద్దెలు ఎన్నున్నా
    మదిలో యేసు లేకున్న – ఏది వున్నా అది సున్నా     
1.    చదువులెన్నో చ్వఉన్నా – పదవులెన్నో చేస్తున్నా
    విద్యవున్నా బుద్దివున్నా జ్ఞానమున్నా అది సున్నా         ||మణులు||
2.    అందచందాలెన్నున్నా – అందలముపై కూర్చున్నా
    విద్యవున్నా – బుద్దివున్నా – జ్ఞానమున్నా అది సున్నా     ||మణులు||    

3.    రాజ్యములు రమణులు వున్నా శౌర్యములు వీర్యములున్నా
    బలమువున్నా బలగమున్నా – ఎన్నియున్నా అవి సున్నా     ||మణులు||
4.    పూజ్యుడా పుణ్యాత్ముడా – పుణ్యకార్యసిద్ధుడా
    దానధర్మము తపము జపము యేసులేనిదే అవి సున్నా     ||మణులు||
పాట – 11
ప||     గత కాలమంత నిను కాచిన దేవుడు
    ఈ రోజు నిన్ను ఎంతో దీవించును
    యియ్యు నీమనసియ్యు – చేయుస్తోత్రం చేయు
    యియ్యు కానుకలియ్యు – చేయు ప్రార్ధన చేయు
1.    మట్టికుంఢగా – పుట్టించినాడు
    కంపిపాపగా – కాపాడినాడు
    వందనాలెన్నో – హెచ్చించినాడు
    అందరిలో నన్నెంతో – హెచ్చించినాడు             ||గత||
2.    కష్టములో నిన్ను – కాపాడువాడు
    వ్యాధులలో నిన్ను – స్వస్ధపరచువాడు
    నీవు నమ్ముకుంటే – నిను వదలలేడు
    ఏ క్షణము నిను – ఎడబాసిపోడు             ||గత||
3.    యేసుని నమ్ముకో – ఈ లోకమందు
    ఓపిక తెచ్చుకో – యేసురాకముందు
    నీతల నెత్తుకొని – పైపైకి చూడు
    మరల యేసు ప్రభు – రానైయున్నాడు             ||గత||
పాట – 12
ప|| ప్రభుయేసుని పిలుపును ఓ ప్రియుడా
    పెడచెవిని పెట్టెదవా తీర్మాణము చేయకనే
    వెళ్లెదవా ప్రభు సన్నిధిలో నుండి             ||ప్రభు||
1.    లేత వయస్సు నడిప్రాయమును – గతించి పోవునని
    మన్నైయున్నది వెనుకటి వలెనే – మరల భూమికి చేరున్‌
    ఆత్మదాని దయచేసిన (2) దేవుని యొద్దకు పోవున్‌
    ఆ లోకములో నీ ముందు గతి ఏ మౌనో ఎరిగితివా     ||ప్రభు||
2.    ఏ పాటిది నీ జీవితమంథా – ఏ పాటిది నీ తనువు – గడ్డిపువ్వుతో
    సమమిదియేరా – అదియే నీ జీవితము – అంతలోనే
    మాయమౌఅగు – వింత బుడగయే గాధ
    అంతలోనే అందరార్ధంబగు – ఆవిరియేగదా         ||ప్రభు||
3.    వ్యర్ధము వ్యర్ధము సర్వము ఇలలో అదియే యేసుని మాట     
    నిలువని నీడ ఈ లోకమురా – కలుషాత్మ కనుగొనరా
    లోకమంత సంపాదించి – లోబి నీ ప్రాణమును
    నష్టపరచుకొనిన నీకు – నరుడా లాభము కలదా         ||ప్రభు||
4.    తామసించా తగదిక నీకు – తక్షణమే తిరుగుమురా
    విరిగి నలిగిన హృదయము కలిగి
    వినయముతో ప్రభు జేరి – యేసు ప్రభుని సిలువ చెంత
    యేసుని రక్తమే కోరి     
    ప్రాలపించు నీదు సకల పాపములొప్పుకొనుమా         ||ప్రభు||
5.    నీ రక్షణకై నిలెచెను యేసు – తన రక్తదారలతో
    కడుగును నిన్ను క్షెమియించును (2) – విడాగి క్షణమందే నీ
    నామమను పరదైసులో నేడే నిను నేర్చున్‌
    రక్షణానందముతో నిప్పుడే రంజిల్లెదవు ప్రియుడా         ||ప్రభు||

పాట – 13
ప||    క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా – నీ రాకయే క్షణమో
    నా కన్నీరు తుడచుటకు – నన్నాదరించుటకు
    నా యేసయ్యా మేఘములపైనా వేవేగరారమ్ము         ||క్రీస్తే||
1.    మధ్యకాశంలో పరలోకదూతలతో వచ్చేవేళ     
    నా కొరకు గాయపడిన – గయమును ముద్దాడుటకు
    నీటి కొరకై వేచినా గూడబాతుల వంచించేదన్‌         ||క్రీస్తే||
2.    ధవళ వస్త్రం ధరియించినా – పరిశుద్ధల సంఘమదీ
    నీధరికి చేరి నేను – హల్లెలూయ పాడుటకు
    బుద్దిగల నిర్మల కనునోపోలి సిద్దాపడెన్‌             ||క్రీస్తే||
3.    సూర్య చంద్ర తారలనే దాటి పరదైసులో
    ఆస్పటికనది తీరా – జీవవృక్ష నీడలో
    నిత్యమైన నివాసము చేయుటకు – వేచియుందున్‌         ||క్రీస్తే||
పాట – 14
ప||    ప్రియుడనీ ప్రేమ పాదముల్‌ చేరితి నెమ్మది నెమ్మదియే
    ఆసక్తితో నిను& పాడి స్తుతించెద
    ఆనందం – ఆనందమే                 ||2||
    ఆశ్చర్యమే – ఆశ్చర్యమే
    ఆరాధనా – ఆరాధనా                 ||ప్రియుడా||
    నీశక్తికార్యముల్‌ తలంచి తలంచి
    ఉల్లము పొంగెనయ్యా                     ||2||
    మంచివాడా – మంచిచేయువాడా
    స్తోత్రము – స్తోత్రమయ్యా                 ||2||
    మంచివాడా – మహోన్నతుడా
    ఆరాధనా – ఆరాధనా                 ||ప్రియుడా||
    బలమైన గొఱ్ఱగ పాపములను కట్టి
    మోసి తీర్చితివే
    పరిశుద్ధ రక్తము నాకొరకెనయ్యా
    నాకెంతో భాగ్యమయ్యా
    పరిశుద్దుడా – పరమాత్ముడా
    ఆరాధనా – ఆరాధనా                 ||ప్రియుడా||
    ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా నిన్ను విడువనయ్యా
    రక్తము చింది సాక్షిగా వుండెను.
    నిశ్చయం – నిశ్చయమే
    రక్షకుడా – యేసునాధ
    ఆరాధనా – ఆరాధనా                 ||ప్రియుడా||
పాట – 15
ప||    రెండే రెండుదారులు – ఏ దారి కావాలో మానవా
    ఒకటి పరలోకం – మరియొకటి పాతాళం
    పరలోకం కావాలో – పాతాళం కావాలో తెలుసుకో మానవా
1.    పరలోకం గొప్ప వెలుగుతో – ఉన్నది పరిశుద్దల కోసం
    రాత్రి ఉండదు – చీకటి ఉండదు – సూర్యుడుండడు – చంద్రుడుండడు (2)
    దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును
    యుగయుగములు పరలోక చెరుతావు
    యేసుప్రభుని నమ్ముకో పరలోకం రాజ్యమేలు చుండును.         ||రెండే||
2.    పాతాళం అగ్ని గుండము – ఉన్నది ఘోర పాపులకోసం
    అగ్ని ఆరదు పురుగు చావదు – గప్పుగప్పున రగులుచుండెను
    అగ్నిలోన ధనవంతుడు బాధపడుచుండెను అబ్రాహము
    రొమ్మున లాజరును చూచాడు
    ధవంతుడు చాచిదాహమని అడిగాడు                 ||రెండే||
3.    పుడతావు నీవు దిగంబరిగా వెళ్ళతావు నీవు దిగంబరిగా         ||2||
    గాలిమేడలు ఎన్నో కడతావు – నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు     ||2||
    లోకములో ఘోరమైన పాపాలు చేస్తారు
    ఆపాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి.
    అగ్నిలోన పడకుండా యేసుప్రభుని నమ్ముకో             ||రెండే||
పాట – 16
ప||    దేవుని స్తుతియించుడి! ఎల్లప్పుడు దేవుని స్తుతియించడి         ఆ ||దే||
1.    ఆయన పరిసుద్ధ ఆలయమందు ఆయన సన్నిదిలో         ఆ ||దే||
2.    ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశ విశాలమందు         ఆ ||దే||
3.    ఆయన పరార్కమ కార్యముల బట్టి ఆయన ప్రభావును         ఆ ||దే||
4.    బూర ధ్వనితో ఆయనన్‌ స్తుతియించుడి సర్వమండలముతో         ఆ ||దే||
5.    సన్నని తంతుల సితారతోను చక్కని స్వరములతో             ఆ ||దే||
6.    తంబురతోను నాట్యముతోను తంతి వాద్యముతోను – ఆ         ||దే||
7.    పిల్లన గ్రోవుల చల్లగ నూది
    ఎల్ల ప్రజలు జేరి – ఆ ఆ                     ||దే||
8.    మ్రోగు తాములతో ఆయనన్‌ స్తుతించుడి
    గంభీర తాళముతో – ఆ                     ||దే||
9.    సకల ప్రాణుల యెహోవాను స్తుతించుడి
    హల్లెలూయాఆమేన్‌ – ఆ                     ||దే||
పాట – 17
ప||    రాజులకు రాజైన యీ – మన విభుని – పూజసేయుటకు రండి
    జయశాలి కన్న – మనకింక – రాజెవ్వరును లేరని     ||రాజలలకు||
1.    కరుణ గల సోదరుండై – యీయన – ధరణి కేతెంచెనయ్యా తిరముగా
    నమ్ముకొనిన – మన కొసగు – బరలోక రాజ్యమ్మును     ||రాజలలకు||
2.    నక్కలకు బరియలుండె – నాశాక పకక్షులకు గూళ్లుండెను ఒక్కింత
    స్ధలమైనను – మన విభుని – కెక్కడ లేకుండెను
3.    అపహాసములు సేయుచు – నాయన యాసనముపై నుమియుచు
    మాలిన సైనికు-లందరును నెపము లెంచుచు గొట్టిరి     ||రాజులకు||
4.    కరమునం దొక్కరెల్లు – పుడకను – దిరముగా నునిచి వారల్‌ – ధరణీపతి
    శ్రేష్ఠుడా నీకిపుడు – దండ మనుచును – మ్రొక్కిరి
పాట – 18
1.    కర్తా మమ్మును దీవించి
    క్షేమమిచ్చి పంపుము
    జీవాహార వార్తనిచిచ&
    మమ్మును పోషించుము     
2.    ఇహ నిన్ను వేడుకొని
    బహుగా స్తుతింతుము
    పరమందు చేరి యింక
    స్తోత్రము చెల్లంతుము
పాట – 19
ప||    క్రొత్తయేడు మొదలు బెట్టెను – మన బ్రతుకునందు క్రొత్త
    మనసు తోడ మీరు క్రొత్త యేట ప్రభుని సేవ దత్తరపడ
    కుండ జేయు – టత్తమోత్తమంబు జూడ             ||క్రొత్త||
1.    పొందయున్న మేలులన్నియు బొంకంబు మీఱ – డెందమందు
    స్మరణ జేయుడి – యిందు మీరు మొదలు బెట్టు – పందెమందు
    గెలవవలు – నందముగను రవినిబోలి – నలయకుండ
    మెలయకుండ                     ||క్రొత్త||
2.    మేలు సేయదడ వొనర్పగా – మీరెఱుగునట్లు – కాలమంత నిరుడు
    గడిచెగా – ప్రాలుమాలి యుండకుండ – జాలమేలు సేవ వల
    యు – జాల జనముల కిమ్మాను – యేలు నామ ఘనతకొరకు     ||క్రొత్త||
పాట – 20
ప||    సంతోషముతో నిచ్చెడు వారిని – నెంతో దేవుడు ప్రేమించున్‌ – వింతగ వలసిన
    దంతయు నొసగును – వినయ మనసుగల విశ్వాసులకును           ||సంతో||
1.     అత్యాసక్తితో నధిక ప్రేమతో – నంధకార జనులందఱకు – సత్యసువార్తను
    జూటించుటకై – సతతము దిరిగెడు – సద్భుక్తులకు     ||సంతో||
2.    వేదవాక్యమును వేరువేరు గ్రా-మాదుల నుండెడు బాలురకు – సాధులు ప్రభుని
    సుబోధలు నేర్పెడి – సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు         ||సంతో||
3.    దిక్కెవ్వరు లేకుండెడి దీనుల – తక్కువలన్నిటి దీర్చుటకై – నిక్కపు రక్షణ నిద్దరలో
    నలు – ప్రక్కలలో బ్రక – టించుట కొరకై
4.     ఇయ్యండి మీకియం బడునని – యియ్యంగల ప్రభుయే సనెను – ఇయ్యది
    మరువక – మదిని నుంచుకొని – యియ్యవలెను మన యీవుల నికను ||సంతో||
5.    భక్తిగలిగి ప్రభు పనికిచ్చుట బహు-యుక్తమటంచును-దారతతో-శక్తికొలది         

మన భక్తి నుండి యా-సక్తితో నిరతము – నియ వలెను ||సంతో||

పాట – 21
ప||    నీ ధనము నీ ఘనము – ప్రభు యేసుదే – నీ థమ భాగమునీయ వెనుదీతువా||
1.    ధరలోన ధనధాన్యముల నీయగా – కరుణించి కాపాడి రక్షింపగా
    పరలోక నాధుండు నీకయగా – మారి యేసు కొరకీయ వేనుదీతువా       ||నీ||
2.    పాడిపంటలు ప్రభువు నీకీయగా – కూడు గుడ్డలు నీకు దయచేయగా
    వేడంగ ప్రభు యేసు నామంబును – గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా      ||నీ||
3.    వెలుగు నీడలు గాలి వర్షంబులు – కలిగించె ప్రభు నీకు ఉచితంగా! వెలిగించ
    ధరపైని ప్రభు నామము – కలిమికొలది ప్రభున కర్పింపవా     ||నీ||
4.    కలిగించె సకలంబు సమృద్ధిగా-తొలగించె పలు బాధ భరితంబులు బాలియాయే
    నీ పాపముల కేసువే – చెలువంగ ప్రభుకీయ చింతింతువా         ||నీ||
పాట – 22
ప||    దేవర నీ – దీవెనలు – ధారళముగను వీరలపై – బాగుగ వేగమె
    దిగనిమ్ము – పావన యేసుని ద్వారగను
1.    దంపతులు దండిగ నీ – ధాత్రిలో వెలయుచు సంపదలన్‌ – సొంపుగ
    నింపుగ పెంపగుచు స – హింపున వీరు సుఖించుటకై                  ||దేవర||
2.    ఈ కవను నీ కరుణన్‌ – ఆకరువరకును లోకములో – శోకము లేకయె
    యేకముగా – బ్రాకటముగను జేసుకొనుము              ||దేవర||
3.    మెండుగ భూమండలపు – గండములలో వీరుండగను – తండ్రిగ
    దండిగ నండినుండి – వెండియు వానిని ఖండించవే          ||దేవర||
4.    ఇద్దర వీరిద్ధరును – శుద్ధులై నిన్ను సేవించుటకై – శ్రద్దతో బుద్దిగ
    సిద్ధపడన్‌ – దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్‌              ||దేవర||
పాట – 23
ప||    పరదేశుల మో ప్రియులారా మన పురమిదిగా దేపుడు నిజముగ     ||పర||
1.    చిత్ర వస్తువుల – చెల్లడి యొక వి చిత్రమైన సంత – లోకము     ||పర||
2.    సంత గొల్లు సడలిన చెందం – బందయు సద్ధణగున్‌ – నిజముగ     ||పర||
3.    స్ధిరమని నమ్మకు – ధర యెవ్వరికిని – పరలోకమె స్ధిరము – నిజముగ     ||పర||
4.    మేడలు మిద్దెలు – మేలగు సరకులు – పాడై కనబడవే – నిజముగ     ||పర||     

5.    ధన ధాన్యంబులు-దరగక మానవు-పనిపాటులు పోయె-నిజముగ     ||పర||
6.    ఎన్ని నాళ్ళు మన – మిలలో బ్రతికిన – మన్నై పోవునుగా – దేహము     ||పర||
7.    వచ్చితి మిచటికి – వట్టి హస్తముల – దెచ్చిన దేదియు లే -దుగదా      ||పర||
8.    ఎట్లు వచ్చితిమి – యీ లోకమునకు – అట్లు వెళ్ళవలయున్‌ – మింటికి     ||పర||
9.    యేసే మార్గము – యేసే సత్యము – యేసే జీవముగా – నిజముగ     ||పర||
పాట – 24
రగులుతున్నది విప్లవ జ్వాల కదులుతున్నది క్రైస్తవ సైన్యం
పాపభారంతో మునిగిపోతున్నావు
మనసు విప్పి నివు తెలుసుకొరన్న                     ||రగు||
ఎంత కాలం నీవు నశించుతావు
నాలుగోడల మధ్య నలుగుతున్నావు
మొద్దుబారిని నీ చెవులు
రన్న వినగానే నీవు మోసపోతున్నావు                     ||రగు||
ఆస్తిపాస్తులకు ఆడుతున్నది
వెదుకుతున్నది నీ బ్రతుకురన్న
గమ్యం తెలియదు నీ జివతానికి
దారి చూడరా ఓ మానవుడా                     ||రగు||
సత్యమనె వాక్యము కొరకు
రగలించే నీవు విప్లవ జ్వాల
మోసపోకు నీవు ఆది దంపతులొలె
చిగురించు నీవు ఓ మానవుడా
పాట – 25
క్రైస్తవుడే జయశాలి జయించువాడురా
అతివాదుల మితవాదుల జ్ఞానంపై ఎదురునిల్చి
వాదించి ఒప్పించి క్రీస్తు కొరకు చెరపట్టి
శాస్త్రవేత్త జ్ఞానమునే తలక్రిందులు చేసేటి
క్రీస్తు జ్ఞానము మహాజ్ఞానము మహావేదము
ఎదురులేదు జయశాలికి యేసుక్రీస్తు రాజ్యంలో
రాజ్యమేలె యేసును సాటిచెప్పె క్రైస్తవుడు
పాట – 26
ఎక్కడున్నవుర క్రైస్తవుడా మృతినుండి మేల్కోర
ఉద్భవించెను నీలో క్రీస్తు వెలుగుగ నీవు ప్రకాశించురా
1.     లోకానికి జ్యోతివి నీవు – ఆనిత్యం వెలుగుగ వెలుగువు నీవు
    ఆరిపోకురా రాలిపోకురా యేసుక్రీస్తును ధరించుకోర
2.    నిత్యజీవము నీలో ఉన్నది – సత్యవాక్యము ఎరుగకున్నవు
    సాతానును చీల్చుతు నీవు – అపవాదికి బాణం వెయ్యు      
3.    మృతులల్లోన మూల్గకు నీవు కాంతి రేఖవై తేజరిల్లర
    లోకమంతట యేసు వార్తను చాటి చెప్పరా క్రైస్తవుడా
పాట – 27
ప్రపంచ క్రైస్తవులారా మీరు ఏకంకండి వాక్యం కొరకు
1)    విశ్వసించిన క్రైస్తవులంతా ఏకమై స్థిర ఆస్తులు అమ్మి
    అక్కర కొలది పంచి పెట్టిరి మొదటి శతాబ్ధపు క్రైస్తవులంతా
2)    స్వస్థతలంటు వరాలు అంటు
    పండుగలంటు పబ్బం గడుపుతు – క్రీస్తును అవహేళన చేస్తు
    సాతను భోధకకులుగా మారిపోయిరి
3)    ఏకమై ఉన్న క్రైస్తవులలో క్రీస్తు విరోధి బయలు దేరెను
    యేసుకు జయ్‌ జయ్‌ అంటు రాళ్ళ వర్షము రప్పిస్తున్నాడు
    విరోధ భావము రగిలిస్తున్నాడు
4)     బోధించే బోదకులెందరో బయలు దేరిరి బోధించె సంస్ధలెన్నో నిర్మించిరి
    యేసు చెప్పిన బోధను మార్చకు ప్రపంచక్రైస్తవ డినామినేషన్‌
5)     తరతరాలుగ నశించిపోయె క్రైస్తవులారా యేసు వాక్యము ప్రజలకు చెప్పుచు
    లోకరక్షణకు పాటుపడండి ఎల్లవేళలా
పాట – 28
ప||    ప్రపంచమా కండ్లు దెరువుమా యేసుక్రీస్తు నీ యెదుట ఉన్నడు
    సకల జాతులకు రక్షకుడేసు ఎరుగావాయె ఓ పాపప్రపంచమా
1)    గొఱ్ఱెపిల్లను వదించినట్టు క్రీస్తుప్రాణము బలిగా ఇచ్చెను
    పాపప్రపంచ విముక్తి కొరకు
    ప్రపంచమా ఓ ప్రపంచమా కాలగతులను లెక్కించుటకు
    నీ కన్ను పడింది శకపురుషునిపై
2)     ప్రపంచమంతా క్రీస్తు పోలికై సృజింపబడెను
    పుట్టింపడిన ప్రకృతి చక్రం
    గతిని తప్పని స్థితిలో ఉంది
    ప్రపంచమాంతా గతిని మరచెను అడ్డదారిన పడిపోతుంది.
3)    ఎందరెందరినో మహాత్ములను మహానుభావుల కన్నది
    ఈ భూప్రపంచం
    క్రీస్తే యుగపురుషునిగా శకపురుషునిగ
    స్ధిరంగ నిలిచె విశ్వకోటి ఈ మానవ గుండెలో
పాట – 29
ప||    జగమంతా చాటనా ఈ వాక్యము దరణిలో
    అంధకార చీకటిలో నిద్రించుచున్నది మానవలోకము
1)    నీకోసం సృష్టిరా నీకోసం వెలుగురా
    నీవు లేనిదె సృష్టిలేదురా
2)     పాపులుగా బ్రతుకుచున్న ఈ లోకంలో
    బలి ఆయెరా క్రీస్తు అందరి కొరకు
3)     వాక్యమె ఆయుధమై సువార్తను చేపట్టి
    విమర్శకులను ఎదిరించు వేగిరపడు క్రైస్తవుడ
పాట – 30
ప||    చింతించె మానవా చిగురించె దెన్నడు
    తండ్రి పనులకై నీవు లేచి పరుగు తీయరా
1)     జీవించుచున్నావని పేరు మాత్రమే నీవు     
     మృతిని నని ఎరుగక ఎందాక నీ పరుగులు
2)     వికసించు వాక్యమువలె పరిమళించు యేసులో
    ప్రపంచ మానవాళికి ప్రకటించుర సత్యము
3)    మానవ కల్యాణానికి క్రీస్తు సిలువ ఒరిగాడు
    చిందించిన రక్తమే నీ పాపం కారణం
పాట – 31
ప||    యేసుక్రీస్తు తమ్ములం సిలువకు మేము సైనికులం
    యుద్దానికి వీరులం అపవాదికి శూరులం
1)     క్రీస్తు వైపు చూచుకుంటు సిలువను మేము మోసుకుంటూ
    సూచక క్రియలు అడుగువారికి సిలువ వేసిన యేసుని చాటిస్తున్నాం
2)    సాతాను అనుచారుల బోధను ఎదిరించుటకు
    బయలుదేరుతున్నాం మేము ఈ లోక యాత్రలో
3)    భూలోకం తలక్రిందులు చేయుటకు యిక్కడికి వచ్చినాము
    క్రీస్తుకు మేము సాకక్షులమై సత్యాన్ని ప్రబలించె వీరులం
పాట – 32
కన్నీరు కార్చకు ఓ మానవుడా
కరుణాల యేసు నిన్ను చూసిండు
1)     దీవి నుండి భువికి దిగివచ్చిండు
    సిలువలో బలియై తిరిగి లేచిండు
    జీవ మార్గమునీకు చూపిండు
    త్యాగశీలి మన అన్న యేసు
2)    నిను పెంచినాడు నిను చేర్చుకొనెను
    తండ్రికి నీవు తిరగబడియున్నావు
    సృష్టి పుట్టక ముందు తండ్రి నిన్ను
    నియమించుటకొనెను క్రీస్తులో అన్న
3)     నిను పంపు తండ్రి నిన్ను కన్నడు
    సృష్టి నంతటిని శాశించురన్న
    తండ్రికి నీవు వారసుడవు
    రారాజువై నీవు ఏలుర అన్న
పాట – 33
ప||    దివికేగిన త్యాగముర్తివే మా ఏసన్న
    కల్వరీలో కార్చినావు నీ రక్తం ఏసన్న
1)    ధారపోసినా రక్తం నలుదిశలా ప్రవహించె
    ఏసన్నా … ఆ కొరడాలతో కొట్టి నిన్ను సిలువ పైన పరుడబెట్టి
    ఆరసేతులమేకులేసి సిలువకు దిగకొట్టినారు.
2)    పదునైన ముళ్ల కిరీటం అల్లిరి – శిరస్సుపైన మోదిరి
    ఏసన్నా … ఆ ముఖముపైన ఉమ్మివేసి నీ వస్త్రము పంచుకొనిరి
    సిలువను నీపైన మెపి చిత్రహింసలు పెట్టిరి
3)    కల్వరి గిరకేగుచుండ కొరడాలతో నిను బాదిరి
    ఏసన్నా … ఆ… మరణం నిన్ను బంధించుట
    అసాధ్యం ఏసన్న – మృతిని గెలిచినావన్నా
    మాకు మార్గమైతివి ఏసన్న
పాట – 34
    సకలా శాస్త్రాలను తలదన్ని వెలివెసెను
    దివ్యమైన యేసు బోధ
    నింగి నేలకు దిక్కులాయె కరుణమయుని త్యాగఫలం
    శాస్థ్రమా సమాజమెంత నీకు
1)     సకలా శాస్త్రాలకు మూలం ఈ విశ్వం
    విశ్వ ఆవిర్భావమే శబ్దమే క్రీస్తు
    ఆ శబ్ధం పరమాత్మం జీవగ్రంధమే బైబిల్‌
    శాస్త్రమా సమాజమెంత నీకు
2)    ఎన్నో గ్రంధాలు వెలిసె జీవంలేని గ్రంధాలు
    అవివేకుల జ్ఞానంతో లికించిరి శాస్త్రాలను
    కనబడని మాట చేత కలిగింది ఈ విశ్వం
    శాస్త్రమా సమాజమెంత నీకు     
3)    ఇకనైన కనులు తెరువు అవివేకి శాస్త్రవేత్త
    విశ్వమంత అవరించె పరమాత్ముని జ్ఞానం
    జీవగ్రంధంలో నీవు తలచూస్తే
    నీకన్నులు పచ్చబడతాయి
    శాస్త్రమా సమాజమెంత నీకు             
పాట – 35
ప||    వందనమో వందనమన్న మా అన్న యేసన్నా
    పరిశుద్దలవందనమన్న, దేవదూతల వందనమన్న, దేశనాయకుల
    వందనమన్న, పంచభూతముల వందన మన్న, ప్రపంచ ప్రజల
    వందనమన్న జీవరాసుల వందనమన్న …. అరెరె… హా
    క్రైస్తవుల వందన మన్న మా అన్న యేసన్న
1.    భూలోకంలో పాడు బ్రతుకులు, చెలరేగిన వ్యభిచారి బ్రతుకులు
    కుములుచున్న రోగుల బ్రతుకులు, అపవాదితో షికారు బ్రతుకులు
    చెరచబడ్డ ఆ బ్రతుకులు ఆయె, ఆత్మ రోగులకు మందులు లేవు
    అరెరె… హా.. మా ఆత్మల రక్షణ నీవన్న మా అన్న యేసన్న
2)    భూకంపాలు వస్తయన్నవు భవిషత్‌ జ్ఞానం నెరవేరింది. భవంతులన్ని
    నేలమట్టమై లక్షల ప్రజల అవితులు బాసిరి, భూగర్భలను పరిశోధించిరి
    శాస్త్రవేత్తలు తల్లక్రిందులై మాడిపోయిరి
    అరెరె… హా నీవు పలికినవన్ని చరిత్రపుటలే మా అన్న యేసన్న
3)    వందల వేల సంవత్సరాల చరిత్ర గలది సత్యవేదమను బైబిలు
    గ్రంధం, మానవులందరి జీవగ్రంధము, యేసే మార్గం
    యేసే జీవ త్యాగశీలుకు త్యాగశీలవై సమాధి గెలిచిన
    మృత్యంజయుడు అరెరె….. హా. నీవు చేసినవన్ని
    యదార్ధగాధలె మా అన్న ఏసన్నా
పాట – 36
ప||    యేసయ్య చందనాలో ఎన్నల – రాజానీకొందనాలో ఎన్నల
1)    యేసయ్య వచ్చునప్పుడు ఎన్నెలో ఎన్నల
    కరువులు భూకంపాలు ఎన్నెలో ఎన్నల
    అక్కడక్కడ యుద్దాలు ఎన్నెలో ఎన్నల
    జనం మీద జనం లేచు ఎన్నెలో ఎన్నల
    ప్రేమలు చల్లారునయ్యా ఎన్నల
    ప్రభువు రాకడకు సూచన ఎన్నల
2)    మేఘాల మీద వచ్చు ఎన్నెలో ఎన్నల
    తన దూత గనము తోడ ఎన్నోలో ఎన్నల
    గర్జించు సింహాల ఎన్నెలో ఎన్నల
    మరలా రానై యుండె ఎన్నెలో ఎన్నల
    కడబూరమ్రోగుతుంది ఎన్నెలో ఎన్నల
    కడబూర మ్రోగుతుంది ఎన్నల
    ప్రభువు ప్రేమ కఠనమౌను ఎన్నల
పాట – 37
నా తోడు నీవుండగా దేవా – స్తుతిగీతము పాడెదన్‌
నాతోడు నీవుండగా నేను – హల్లెలుయపాడెదన్‌
రాజుల రాజ ప్రభువుల ప్రభువా
మరణము జయించిన మహోన్నతుడ
నాతోడు నీవుండగా దేవా – దేనికి భయపడను
నా తోడు నీవుండగా నేను – ఎవరికి భయపడను         ||నా||
1)     కష్టనష్టముల – భయము భీతి
    శోధన శ్రమలు – నాకు కలుగగా             ||నాతోడు||     2)    నెళవరులు నా – బందుమిత్రులు
    దూషించి – నిందించినను                 ||నాతోడు||     పాట – 38
ముందుకె సాగెదను – ఇక వెనుకకు నె తిరుగను
నా మిగిలిన జీవిత దినములన్నియు
యేసుతో నడిచెదను
1)     లోకాశలను నేత్రాశలను శరీరాలను చంపెదను
    పరి శుద్ధులకు తగినట్లుగా ఈ లోకంలో జీవ్‌ితును
2)    సణిగుగొణిగు – సంశయములను
    నా హృదయము నుండి తొలగింతును     
    నూతన బ్రతుకు నూతన మనస్సు
    నూతన మార్గములో నిడదను
3)    శోధన శ్రమల – కష్టనష్టములు
    ఈ లోకయాత్రలో ఎదురైనను
    ఊపిరి నాలో ఉన్నంతవరకు
    క్రీస్తుతో నేను – నడిచెదను
4)    క్రీస్తుని నుంచి సైనికునిగను
    అపవాదిని ఎదించుటకై
    దేవుడిచ్చు సర్వంగ కవచము
    ధరియంచి నేను పోరాడుదున్‌
5)    వెనుక ఉన్నవి అన్నియు మరచి
    ముందున్న బహుమానము పొంద
    దేవుడిచ్చు బహుమానము పొంద
    గురి యొద్దకె నేను పరిగుడుదును
పాట – 39
ప||    అవని అంత ఆయనదే అయినా స్ధలమేది
    అందరికి హృదయముంది యేసుకు చోటేది
1.     పశువులు తమ యజమాని స్వరమెరుగును గాని
    నరులు దైవతనయుని స్వరమెరుగలేదు అదే శోచనీయం
2.    సిలువ మీద యేసయ్య కనులు మూయ వేళా
    సమాధులు తన కనులు తెరచి చూచె నేల? సజీవులైరిచాల
3.    పసి పాపగ జన్మంప పశుల తొట్టి పరుపాయె
    తన వాల్చి విశ్రమింప సిలువనిచ్చె లోకం, సిలువనిచ్చె లోకం
పాట – 40
ప||    పరలోకము నాదిలే – యేసులోనే ప్రేమతో నన్ను పిలిచెలే
    కొపతో నన్ను కరుణించలే – యేసు కరుణించలే
1.    పాపినైన నన్ను పావనుడేసు ప్రేమించెలే – మరణ పాత్రుడనేనూ
    మహితుడేసు మన్నించెలే
    ఏమని వివరింథు యేసయ్య ప్రేమను
    సంతసమున స్తుతియింతులే నేను స్తుతియింతులే         ||పర||
2.    కష్టనష్టములెన్నో కళకాలము నన్ను కభళించిన
    వ్యాధి బాధలు ఎన్నో విడువక నన్ను వేధించిన
    పరమున నేను ప్రభువుతో నుందునని
    సహనము చూపుచు సహియింతులే – నేను సహింతులే     ||పర||
పాట – 41
ప||    నిన్ను సేవింతును నిన్ను ధ్యానింతుము
    మాకు నీవే సహయుండవు
1.    దరిచేరంగలెమైతిమి – దారి చూపించి నడిపించుమా
    మొరలాలించుమా – మమ్ము కరుణించుమా
    పరిశుద్దాత్మాను తోడియుమా                 ||నిను||    
2.    పావన మూర్తి పాలించుమా – పరమ భాగ్యము మాకియుమా
    శోధనలేక బాధలు బావుమా
    పరిశుద్దాత్మను తోడియుమా                 ||నిను||    
పాట – 42
ప||     వాక్యమే శరీరదారియై వసించెను
    జీవమే శరీరులను వెలిగించును
1.    కృపము సత్యముల అల్లేలూయా నీతి నియమములు
    కలిసి మెలసి భువిలో దివిలో ఇలలో సత్యము మనకై నిలిచెను ||వాక్య||
2.    పాప శాపములు అల్లెలూయా మరణ బంధములు అలెల్లలూయా
    తొలగిపోయి విడుదలాయే – యేసు నామమే పావన నామము     ||వాక్య||
3.    ఆశ్చర్య కరుడు హల్లెలూయా ఆలోచన కర్త హల్లెలూయా
    నిత్యుడైన తండ్రి దేవుడు నీతి సూర్యడు భువి నుదయించే
4.    ఉన్నత స్ధలములలో అలెల్లలూయా దేవుని మహిమ అల్లెలూయా
    పుడమిపైన జనులందరికి శాంతి శుభములు కలుగునూకని.
పాట – 43
ప||    మహదేవా మహోన్నతుడా అనంత ఆది ఆమరవణి
    పరివృత తేజో పరిశుద్దుడా – దివ్యాత్మదేవా మానవుడా
1.    నీ రక్తం పాప ఫలహరణం – నీ మరణం పాపికేశరణం
    నీ అర్పణ నిత్య సంపూర్ణం – నీ జీవం నవ్య దివితేజం
2.    నీ వాక్యం మమ్ము దర్శించె – నీ సత్యం మమ్ము సంధించే
    నీ ఆత్మయే మమ్ము వెలిగించె – నీ కృపలే మాకు బలమాయె
3.    నీ పోలిక మాకు నోసగితివి నీ సోత్తుగ మమ్ము చేసితివి
    నీ సేవకు మమ్ము పిలిచితివి – నీ యాత్మతో మమ్ము పొదగితివి
4.    పరిపూర్ణత మాకు నీచితం – పరిపూర్ణత మాకు నీ సత్యం
    పరలోక పట్టణ పౌరులము – ప్రభావమైమకు వారసులం
పాట – 44
ప||    ఉజ్జీవ మిచ్చు ఆత్మను జీవింప జేయుమా
    నీ జీవం మాకు నీయుమా – ఉన్నత దైవమా
1.    నిరాశతో నిలచితి – పెరాశతో అలసితి
    కరుణించు – వెలిగించు నాదు – దివ్వెను
2.    నామది గైకొని – నా హృది కనుగొని
    కరుణించు – వెలిగించు నాదు – దివ్వెను     
పాట – 45
ప||    కరుణమయా – కృపజూపుమయా
    కనుగొంటిని – నా హృదయవ్యధ ప్రభో రక్షింపుమయా
1.    లోకములోని కలుషముతో – నిండెను హృదయం మోసముతో
    శాపముతో బహుశాపముతో – నిండెను హృదయం వ్యాధులతో
    మదిలో నిత్యము నిన్నుగాంచుట కొరకై
    నూతన హృదము నాకిమ్ము ప్రభు                 ||2||
2.    రాతి గుండెను కరిగించి – మాంసపు గుండెగ మార్చుమయ్యా
    శుద్దాత్మ ప్రసాదముతో – నూతన భావము కలిగించుము
    నీ కట్టడలను గైకొనుట కొరకై – నూతన హృదయము నాకిమ్ము ప్రభు
పాట – 46
ప||    యేసులేని ఈ జీవితం – పొందలేవు మోక్ష రాజ్యము
    దినములు గడుచుచున్నవి – క్షణములు దొర్లుచున్నవి
    ఆయుష్ష తరుగుచున్దఇ – అంతము పిలుచుచున్నదీ     ||యేసు||
1.    అవిరెగిరి పోతున్నట్లు ఎగిరిపోవుచున్నది
    ఆకాశము కదులునట్లు కదులుచున్నది
2.    అంతమునే దాపునకు చెరనున్నది
    భూమి విడుచు గడియకు రానున్నది
3.    కనులు వుండి చూడనైతి నా పపము హృదయముండి ఎరుగనైతి నాశాపము
    మృత్యుబాట నుండి ఎవరు రక్షించెదరు – నా కొరకు బలియైసెగదా  ||యేసు||
4.    పెరుగుతుంది వయస్సని అనుకొన్నావు
    మరి తరుగుతుంది ఆయుష్షని తెలియకున్నదా
    పరమార్ధమిదే మనుష్యులకు తెలియకున్నది ప్రభు
    యేసుని సన్నిధికి రానున్నది. దినములు గుడుచుచున్నవి.
పాట – 47
ప||    రెండే రెండు మార్గములు నీ యెదుటనే యున్నవి
    జీవమార్గము మరి మరణ మార్గము
    ఓ సహోదరా ఓ సహోదరి ఏది నీ మార్గము         ||రెండే||
1.    జీవ మార్గము ఇరుకైన దనుచు – జీవితాన్ని బలిచేయకు జీవితంలో
    ఈ తరుణము మల్లిరాదు నీకెన్నడు – జీవజలములు నిచ్చు యేసును
    జీవితాంతము కీర్తించుము – జీవహరము నిచ్చు క్రీస్తును ఆత్మతో ఆరాధించము
    ఓ సహోదరి ఓ సహోదరా ఏది నీ మార్గము         ||రెండే||
2.    పాపు జీవితము మరణమని – మరణ మార్గము నరకమని
    ఆరని నరకాగ్నిలోనికి ఎందుకునీ ప్రయాణము- క్రీస్తులో సాక్షిగ జీవపు బాటలో     

3.    జీవితాన్ని సరిదిద్దుకో – రక్షకుడేసుని శరణు వేడెగ నిత్య జీవాన్ని పొందుకో
    ఓ సహోదరి – ఓ సహోదరా ఏది నీ మార్గము         ||రెండే||
పాట – 48
ప||    ఆ… ఆ… స్తుతింతు యేసు రక్షకా
    యేసు రక్షకా నిన్నె స్తుతింతు రక్షకా నిన్నే స్తుతింతు రక్షకా
1.    కష్టాల యందు స్తుతింతు – నష్టాల యందు స్తుతింతు రక్షకా
    నిష్ట అదే కదా! స్పష్టమదే కదా! శ్రేష్ట మదేకదా
2.    అనుమాన మున్న స్తుతింతు – అవమానమున్న స్తుతింతు
    అపవాదురాని – అపవాదుకాని – కృపనీదేయని
3.    కరువు దుఃఖములో స్తుతింతు – ఇరుసు వ్యాధులలో స్తుతింతు
    నన్ను చంపుకొని – వినుకొందునని – కనుమూసుకోని
పాట – 49
ప||    ఆత్మలో అనందించినచో మహిమ కలుగును దేవునికి
    ఈ రీతిగా మనము ఫలియించినచో ప్రభుని శిశ్యులైయుండెదము
1.    అజ్ఞాపించి ప్రభువు సృజించెను భూమి ఆకాశ జలమునులను
    అందున్నవి ప్రభువును – స్తుతియించును
    నీ స్తుతులు ప్రభునకు సమర్పించు                 ||ఆత్మ||
2.    ఆదిలో హేబేలు అర్పించెను – హృదపూర్వకమైన అర్పణము
    అర్పించుము నీవు నీ హృదయమును – వెనుదీయుటేల సోదరా     ||ఆత్మ||     

3.    ఆ ప్రభువు అజ్ఞానుపాలించుము – అధికానందము కలుగును నీకు
    అందరు ప్రభుమహిమను చూచెదరు – చెప్పశక్యము కాని ఆనందమో ||ఆత్మ||     

4.    ఆ ప్రభు వాక్యము ప్రభాలామయె – శిష్యులు బహుగా విస్తరించిరి
    ఆయత్తమా శిశ్యుడవ్వుటకు – మహిమా నుండి అధిక మహిమానొంద ||ఆత్మ||
    పాట – 50
ప||    వేలలో పదివేలలో నీవెనా ప్రియ యేసయ్యా
    మదిలోన నిన్నే నిలిపానయ్యా – నీ ప్రేమ బందినయా     ||వేల||
1.    ఓనా ప్రియ యేసయ్యా – రక్షింపనను నీ ప్రాణము
    అర్పించినవా – యీ పాపికై – స్తుతులు సదా నీకే
2.    ప్రభువా నారై నీ సర్వము – త్యాగంబు చేసినావయ్యా
    అంకితం నా జీవితమంత – నాదా నీవే నా ప్రభువడవు
పాట – 51
ప||    నీవు పరదేశివాని యెరియుంటెనీకు మేలు – పరిదశివని యెరిగి
    ఎరిగియుండి ఎరుగకున్నావు – నీ స్వంతం కాదేమి?     
    నీ హక్కులేదేమి పరలోకమే స్ధిరము             ||నీవు||
1.    ఆత్మీయ గర్వము అది పురుషునికి ప్రతినామం
    ఆయనలో నిర్వహించినన్‌ ప్రయోజుడననవలెను
    ఆరని అగ్ని తప్పించుకొని పరమును చేరుకొనుము             ||నీ||
2.    స్వస్థపర్చ యేసుడుండగా నీవు యేమి చేయలేవుగా – స్వస్థపరచువాడు
    మహిమనొందును – స్వస్ధడు మహిమపరుచను             ||నీ||
3.    నీ శరీరం ప్రభుని ఆలయం – దాని పాడు చేయబోకు
    నీ శరీరం పాడు చేసినా, దేవుడున్ను పాడు చేయును
    నీ శరీరం అగ్నిపాలె భద్రముగా కాచుకొనుము             ||నీ||
4.    ఆత్మీయ యుద్దము – నిస్వార్ధమైనది అది
    ఆత్మ ఐక్యత కలిగి – వర్ధిలుచుండ వెలను
    ఆ ప్రభుని కార్యలు గ్రహ్యము కానివి – ఉహకు అందనివి         ||నీ||
పాట – 52
ప||    ఆలయంలో ప్రవేశించండి అందరు
    స్వాగతం సుస్వాగతం యేసు నామములో
    మీ బ్రతుకులో పాపము – కలతల    
    మీ హృదయంలో భాదల కన్నీరా
    మీ కన్నీరంత తుడిచివేయు రాజు యేసు కోసం             ||ఆ||
1.    దీక్షా స్వభావము ప్రాణాస్వభామై
    వేతికే వారికంత కనబడు దీపం
    యేసురాజు మాటలే – వినుట ధన్యము
    వినుట వలన విశ్వాసం – అధిక మదీకమై
    ఆత్మలో దాహం – తీరును రారండి
    ఆనందం మనందం హల్లెలూయా
2.    ప్రభుయేసు మాటలే పెదవిలో మాటలై
    జీవ వృక్షంబుగ ఫలించాలని
    పెదవితో పెలికెదం మంచి మాటలే
    హృదయం అంత యేసు ప్రభుని ప్రేమ మాటలే
    నింపెదం – నింపెదం – కోరెదం – పొందెదం
    ఆనందం – మానందం – హల్లెలూయా             ||ఆల||
పాట – 53
ప||    నాదు యేసుని ప్రేమ
    మధురాతి – మధురం కాదా
    నన్ను మార్చిన – ప్రేమ
    మరపురానిది కాదా!
1.    నజరేయుడ నిన్ను చూడాలని
    ఆశ కలిగెను నా మదిలో
    సుందరుడు ఒకసారి నా ఆశ తీర్చవా మనసార
    ప్రియుడా నీ ఆత్మలో నన్ను చెంత చేర్చుమయ ఇలలో
    హల్లెలూయా – హలెల్లలూయ
పాట – 54
ప||    సంతోషం పొంగింది (2) సంతోషం పొంగుతున్నది – హల్లెలూయ
    యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుతున్నది.
1.    దారి తప్పి తిరిగితిని – ప్రభు ప్రేమ నేను కాననైతిని
    ఆయన నన్ను రక్షించి – తనదు రక్తంలో కడిగి జీవితమును
    మార్చి నిత్య జీవిమిచ్చెను.                 ||సంతో||
2.    నీదు పాప జీవితమును – ప్రభు సన్నిధిలో ఒప్పుకొనుము
    ఆయనీ నిన్ను క్షమియించి – తనదు రక్తంలో కడిగి జీవితమును
    మార్చి నిత్య జీవిమిచ్చెను.                 ||సంతో||
3.    ప్రభు ప్రేమ మరచితిని – లోకమాశలందు పడిపోతివా
    యేసువైపు చూడుము నీరిక్షణ పొందుము
    సాతానుపై గొప్ప విజయము నిచ్చెను             ||సంతో||
పాట – 55
ప||    యేసయ్యా నీ కృప శాశ్వతమైనది
    ఆకాశము కన్నా ఉన్నతమైనది ఉన్నతమైనది
1.    దూషకుడనూ హింసకుడనూ
    హానికరుడను దేవా హానికరుడను దేవా
    నమ్మకమైన వానిగా నను చేసితివే
    బలపచితివే స్ధిరపరచితివే             యేసయ్యా
2.    మంచి రాణవు వాని వలెనే
    జీవన వ్యాపార మందు నా జీవన వ్యాపమందూ
    చిక్కుబడనివానిగా పోరాడెదను
    జెట్టివలే పోరాడెదను                 యేసయ్యా
3.    ఎపుడు నేను బలహీనుడను
    అపుడే నీ యందు బలవంతుండనూ (2)
    నా బలహీనతయందే సంపూర్ణమగు
    నీ కృప చాలూ! నీ కృప చాలు !            యేసయ్యా
    మేసయ్యా నీ కృప చాలయ్యా
    చాలయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా             
పాట – 56
ప||    ఎందుకో దేవా నా యెదా నీ ప్రేమా  
    వింతమైనది నాదా అంతులేనిది
1.    సారి సారి జారిపోతి – మేలుగానక దూరమైతి
    చేరనైతి నీ సన్నిధిని – కోరనైతి నీ చెలిమిని
    మోసపోతిని యేసూ దోషినైతిని
    తెగపు చేసి తగని నన్ను చేరిదీసినా
    నీ ప్రేమ వింతమైనదీ నాధా అంతులేనిది          ఎందుకో
2.    పెదవులలో నే నిన్ను పొగడి – పదవికైనే ప్రాకులాడి
    గెలువనైతి నీ పరీక్ష నిలుపనైతి నీ ప్రతిష్ట
    దొంగనైతిని యేసు భంగపోతిని
    దందనకు నన్నంపలేక మందలించినా నీ ప్రేమ
    వింతమైనదీ నాధా అంతులేనిది                 ఎందుకో
పాట – 57
ప||    పూవుకింత పరిమళమా – ఒకరోజుకింత అందమా
    వూస్తున్నది ఉదయాన్నే – రాలిపోతున్నది త్వరలోనే
1.    ఓ చిన్న పూవు తన జీవితంలో పరిమళాన్ని ఇస్తుందయ్య
    ఆ పూవు కంటే మరి గొప్పగా – చేసిన నీలో ఆ పరిమళిముందా     ||పూ||
2.    ఒకనాడు యేసు మన పాపములకై – పరిమళాన్ని వెదజల్లేనూ
    ఆ యేసు మరణం నీ కోసమేనని – ఇకనైనా గమనించావా         ||పూ||
3.    అతి చిన్న ఆయువు – ప్రతి పూవు కలిగి అందరిని ఆకర్షించెను
    బహుకాలము బ్రతికి బహుజనులను పలిచి సువార్తను వెదజల్లవా     ||పూ||    పాట – 58
ప||    స్తుతి యించెద నేనామం దేవా అనుదినం
1.    దయతో కాపాడినావు – కృపనే చూపించినావు
    నిను నే మరువ నేసు – నినునే ఇడువనేసు         ||స్తుతి||
2.    పాపినై యుండగనేసు – రక్షించి దరిచేర్చినావు
    నినునే మరువ నేసు – నినునే విడువనేసు        ||స్తుతి||
3.    సిలువే నాకు శరణం – నీవే నాకు మార్గం
    నినునే మరువనేసు – నినువే విడువనేసు            ||స్తుతి||
పాట – 59
ప||    అడవి వృక్షములో జల్దరు వృక్షమెట్లున్నదో
    పరిశుద్దల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభువి
అ.ప.పాడెదన్‌ నాదు ప్రియుని జీవికాలమెల్ల
    అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను
1.    నింద దూషణ ఇరుకులలో – నను సుగంధముగ
    మార్చెన్‌ నీ కృపలో నన్ను నడిపి నూతన     జీవమిచ్చితివే     ||పాడెదా||
2.    నా కష్ట తరంగములలో – దుఖ సాగరములో యుండగా
    నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివే         ||పాడెదా||
3.    ఆనంద భరితమైన నేను నీ ప్రేమలో నుండుటకు     
    నీ స్వరము నాకతి మధురం – నీ ముఖము మనోహరము     ||పాడెదా||
4.    నీ చిత్తము చేయుటకు – నన్ను నీకు సమర్పించెదన్‌
    నా పరుగును తుదముట్టించి – నీ సన్నిధిలో నుండెదన్‌     ||పాడెదా||
పాట – 60
ప||    ఆ… ఆ…. ఆ…. ఆ….         ..2..
    దేవాది దేవుడు మహోపకారుడు
    మహత్యముగల – మహారాజు
    ప్రబువుల ప్రభువు – రాజుల రాజు
    ఆయన కృప నిరంతరముండును         ||దేవాది||
1.    సునాదవత్సరము – ఉత్సాహసునాదము
    నూతన సహస్రాబ్ది – నూతన శాతాబ్దము
    ఉత్తమదేవుని దానములు         ..2..        ఆ..ఆ..
2.    యుగములకు దేవుడవు – ఉన్నవాడవు అనువాడవు
    జగమంత ఏలుచున్న – జీవాదిపతి నీవే
    నీది క్రియలు ఘనమైనవి                 ..ఆ.. దేవాది
3.    అద్వితీయ దేవుడవు – ప్రభువైన యేసుక్రీస్తు
    మహిమ మహత్యములు – సర్వాది పత్యమును
    సదానీకె కలుగును గాక                 … దేవాది..
పాట – 61
ప||    నీ జీవితం – విలువైనది ఏనాడు ఏమరకు
    శ్రీ యేసునామం – నీకెంతో క్షేమం ఈనాడే యోచించుమా
    ఓ నేస్తమా తెలియునా – ప్రభుయేసు నిన్ను ప్రేమించేను
    నా నేస్తమా తెలిసికో – ప్రభుయేసునికై మరణించేను
1.    బలమైన పెనుగాలి వీచి – అలలెంతో పైపైకి లేచి
    విలువైన నీ జీవిత నావ తలక్రిందులై వాలిపోవా,
    వలదు భయము – నాకేల కలడు మేసే నీతోడు
    యేసు మరణించి మరిలిచెను – నిను ప్రేమించి దరిజెర్చును  ||నీ జీవితం||
2.    గాడాంధకారంపు లోయలో వడగాలి వడి సవ్వడిలో
    నడయాడె నీ జీవిత త్రోవ – సుడివడి నీ అడుగులు తడబడెగా     
    ”వలదు భయము
3.    కనలేని గమ్యంబు కోరి – ఎనలేని కష్టాలపాలై
    మనలేని నీ జీవిత గాధ – కలలన్ని కన్నిటి వ్యధలే
    వలదు భయము
పాట – 62
ప||    నిన్ను వెంబడించెద – నీ కాడి మోయుదున్‌
    నీదు పాదములచెంత – నేనేర్చుకొందును,
    మాదిరి నీవే – నెమ్మది నీవే – దీనుడవు యేసయ్యా
1.    పాపాంథకారం లో నుండి – రక్షించి వెలిగించితివి     
    పరిశుద్ధమైన పిలుపుతో – నీవెంబడి రమ్మంటివి
2.    లోకాశలన్ని నీ కోసం      – నేనింక ఆశించను
    లోపంబులేని ప్రేమతో – నీ కోసం జీవింతును
3.    పవిత్రపరచుకొందును – అర్పించు కొందును
    కష్టాలు శ్రమలు రేగినా – నిను వీడిపోనయ్యా
4.    ప్రేమ సువార్త ప్రకటింప – భారంబు మోపితివి
    సత్యమార్గంబు చాటగ – పంపుము నా ప్రభువా
పాట – 63
ప||    నాము లియోరే నాము లీయోరే
    ఈనుకి ంగళుకరు నాములీయరే
1.    పాపు హరేగా! తాపు హలేగా                 ..2..
    పావన్‌ బావన్‌ సుందర్‌
    మేరా! ఈశుకా నామ్‌                     ..2..
2.    శక్తి హో దేగా – శాంతి హో దేగా
    పావన్‌ భావన్‌ సుందర్‌ మేరా – ఈశుకా నామ్‌
పాట – 64
ప||    రక్షకుడు రమ్మంటున్నాడు
    రండయ్య రండి రండి పోదాము
    రండయ్య రండి రండి పోదాము
1.    పాడైనా జీవితాలు – పదిలపరచుకుందాము
    పరమాత్ముని రాకడకు – ప్రార్ధనలు చేద్దాము  
    దుర్ధినములు రాకముందె – ధరణి విడచి పోకముందె
2.    ముదురాకు రాలెనని – చిగురాకు నవ్వేనట
    చిరకాల ముందునని – ధ్యానము సమకూర్చెనట
    ఈ రాత్రి తన ప్రాణము – పోవు సంగతి మరచెనట
3.    మొహమాట పడకండి – ముందడుగు వేయండి
    వెనుదిరిగి చూడకండి – ఎవరు మీతో రారండి
    పాపములను వదలండి – ప్రభు సన్నిధి చేరండి
పాట – 65
ప||    క్రొత్తపాట పాడనురారే – క్రొత్తరూపు
    పొందరారే హల్లెలూయ ..2.. పాట పాడేదం
    ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం
1.    శృంగనాదం చేయండి హల్లెలూయ
    హోసిన్నాయనీ పాడండి హల్లెలూయ
    ఉల్లసించి పాడరే హల్లెలూయ
    ఎల్లరూ జై కొట్టరే హల్లెలూయ
2.    అడుగడుగో మన యేసు రాజు యేసుంలోన
    రానైయున్నాడు కొంచెం కాలంలోని
    జేజేలు పాడుచు ఎదురెళదాం
    ధూతాళి వలె నింగి కెగిరెళదాం
3.    కొంత కాలమే క్రైస్తవుడా యీ కన్నీరు
    అంతలో వర్షించునోయి పన్నీరు
    ప్రతి భాష్పబిందువు తుడిచునులే
    ప్రతి నోరు హల్లెలూయ పాడునులే
పాట – 66
ప||    నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు
    నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు
1.    తాగుబోతు వైనోడ – తగాదాలు పడినోడ
    అటు ఇటు తిరిగినోడ – అల్లరిపాలైనోడ
    చీట్ల పేకలాడి నీవు చెల్లకుండ పోయినోడ         ||నిన్నే||
2.    ఇంటర్‌మీడియట్‌ తప్పినోడ – ఎటుగాక పోయినొడ
    10వ క్లాసు పోయినోడ చదువారక తిరిగినోడ
    బి.ఏ. నీవు చదివేవ – బతకలేకపోయావ         ||నిన్నే||
3.    పార్టీతో తిరిగినోడ పనికిరాకపోయినోడ
    ఉద్యోగం ఊడినోడ ఎలక్షన్‌లో ఓడినోడ     
    అప్పుల పాలయ్యావ తిప్పలు పడుచున్నావ         ||నిన్నే||
4.    డబ్బులెక్కువైనోడ – నిదరపట్టకున్నవాడ
    వడ్డీలకు తిప్పేటోడ – వర్రీలో పడ్డవాడ
    కులము కులము అన్నావ కూడలేక చచ్చావ         ||నిన్నే||
పాట – 67
ప||    స్తుతినే పాడెద యెసయ్యా
    దుర్గమా – శైలమా – శృంగమా – నా సర్వమో     
1.     నా రాగానికి – జీవము నీవే
    నా గానానికి ప్రాణము నీవే
    నా ధ్యానానికి రూపము నీవే
    యేసయ్యా యేసయ్య
2.    నా గమనానికి – దావరము నీవే
    నా పయనానికి తీరము నీవే
    నా మార్గానికి – దీపము నీవే
    యేసయ్యా యేసయ్యా
3.    నా కీర్తనకు కర్తవు నీవే, నా ప్రార్ధనకు అర్ధము నీవే
    నా స్తోత్రానికి పాత్రుడ నీవే యేసయ్యా             ||స్తుతి||
పాట – 68
ప||    సరిరారు నీకిల ఎవరు
    సరిరారు నా యేసూ
    శరణం శరణం యేసే శరణం
    శరణం శరణం సిలువే శరణం
1.    మహాఘనుడా మహియోన్నతమైనా స్ధలములలోనే నివసించువాడా
    వినయము గలవారు, నలిగిన నరులు దీనులు
    చెంత నివసించి బలపరచు లేడా             ||శరణం||
2.    నా దోషములే, నీకును నాకును అడ్డముగా నిలుచుండెనయ్యా
    విననేరకుండుటకు మందము కాలేదు నీ చవులు
    నన్ను మన్నంచి, నా మని వినవా             ||శరణం||
3.    నా పాపములే నీ ముఖమును నాకు కనబడకుండా కప్పెనయ్యా
    రక్షించ నేరకయుండుటకెన్నయ నీ చేతులు     
    కురుచ కాలేదు కరుణా కిరీటి                 ||శరణం||
పాట – 69
ప||    ఇదే నీకు అనుకూలసమయము
    ఇదిగో ఇదే రక్షణ దినము
    ఈ దినమే నీకు రక్షణ దినము
    ఈ క్షణమే నీకు అనుకూల సమయము
అ.ప    రారే రారే అన్నల్లారా – రారే తమ్ముల్లారా
    రారే రారే అక్కల్లారా – రారే చెల్లెలారా             ||ఇదిగో||
1)    భూదిగంతములానివాసులారా – నావైపే చూసి రక్షణ పొందండి
    మార్గమూ నేనే – సత్యము నేనే
    జీవము నేనే అని పిలిచే ఆ యేసుని
    చేరుకో కోరుకో వేడుకో రక్షణ పొందుకో             ||రారే రారే||
2)    ద్వీపములారా నా మాట వినుడి – జనములారా
    ఇదిగో ఆలకించరండి
    దీనురును నేనే సాత్వీకుడను నేనే
    ఆశ్రయమూ నేనే అని పిలిచే ఆయేసుని
    చేరుకో, కోరుకో, నమ్ముకో నెమ్మది పొందుకో         ||రారే||
3.    దారి తప్పి తిరిగిన తమ్ములారా
    శాంతి మారమెరుగని అన్నలారా
    మార్గమూ నేనే ద్వారము నేనే
    తీరము నేనే అని పిలిచే ఆ యేసుని
    చేరుకో కోరుకో మేలుకో మనస్సు మార్చుకో         ||రారే||
4.    లోక పాపము మోసిన గొర్రెప్లిల
    కలువరిలో యాగమైన గొర్రెప్లి
    దోషిని నేనే పాపిని నేనే
    నేరము నాదే భారము నీదే  అని
    చెప్పుకో ఒప్పుకో తక్షణమే రక్షణ పొందుకో         ||రారే||

పాట – 70

ప||    యేసుని నామం ఎంతో మధురం తియ్యగా పాడండీ
    యేసుని నమ్మిన జీవితమే ఇల ధన్యమనీ చాటండీ
    యేసే మన గానం – యేసే మన జీవం
    యేసే మన ధ్యానం – యేసే దైవం
1.    సత్యము నీవె జీవము నీవె – మము నడిపించే మార్గము నీవే
    పాపుల బ్రోచే పెన్నిధి నీవే
2.    కరుణవు నీవే – శాంతివి నీవే – ఇలలో మేపే నిలచే దైవము నీవే
    ఆరని జ్యోతివి నీవే దేవా                 ||యేసే||

పాట – 71

ప||    యెహోవా నిన్ను పోలియున్నవారెవ్వరు
    యేసువా నీకు సాటియైన వారెవ్వరు
1.    సృష్టికి ఆదారుడా అద్వితీయుడా
    నిత్యము నివసించుచున్న సత్యదేవుడా
    అందరిలో సుందరుడా కాంక్షనీయుడా
    వందనముల కర్హుడా పూజ్యనీయుడా             ||యెహోవా||
2.    పాపికొరకు ప్రాణమిడిన ప్రేమ రూపుడా
    లోకపాపమును మోసిన దైవ తనయుడా
    మరణపు కోరలు పీకిన విజయ
    వీరుడా, శరణ్ననచోకరుణచూపు పరందాముడా         ||యెహోవా||

పాట – 72

ప||    ప్రియుడ నీ ప్రేమ పాదముల్‌ చేరితే
    నెమ్మది నెమ్మదియే
    ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద ఆనంద     
    మానందమే
    ఆశ్చర్యమే – ఆశ్చర్యమే, ఆరాధణ – ఆరాధన
1.    నీ శక్తి కార్యముల్‌ తలచి తలచి ఉల్లము పొంగెనయ్యా
    మంచివాడా – మంచి చేయువాడా – స్తోత్రము స్తోత్రమయా
    మంచివాడా – మహోన్నతుడా – ఆరాధనా ఆరాధన
2.    బలియైనా గొఱ్ఱెగా పాపములంన్నింటిని మోసీ తీసితివే
    పరిశుద్ధ రక్తము – నా కొరకేనయ్యా నా కెంతో భాగ్యమయ్యా
    పరిశుద్దుడా – పరమాత్ముడా ఆరాధనా – ఆరాధనా
3.    ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా నిన్ను విడువనయ్యా
    రక్తము చింది సాక్షిగా ఉందున్‌ నిశ్చయం నిశ్చయమే
    రక్షకుడా – యేసునాధా – ఆరాధనా – ఆరాధనా

పాట – 73

ప||    కాలమనే సంద్రములో ప్రేమను వెదికే మానవుడా
    యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ
    ప్రేమను నేర్పేది ఆ ప్రేమ
1.    దివినే విడచి భువకేతెంచి – కరుణను తెచ్చింది నా యేసు ప్రేమ
    కల్వరిలోన రక్తము కార్చి రక్షణ యిచ్చిరి నా క్రీస్తు ప్రేమ
2.    ఒక తల్లి కడుపులో పుట్టిన వారే ఒకరిని ఒకరు ప్రేమించలేరు
    ప్రేమించామని చెప్పిన వారు కడవరకు కొనసాగించ     

ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

Read Full Post »

అయ్యప్ప స్వామి భజనలు – పాటలు

Ayyappa Swamy Bajanalu, Patalu, Songs in Telugu

Ayyappa Swamy Bajanalu, Patalu, Songs in Telugu

24. భూత నాధ సదానందా

శో||     భూత నాధ సదానందా
    సర్వ భూత దయాపరా
    రక్ష రక్ష మహభాహో
    శాస్తే తుభ్యం నమోనమః             ..3.. సార్లు  
పల్లవి     భగవాన్‌ శరణం భగవతి శరణం
    శరణం శరణం అయ్యప్పా
    భగవతి శరణం భగవాన్‌ శరణం
    శరణం శరణం అయ్యప్ప
అనుపల్లవి     భగవాన్‌ శరణం భగవతి శరణం     
            దేవనే – దేవియే – దేవియే – దేవనే       ||భగ||
1.    నలుబది దినములు భక్తితో నిన్నే సేవించెదము అయ్యప్పా
    పగలు రేయీ నీ నామస్మరణం స్మరణం శరణం శరణం అయ్యప్పా  ||భగ||     

2.    కరిమల వాసా పాపవినాశ శరణం శరణం అయ్యప్పా
    కరుణతో మమ్ము కావుము స్వామి శరణం శరణం అయ్యప్పా   ||భగ||
3.    మహిషి సంహార మదగజవాహన శరణం శరణం అయ్యప్పా  
    సుగుణ విలాస సుంధర రూప శరణం శరణం అయ్యప్పా  ||భగ||
4.    నెయ్యాభిషేకం నీకప్పా నీపాద పద్మములు మాకప్పా
    కర్పూర దీపం నీకప్పా నీ జ్యోతి దర్శనం మాకప్పా  ||భగ||

25. కార్తీక మాసము వచ్చిందంటే

కార్తీక మాసము వచ్చిందంటే కలతలుండవయ్యా
నియమాలు నిష్టలు పాటిస్తుంటే నిలకడ వచ్చేనయ్యా
శబరిస్వామివయ్యా నీవు అభయదాతవయ్య
శరణం బంగారయ్య మాపై కరుణ చూపవయ్య     ||కార్తీక||
నొసటి పెడితే చందనము ఇసుక పడితే కుందనము
విబూది పూసిన శరీరం మేదిని నేలే కిరీటం
పంపానదిలో శరణం శరణం స్నానమాడి శరణం శరణం
పంపాలో స్నానమాడి పావనులమై వచ్చాము
స్వామి స్వామి ఇరుముడి తలపైనిడి తరలివచ్చేమయ్యా
పట్టిన దీక్షమాకే పట్టాభిషేకమయ్యా అయ్యప్పాపట్టాభిషేకమయ్యా     ||కార్తీక||
సన్నిధానమున నిలబడి స్వామి శరణం విన్నవించి
హృదయములే పల్లవించి భక్తావేశం పెల్లుబికి
ఒళ్ళు పులకించి కళ్ళు ముకుళించి కైవల్యం కాంచేమయ్యా
ముక్తి సోపానాలు ముట్టినట్లుగ ధన్యత నొందేమయ్య
ఇంతటి గొప్ప పెన్నిధి ఇపుడె సిద్ధించేను అయ్యప్పా ఇపుడె సిద్ధించెను ||కా||

26. అది గదిగో శబరి మలా

అది గదిగో శబరి మలా – అయ్యప్పస్వామి ఉన్న మలా
అది గదిగో పళణి మలా – అయ్యప్ప సోదరుడు ఉన్న మలా
శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణ మయ్యప్ప స్వామియే
స్వామియే అయ్యపా – అయ్యప్పా స్వామియె  
అదిగదిగో శబరిమల – శివకేశవులు ఉన్నమల
ఉన్నవారిని లేనివారిని తేడలేనిది శబరిమల
కులమొ మతమొ, జాతి భేదము తేడలేనిది శబరిమల    ||శరణమయ్యప్ప||    
అదిగదిగో పళనిమల శివపార్వతుల ఉన్నమల
కైలాసం వైకుంఠం కలసిఉన్నది శబరిమల
ఈశ్వర హృదయం మాధవనిలయం కలిసిఉన్నది శబరిమల  ||శరణమ||
అదిగదిగో పంపానది, దక్షిణభారత గంగానది
ఈశ్వర కేశవ నందునందుని పాదముకడిగిన పుణ్యనది
అదిగదిగో శబరి పీఠం భక్తజనులకిది ముక్తిపీఠం
శబరిఎంగిలి ఆరగించిన రాముడు నడిచిన పుణ్యస్ధలం
అదిగదిగో కాంతమల అక్కడ వెలువడును మకరజ్యోతి
హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామికి హారతి ఇచ్చేదీపమది  ||శరణమ||

27. శబరిమలై నౌక సాగీ పోతున్నది

పల్లవి :     శభరిమలై నౌకా సాగీ పోతున్నది
        అయ్యప్ప నౌక సాగీ పోతున్నది
    నామంబు పలికితే నావ సాగి పోతుంది
    శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా
     అందులో చుక్కాని శ్రీ మణి కంఠుడు
    అందులో చుక్కాని శ్రీ భూతనాధుడు
    నామంబు పలికితే నావ సాగి పోతుంది.         ||శరణం||
     తెడ్డెయ్యపని లేదు తెర చాప పని లేదు
    పేదలకు సాదలకు ఇది ఉచితమండీ
    డబ్బిచ్చి ఈ నావా మీ రెక్క లేరు
    నామంబు పలికితే నావ సాగి పోతుంది         ||శరణం||
     కదలండి బాబు మెదలండి బాబు
    అమ్మలారా అయ్యలారా రండి రండి మీరూ
    నామంబు పలికితే నావ సాగిపోతుంది         ||శరణం||    

28. కొండల్లో కొలువున్న కొండదేవరా

పల్లవి     కొండల్లో కొలువున్న కొండదేవరా
    మాకొర్కేలన్ని దీర్చవయ్య కొండదేవరా
1.    కార్తీక మసాన కొండదేవరా
    మేము మాలలే వేస్తాము కొండదేవరా         ||కొం||
2.    అళుదమలై (నది) శిఖరాన కొండదేవరా
    మమ్ము ఆదరించి చూడవయ్య కొండదేవరా     ||కొం||    
3.    కరిమలై శిఖరాన కొండదేవరా
    మమ్ము కరుణించగ రావయ్య కొండదేవరా     ||కొం||
4.    పంపానది తీరాన కొండదేవరా
    మా పాపములను బాపవయ్య కొందడేవరా     ||కొం||
5.    పదునెనెమిది మెట్లెక్కి కొండదేవరా
    మేము పరవశించినామయ్య కొండదేవరా         ||కొం||
6.    నెయ్యాబిషేకమయ్య కొండదేవరా
    నీకు మెండుగా జరిపిస్తాం కొండదేవరా         ||కొం||

29. కొండవాడు మా అయ్యప్పా

పల్లవి     కొండవాడు మా అయ్యప్పా
    జాలి గుండె వాడు మా అయ్యప్పా
    ఓహో హో అయ్యప్పా శరణమో అయ్యప్పా  ..2..    ||కొం||
1.    నీలాల నింగిలోన చుక్కల్లో చందురుడు
    నీలగిరి కొండల్లో కొలువుతీరి ఉన్నావు
    నీలకంఠుని పుత్రుడు అయ్యప్ప
    మణికంఠ నామదేయుడు         ఓహో..    ||కొం||
2.    రాగాలేమాకురావు తాళాలు మాకు లేవు
    అరుపులే మా పిలుపులు అయ్యప్ప
    శరణాలే మేలుకొలుపులు         ఓహో…    ||కొం||
3.    పెద్దదారిలోన నడిచి వెళ్ళుతుంటే – చిన్నదారిలోన నడచి వెళ్ళుతుంటే
    దారిలోన కనిపిస్తాడు అయ్యప్ప శరణాలే పలికిస్తాడు  ఓహో..  ||కొం||

30. అయ్యప్ప స్వామినీ చూడాలంటే  

అయ్యప్ప స్వామినీ చూడాలంటే కొండకు వెళ్ళాలి
అయ్యప్ప స్వామినీ చూడలంటే కొండలకు వెళ్ళాలి
శబరి కొండకు వెళ్ళాలి     ||స్వామి||
స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప
కార్తీకమాసమున మాలలు వేసి పూజలు చేయాలి    ||స్వామి||
యిరుముడికట్టి శరణము చెప్పి యాత్రకు వెళ్ళాలి
శబరి యత్రకు వెళ్ళాలి     ||స్వామి||
ఎరుమేలి వెళ్ళి వేషాలు వేసి పేట ఆడాలి
పేటైసుల్లి ఆడాలి     ||స్వామి||
ఆలుదానదిలో స్నానం చేసి రాళ్ళను తీయాలి
రెండు రాళ్ళను తీయాలి     ||స్వామి||
పంపానదిలో స్నానము చేసి పావనమవ్వాలి
మనము పావనము అవ్వాలి

31. కనివిని ఎరుగుని ఘనయోగం

కనివిని ఎరుగని ఘనయోగం జగము ఎరుగని జపమంత్రం
ఇంద్రియములచే తలవంచి ఇరుముడినే తలదాల్చి
స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం
1.    శ్రీతల స్నానం తొలి నియమం భూతల శయనం మలినియమం
    ఏకభుక్తమే తింటూ నీకు అర్పణం అంటూ
    ఐహిక భోగం విడిచేది ఐహిక భోగం మరిచేది
    భక్తి ప్రపత్తులు దాటేది శరణమని చాటేది
2.    అపితాహార్యం ఒక నియమం
    సంస్క ృతిక వర్గవమొక నియమం
    అంగదక్షిణే ఇస్తూ ఆత్మదర్శనం చేస్తూ
    మమకారములను విడిచేది మదమత్సరములు త్రుంచేది
    కర్మేఫలముగా తలచేది తత్‌త్వమ్‌ అని తెలిచేది.

32.జిందగీమే ఏకబార్‌ శబరియాత్ర

పల్లవి జిందగీమే ఏక్‌బార్‌ శబరియాత్ర ఛలో ఛలో
    హరిహరపుత్ర అయ్యప్పకో దర్శన్‌ కర్‌కే ఆవో
    స్వామియే శరణం అయ్యప్ప స్వామియే
    శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప     ||జిం||
జీవన్‌తో కుచ్‌ బఢానహీ ఉస్‌కా ఛోటాతోపాహై
ఉస్‌కా బేకార్‌ మత్‌ కరో భక్తి, భజన్‌ సే ధ్యాన్‌ కరో     ||జిం||
పాప్‌ సబ్‌ కుచ్‌ మిట్‌ జాతా హై పంపా నదిమే స్నాన్‌ కరో
జ్యోతి స్వరూప్‌కో దర్శన్‌ కో జీవన్‌ ముక్తి మిల్‌తీహై
తుఝె జీవన్‌ ముక్తి హోతా హై             ||జిం||

33. రాజా రాజా పందల రాజ

రాజా రాజా పందల రాజ – నీవు పంబానది తీరాన కీర్తించేవు  ||2||
శరణం అయ్యప్పా శరణం స్వామి – స్వామీ అయ్యప్పా శరణం స్వామి
అన్నదాన ప్రభువా శరణం స్వామి – పొన్నంబలవాసా శరణం స్వామి
అలుద పంబ జలములోన తీపివి నీవే
అడవిలోని జీవాల ఆటవు నీవే
బంగారు కొండపైన వేదము నీవే
పంచగిరులు ధ్వనియించే నాధము నీవే         ||శరణం అయ్యప్పా||
భూతదయను బోధించిన కరుణామూర్తి
భూతనాధ సదానంద శాంతమూర్తి
ఇంద్రియములు జయించినా సుందరమూర్తి
ఇరుముడులను కడతేర్చే దివ్యమూర్తి         ||శరణం అయ్యప్పా||
వావరున్ని వాల్మీకిగ మలచినావయా
వనములోన ఘనముగా నిలిచినావయా
గురుపుత్రుని కరుణించే శ్రీ గురునాధా
మా కన్నియు సమస్త నీవే కాదా         ||శరణం అయ్యప్పా||
తల్లిదండ్రుల పూజించే నీ భావనలూ
గురువులు గౌరవించు నీ సేవలూ
కలియుగమును రక్షించే అభయ హస్తమూ
ఓ తండ్రి నీవేలే మా సమస్తమూ         ||శరణం అయ్యప్పా||

33. అమితానందం పరమానందం

అమితానందం పరమానందం అయ్యప్పా
నీ రూపం చూసిన పాపం తొలగును అయ్యప్పా
అయ్యప్పా స్వామి అయ్యప్పా – అయ్యప్పా శరణం అయ్యప్పా ||అమితానందం||
హరియే మోహిని రూపం
హరయే మోహన రూపం
హరిహర సంగం అయ్యప్ప జననం
ముద్దులొలుకు సౌందర్యం             ||అమితానందం||
నీవు పుట్టుట పంబా తీరము
నీవు పెరుగుట పందళ రాజ్యము
నీ కంఠమందు మణిహారం
మణికంఠా నీ నామం
పులిపాల్‌ కడవికి ప్రయాణం
మదిలో మహిషి సంహారం
ఇంద్రుడే  వన్‌పులి వాహనం
ఇచ్చెను శబరికి మోక్షము             ||అమితానందం||
ఇరుముడి నీకభిషేకం
పదునెట్టాంబడి ప్రదాయము
మకర సంక్రమణ సంధ్యా సమయం
మకరజ్యోతియే సత్యరూపము             ||అమితానందం||

34. శాస్త్రా సన్నిధిలో అభిషేకం

శాస్త్రా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్తా సన్నిధిలో అభిషేకం
ఆవుపాలు తెచ్చినాము అయ్యప్పా-నీకు పాలాభిషేకం అయ్యప్పా      ||శాస్తా||     

అవు నెయ్యి తెచ్చినాము అయ్యప్పా-నీకు నెయ్యాభిషేకం అయ్యప్పా  ||శాస్తా||  

పుట్టతేనె తెచ్చినాము అయ్యప్పా-నీకు తెనాబిషేకం అయ్యప్పా      ||శాస్తా||
చందనము తెచ్చినాము అయ్యప్పా-నీకు చందనాభిషేకం అయ్యప్పా ||శాస్తా||    

విభూధి తెచ్చినాము అయ్యప్పా-నీకు భష్మాభిషేకం అయ్యప్పా       ||శాస్తా||    

లిల్లిపూలు తెచ్చినాము అయ్యప్పా-నీకు పూలాభిషేకం అయ్యప్పా      ||శాస్తా||

కర్పూరం తెచ్చినాము అయ్యప్పా-నీకు కర్పూర హారతులు అయ్యప్పా   ||శాస్తా||    
 

35. గురుస్వామి గురుస్వామి

గురుస్వామి గురుస్వామి – నీకు కోటి కోటి దండాలు గురుస్వామి
నీతోడులేనిదే గురుస్వామి, మేము శబరియాత్ర చేయలేము గురుస్వామి  ||గు||
కార్తీకమాసమున మాలనే వేస్తావు శరణుఘోష మంత్రము నేర్పిస్తావు
అడవిలోన స్వాములకు కష్టము వస్తే అండగా నిలిచి ఆదరిస్తావు         ||గు||
నీవెంటవచ్చే స్వాములకు గురుస్వామి తీసుకొని వెడతావు గురుస్వామి
నీతోడు లేనిదే గురుస్వామి ఇరుముడిని కట్టలేము గురుస్వామి         ||గు||
గురువులేని విద్య విద్యకాదు గురువులేని యాత్ర శబరియత్రకాదు
నీ అనుగ్రహము లేనిదే గురుస్వామి అయ్యప్ప దర్శనము కలగదులే గురుస్వామి  ||గురు||

36. వీల్లాలి వీల్లాలి వీల్లాలి వీల్లాలే

వీల్లాలి వీల్లాలి వీల్లాలి వీల్లాలే
వీల్లాలి వీరనే వీరమణిగండనే
రాజాది రాజనే రాజకుమారనే
స్వామియే – అయ్యప్పో – శరణమో అయ్యప్పో     ||వీల్లాలి||
ఎరుమేలి చేరినాము – పేటతుల్లి ఆడినాము
వావరుని చూసినాము – వందనాలే చేసినాము
మణికంఠునితో మేము పెద్దదారి నడిచినాము
పాదయాత్ర ఆరంభం – శరణఘోష ప్రారంభం     ||వీల్లాలి||
అక్కడక్కడాగినాము – ఆళందాకు చేరినాము
ఆళుదాలో స్నామాడి – రెండు రాళ్ళు తీసినాము
కఠిన కఠినముకొంటు – కరిమల ఎక్కినాము
ఫరజ్యాసలేదమ – పరమాత్మ నీవయ్య
స్వామియే అయ్యప్పా – శరణమో అయ్యప్పో     ||వీల్లాలి||
శరణఘోష చెప్పుచు – పంపాకు చేరినాము
పంపాలో స్నానమాడి – పాపాలను వదలినాము
శరంగుత్తి చేరినాము – శరణములు గుచ్చినాము
సన్నిధానం చేరినాము – పద్దెనిమిది మెట్లు ఎక్కినాము
అయ్యప్పను చూసినాము – ఆనందం పొందినాము
మరో జ్యాస లేదయ్యా – పరమాత్మ నీవయ్యా
స్వామియే అయ్యప్పో – శరణమొ అయ్యప్పో     ||వీల్లాలి||

37. స్వామియే శరణం శరణమయ్యప్పా

స్వామియే శరణం శరణమయ్యప్పా
శరణం శరణం స్వామి అయ్యప్పా
అమ్మవారు ఉండేది వైకుంఠం – అయ్యవారు ఉండేది కైలాసం
అన్నగారు ఉండేది ఫళనిమలా – మన స్వామి వారు ఉండేది శబరిమలా ||స్వామి||
హరిహర అంటారు అమ్మవారి – హరిహర అంటారు అయ్యవారిని
హరోంహర అంటారు అన్నగారిని – శరణశరణమంటారు స్వామివారిని ||స్వామి||
గరుడ వాహనం అమ్మవారిది – వృషభ వాహనం అయ్యవారిది
పచ్చనెమలి వాహనం అన్నగారిది – వన్‌పులి వాహనం స్వామి వారిది  ||స్వామి||
శ్రీ చక్రధారియే అమ్మవారి – త్రిశూల ధారియే అయ్యవారు
వేలాయుధ పాణివే అన్నగారూ – అభయ హస్తుడే స్వామివారు     ||స్వామి||

38. పళ్ళింకట్టు శబరిమలక్కు కల్లుం ముల్లుం

పళ్ళింకట్టు – శబరిమలక్కు ఇరుముడికట్టు – శబరిమలక్కు
కట్టుంకట్టి – శబరిమలక్కు కల్లుం ముల్లుం – కాలికిమెత్తి
పళ్ళింకట్టు శబరిమలక్కు – కల్లుముల్లుం కాలికిమెతై
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే              ||పళ్ళింకట్టు||
అఖిలాండేశ్వరి అయ్యప్పా – అఖిలచరాచర అయ్యప్పా
హరవోం గురువోం అయ్యప్పా – అశ్రిత వత్సల అయ్యప్పా
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే              ||పళ్ళింకట్టు||
నెయ్యభిషేకం స్వామిక్కే – కర్పూరదీపం స్వామికే
భస్మాభిషేకం స్వామిక్కే – పాలభిషేకం స్వామికే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో అయ్యప్పో స్వామియే   ||పళ్ళింకట్టు||
దేహబలందా అయ్యప్పా – పాదబలందా అయ్యప్ప
నినుతిరు సన్నిధి అయ్యప్పా – చేరేదమయ్యా అయ్యప్పా
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే             ||పళ్ళింకట్టు||  
తేనభిషేకం స్వామిక్కే – చందనభిషేకం స్వామిక్కే
పెరుగభిషేకం స్వామిక్కే – పూలభిషేకం స్వామిక్కే
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే           ||పళ్ళింకట్టు||  

39. ఉయ్యాల ఊగుచున్నారు

1.    ఉయ్యాల ఊగుచున్నారు, అయ్యప్పస్వామి ఉయ్యాల ఊగుచున్నారు  బంగారు ఉయ్యాల ఊగుచున్నారు
2.    కొండకు కొండ మధ్య మళయాళదేశమయ్యా
    మళయాళదేశం విడిచి ఆడుకొనుచురావయ్యా
3.    విల్లాలివీరుడే నీలమణికంఠుడే
    రాజుకురాజువే పులిపాలు తెచ్చినావే
4.    పంబలో బాలుడే పందళరాజుడే
    కుమారస్వామి తమ్ముడే వావర్‌స్వామి మిత్రుడే
5.    ఎలిమేలిశాస్తావే, అందరికీ దేవుడే
    ముడుపుల ప్రియుడే, శివునికి బాలుడే
6.    కలియుగవరదుడే, కాంతిమలజ్యోతియే
    కారుణ్యశీలుడే కరుణించే దేవుడే

40. నేను నిజమైతే నా స్వామ నిజమౌనా

నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా
నా ఆత్మ నిజమైతే పరమాత్మ నీవేగా                ||నేను నిజమైతే||
ఆవువంటివాడు నేనైతే – పాలవంటివాడు నా స్వామియే
ఆవుకు రంగులు ఉన్నవిగాని – పాలకు రంగులు లేవుగా ||నేను నిజమైతే||
జాతివంటివాడు నేనైతే – నీతివంటివాడు నా స్వామియే
జాతికి కులములు ఉన్నవిగాని – నీతికి జాతులు లేవుగా ||నేను నిజమైతే||
పూలవంటివాడు నేనైతే – పూజవంటివాడు నా స్వామియే
పూలకు రంగులు ఉన్నవిగాని – పూజకు రంగులు లేవుగా ||నేను నిజమైతే||
చెరుకువంటివాడు నేనైతే – తీపివంటివాడు నా స్వామియే
చెరుకుకు గనుపులు ఉన్నవిగాని – తీపికి గనుపులు లేవుగా     ||నేను నిజమైతే||
ఏరువంటివాడు నేనైతే – నీరువంటివాడు నా స్వామియే
ఏరుకు వంపులు ఉన్నవిగాని – నీరుకు వంపులు లేవుగా     ||నేను నిజమైతే||
భజనవంటివాడు నేనైతే – భక్తివంటివాడు నా స్వామియే
భజనకు వంతులు ఉన్నవిగాని – భక్తికి వంతులు లేవుగా     ||నేను నిజమైతే||

41. కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పా

కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పా
భక్తా మనోహరా శరణమయ్యప్పా
దీన దయాలో పరిపూర్ణ కృపాలో
జైజై శంకర బాలా జయస్వామి అయ్యప్పా     || కామాక్షి సుప్రజా||
హరేరామ హరేరామ స్వామి అయ్యప్పా
హరేకృష్ణ హరేకృష్ణ శరణమయ్యప్పా
దీనదయాలో పరిపూర్ణ కృపాలో
జైజై శంకర బాలా జయ స్వామి అయ్యప్పా     || కామాక్షి సుప్రజా ||
శంభో శంకర శంభో శంకర స్వామి అయ్యప్ప
హరోంహరా హరోంహరా శరణమయ్యప్పా
దీనదయాలో పరిపూర్ణ కృపాలో
జైజై శంకర బాలాజయస్వామి అయ్యప్పా     ||క్షామాక్షి సుప్రజా||
పంబా వాసా పందళరాజ స్వామి అయ్యప్పా
గౌరీపుత్రా కోమల రూప శరణమయ్యప్పా
దీనదయాలో పరిపూర్ణ కృపాలో
జైజై శంకర బాలా జయ స్వామి అయ్యప్పా     ||క్షామాక్షి సుప్రజా||

42. అన్నదాన ప్రభువే శరణం అయ్యప్పా

అన్నదాన ప్రభువే శరణం అయ్యప్పా
అరియాంగవు అయ్యావే శరణమయ్యప్పా    ||అన్న||  
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా     ||శ||
ఏరుమేలి వాసుడవే శరణమయ్యప్పా
ఏకస్వరూపుడవే శరణమయ్యప్పా    ||2||
కరిమల వాసుడవే శరణమయ్యప్పా
కలియుగ వరదుడవే శరణమయ్యప్పా     ||2|| ||అ||
అలుదాని వాసుడే – శరణమయ్యప్ప
ఆదరించు దేవుడవే శరణమయ్యప్ప    ||2||
పంబా నివాసుడవే శరణమయ్యప్ప
పందలారాజవే శరణమయ్యప్ప     ||అన్న||
నీలిమలై వాసుడవే శరణమయ్యప్పా
నిత్యబ్రహ్మచారివే శరణమయ్యప్పా     ||2||
కాంతమలై ఈశుడవే శరణమయ్యప్పా
జ్యోతి స్వరూపడవే శరణమయ్యప్పా    ||2||

43. గల గల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి

గల గల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి     ||2||
ఆడుకుందాము రావా నా అయ్యప్ప స్వామి
పాడుకుందాము రావా నా అయ్యప్ప స్వామి
హరిహర తనయుడా అందాల బాలుడా
గలగల గలగల గలగల
గలగల గజ్జలు కట్టినా అయ్యప్ప స్వామి         ||2||
విల్లాలి వీరుడవయ్యా నా అయ్యప్ప స్వామి
వీరమణికంఠుడవయ్యా నా అయ్యప్ప స్వామి
మోహన రూపుడవయ్యా నా అయ్యప్ప స్వామి
మోహినీ బాలుడవయ్యా నా అయ్యప్ప స్వామి
హరిహర తనయుడా అందాల బాలుడా
గలగల గలగల గలగల             ||గలగల||       ||2||
పంపా బాలుడవయ్యా నా అయ్యప్ప స్వామి
పందల రాజునువయ్యా నా అయ్యప్ప స్వామి
నీలిమల వాసుడవయ్యా నా అయ్యప్ప స్వామి  
నిత్య బ్రహ్మచారుడవయ్యా నా అయ్యప్ప స్వామి
హరిహర తనయుడా అందాల బాలుడా
గలగల గలగల గలగల
గలగలగల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి     ||2||
ఈ పూజలు నీకేనయ్య నా అయ్యప్ప స్వామి
ఈ భజనలు నీకేనయ్యా నా అయ్యప్ప స్వామి
పడిపూజలు నీకే నయ్యా నా అయ్యప్ప స్వామి
జ్యోతి స్వరూపుడవయ్యా నా అయ్యప్ప స్వామి
హరి హర తనయుడా అందాల బాలుడా
గలగల గలగల గలగల
గలగలగల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి    ||2||
ఆడుకుందామురావా నా అయ్యప్ప స్వామి
పాడుకుందాము రావా నా అయ్యప్ప స్వామి
హరిహర తనయుడా అందాల బాలుడా
గలగల గలగల గలగల
గలగలగల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి    ||2||

44. శరణం శరణం అయ్యప్పా

శో||     శరణం శరణం అయ్యప్పా – స్వామి యే శరణం అయ్యప్పా
    శబరిగిరీశ అయ్యప్పా స్వామి యే శరణం అయ్యప్పా        శర||
1.    సత్యము జ్యోతి వెలుగునయ – నిత్యము దానిని చూడుమయా
    పరుగున మీరురారయ్య – శబరిగిరికి పోవుదుము           శర||
2.    హరి హర మానస సుతులైన – సురలా మొరలను ఆలకించి
    ధరణిలో తాను జన్మించి – పదునాల్గేళ్ళు నివశించి           శర||
3.    ఘోర అడవిలో బాలునిగా – సర్పము నీడలో పవళించి     
    వేటకు వచ్చిన రాజునకు – పసిబాలునిగా కనిపింప          శర||
4.    మణికంఠ అను  నామముతో – పెంచిరి రాజులు మురిపెముగా
    స్వామి మహిమతో రాజునకు-కలిగెను సుతుడు మరియొకడు శర||
5.    గరువాసములో చదివింప – గురుపుత్రుని దీవింప
    మాటలు రానీ బాలునకు మాటలు వచ్చెను మహిమలతో      శర||
6.    మాతాపితలను సేవించి – మహిషిని ఆను వధియించి
    శబరిగిరిలో వెలసిరాగా  – మనలను ధన్యుల చేయుటకు     శర||
7.    అయ్యప్పా అను నామముతో – శిలారూపమున తానున్నా
    జ్యోతి స్వరూప మహిమలతో – భక్తుల కోర్కేలు తీర్తురయ     శర||
8.    మార్గశిరాన మొదలెట్టి – నలుబది దినములు దీక్షతో
    శరణను భజనలు చేయుచు – ఇరుముడి కట్టి పయనింప     శర||

9.    భోగికి ముందు చేరాలి – పంబలో స్నానం చేయాలి
    పదునెట్టాంబడి ఎక్కాలి – స్వామిని మనమూ చూడాలి        శర||
10.    మకర సంక్రాతి దినమున – సాయం సమయం వేళలో
    సర్వం వదలిన సత్పురుషులకు – జ్యోతి దర్శనం మిచ్చునయా  శర||
11.    మకర జ్యోతిని చూడాలి – తిరువాభరణం చూడాలి
    చాలు చాలు మనికింక – వలదు వలదు ఇక మరు జన్మ     శర||
12.    నెయ్యభిషేకం స్వామికే – తేనాబిషేకం స్వామిక్కే
    చందనాభిషేకం స్వామిక్కే – పూలాభిషేకం స్వామిక్కే         శర||
13.    కూర్పరహరతీ తనకెంతో – పాయసమంటే మరియెంతో
    శరణన్న పదములు ఎంతెంతో – యిష్టం యిష్టం స్వామికే     శర||
14.    హరిహరాసనం స్వామిది – సుందర రూపం స్వామిది
    కన్నుల పండుగ మనదేలే – జన్మ తరించుట మనకేలే     శర||
15.    శరణం శరణం అయ్యప్పా – శరణం శరణం శరణమయా
    శరణం శరణం మాస్వామి – దరికి చేర్చుకో మాస్వామీ     శర||  

 45. కొబ్బరికాయలు అయ్యప్పకే

కొబ్బరికాయలు అయ్యప్పకే
కోటి పూజలు అయ్యప్పకే అయ్యప్పకే     ||2||
శబరిమలై మా అయ్యప్పా అయ్యప్పా
నీకు శరణం శరణం అయ్యప్పా అయ్యప్పా     ||2||
ఇరుముడి కట్టుకొని అయ్యప్పో, అయ్యప్పా     ||2||
మేము నీ కొండ కొస్తమయ్యా అయ్యప్పా, అయ్యప్పా     ||2||
ఏరుమేలి కాడ అయ్యప్పా, అయ్యప్పా     ||2||
మేము పేటతుళ్లై ఆడుతాము అయ్యప్పా     ||2||
ఐదు కొండలు దాటి అయ్యప్పా, అయ్యప్పా
మేము తానాలు చేస్తమయ్య అయ్యప్ప అయ్యప్ప
పందళ రాజడవు అయ్యప్పా, అయ్యప్పా
మా పాపాలు తొలగించు అయ్యప్పా అయ్యప్పా
కన్నెమాల గణపతికి అయ్యప్పో అయ్యప్పో
మేము టెంకాయ కొడుతమయ్య అయ్యప్పో అయ్యప్పో    ||కొ||
పద్దెంది మెట్లెక్కి అయ్యప్ప అయ్యప్పా
మేము పరవశించి పోతాము అయ్యప్పా అయ్యప్పా
నెయ్యాభిషేకాలు అయ్యప్పో అయ్యప్పో
నీకు ఘనముగ చేత్తమయ్య అయ్యప్పో అయ్యప్పా
మకర సంక్రాంతి నాడు అయ్యప్పా, అయ్యప్పా
నీ జ్యోతి రూపము చూపుమయ్య అయ్యప్పా అయ్యప్పా     ||కొ||

46. ఎక్కడ చూసిన నీవే అయ్యప్పా

ఎక్కడ చూసినా నీవే అయ్యప్పా సర్వంతర్యామీ నీవే అయ్యప్పా
స్వామి ఎక్కడచూసినా నీవే అయ్యప్పా సర్వంతర్యామీ నీవే అయ్యప్పా
చిగురాకులలో పువ్వులలో నీవే అయ్యప్పా
పసిపాపలోన వృద్దులలోనా నీవే అయ్యప్పా     || స్వామి ఎక్కడ||
గళగళపారే సెలయేరులలో నీవే అయ్యప్పా
గగనానగిరి పకక్షులలోన నీవే అయ్యప్పా         || స్వామి ఎక్కడ||
ఢమఢమ ఢమఢమ ఢమరుక్కనిలో నీవే అయ్యప్పా
ఘణఘణ ఘణఘణ ఘంటానాధం నీవే అయ్యప్పా|| స్వామి ఎక్కడ||
నింగి నేల శూన్యములో నీవే అయ్యప్పా
నీతి జాతి మానవ జాతి నీవే అయ్యప్పా         || స్వామి ఎక్కడ||
కన్నె స్వాములలో కత్తిస్వాములలో నీవే అయ్యప్పా
గంట స్వాములలో గధాస్వాములలో నీవే అయ్యప్పా
గురుస్వాములలో మణికంఠులలో నీవే అయ్యప్పా     || స్వామి ఎక్కడ||

47. సంతసంబు సంతసంబు సంతసంబహో

సంతసంబు సంతసంబు సంతసంబహో
శబరిమలై యాత్రచేయ సంతసంబహో
కార్తికేయ మాసమందు కఠిన నిష్ఠతో
కంఠమాల వేసుకొనగ కలుగు సంతసం     ||సంత||
శరణుఘోషవేడుగొనుచు శబరిమలై కేగగా
ఇరుముడి దాల్చివేగ ఎరిమేలి చేరగా     ||సంత||
ఆటవిక వేషమంది ఆడిపాడగా
దివ్యమైన పంబనదిని తీర్ధమాడగా     ||సంత||
శబరిపీఠమందు చేరి శరము గ్రుచ్చగా
పదెనెట్టాంబడి నెక్కుచు పరవశించగా     ||సంత||   

 48. కన్నెస్వామి ఓ కన్నెస్వామి

కన్నెస్వామి ఓ కన్నెస్వామి
వేయికనులు చాలవులే – మన అయ్యప్పనూచూడ
ఇరుముడిని కట్టుకొని – మనం ఎరిమేలి పోదాము
వేషాలే వేద్దామా – పేటతల్లై ఆడుదాము
కొబ్బరికాయ ఒకటికొట్టి – ఓవరుని మ్రొక్కుదాము   ||కన్నెస్వామి||
ఆలుదాకు చేరుకుని – స్నానాలే చేద్దాము
పంబాకు చేరుకుని – స్నానాలు చేద్దాము
కొబ్బరికాయ ఒకటి కొట్టి – గణపతిని మ్రొక్కుదాము
శరంగుత్తి చేరుకుని – శరణాలు గ్రుచ్చుదాము    ||కన్నెస్వామి||
కొబ్బరికాయ ఒకటికొట్టి – పద్దెనిమిది మెట్లెక్కి
పరవశం పొందుదాము – నెయ్యాభిషేకమును
ఘనముగా చేద్దాము – సంక్రాంతి రోజున – జ్యోతినే చూద్దాము
హారతినే ఇద్దాము – శరణమంటు వేడుదాము     ||కన్నెస్వామి||  

49. అయ్యా అని పిలిచినా

అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా
అభయమిచ్చి బ్రోచేది అయ్యప్పయే అండగా నిలిచేది ఆ తండ్రియే  ||అయ్యా||
శివకేశవ రూపమైన మోహిని పుత్రుని
పంబానది తీరాన వెలసిన బాలుని     ||అయ్యా||
పులిపాలను తెచ్చిన పొన్నంబల వాసుని
తల్లి మనసు మార్చిన శబరిగిరి నాధుని     ||అయ్యా||
మంజుమాత వలచిన మోహనరూపున
కాంతమల జ్యోతిగా వెలుగొందు స్వామిని     ||అయ్యా||
అజ్ఞానపు పొరలను తొలిగించే దేవుని
అందరినీ ప్రేమ మీర కరుణించే మూర్తివి     ||అయ్యా||

50. ఈశ్వర నిలయం కైలాసం

ఈశ్వర నిలయం కైలాసం – కేశవ నిలయం వైకుంఠం
ఈశ్వర కేశవ ప్రియనందనుని సన్నిధానమే శబరిమల     ||ఈశ్వర||
ఆరుముఖముల దేవుడు అయ్యప్ప స్వామికి సహజుడు
సహజుడున్నది పళనిమల తానువున్నది శబరిమల
కడుపావనం ఇల శబరిమల
శబరిమలకే శోభనమూర్తి భక్త స్వాంతముల చిరస్ఫూర్తి
శరణం కోరిన తరుణ జలజమై శుభములు కురిసే మణిమూర్తి
జీవము నొసగే జ్యోతిర్మూర్తి     ||ఈశ్వర||

51. అతి బలవంతా హనుమంతా

అతి బలవంతా హనుమంతా – నీవేలే నా మనసంతా
పరమ పురష ఓ పవనసుతా
రామునికే నిజదూత – శ్రీరామునికే నిజదూత
అమితానందము నీ చరితా – బ్రహ్మనందము నీ ఘనతా
పరమానందము నీ ఘనతా             ||అతిబలవంతా||
ఎక్కడ భజనలు జరిగిన గాని అక్కడ నీవు వుందువట
నమ్మినబంటువు హనుమంతా            ||అతిబలవంతా||
భూతములు నీ పేర్వినినంతనె – భయముతో పరుగెడు అల్లంతా
శ్రీరామదూత హనుమంతా – మరామ దూత హనుమంతా     ||అతిబలవంతా||
రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్‌కి
రామలక్ష్మణ జానకి – జై బోలో హనుమాన్‌కి
జై బోలో హనుమాకి – రామ లక్ష్మణ జానకి  ||జయ||

52. ఏమయా దొర వరాల అంజని

ఏమయా దొర వరాల అంజని కుమారా ఏమయా దొర ||2||
పుట్టగానే పిట్టవలె నింగికెగిరినావట, నింగికెరినావట
నింగికెగిరి సూర్యుణ్ణి మింగ చూసినావట, మింగచూసినావట     ||ఏవయా||
సంజీవిని పర్వతాన్ని చేతపట్టినావట, నీచేత పట్టినావట
పెద్ద పెద్ద కొండలను పిండిచేసినావట, పిండి చేసినావట        ||ఏవయా||
లంకకెళ్ళి సీతకేమో వార్తలందించినావట, వార్తలందించినావట
రాముడందు భక్తి చూపి జ్ఞానివైనావట, జ్ఞానివైనావట        ||ఏవయా||
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి
జై బోలో హనుమానుకి, రామ లక్ష్మణ జానకి

ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

Read Full Post »

ఆరోగ్యమే మహాభాగ్యం

Health is our Property in Telugu

Good Health in Telugu -

          అందుకే మన పెద్దలు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు. ఈ రోజుల్లో అందరికీ మహాభాగ్యం అంటే ధనం, బంగారం, కార్లు, బంగ్లాలు కలిగి ఉండడమని భావిస్తారు. కాని వీటంన్నింటికంటే ముఖ్యమైన భాగ్యం. ‘ఆరోగ్యమే మహాభాగ్యము’ మనిషి సాంకేతికంగా ఎంత అభివృద్ధి సాధిస్తున్నా, తన సొంత సోత్తు అయిన ఆరోగ్యాన్ని తను కాపాడుకోలేక పోతున్నాడు. మనిషి మనుగడలో ముఖ్యంగా మానసికమైన అలజడులకు, ఆలోచనలకు మహఃభావాలకు, అధికారాలకు అధికముగా లోబడుతున్నాడు. ఈ ఘర్షణే మానసికమైన శక్తిని కోల్పోతూ ప్రపంచంలో నిరుత్సాహంగా, నిర్జీవమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఈ ఫలితంగానే శారీరకంగా ఎన్నో రుగ్మతులకు ఆహ్వానం పలుకుతున్నాడు. ఇటువంటి అనారోగ్యాలను ఎదుర్కొవాలంటే మనిషి మనస్సులో మనోశక్తి, శరీరములో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకు చక్కని మార్గము మన పూర్వికులు మానవ శరీర నిర్మాణాన్ని పరిశీలించి, పరిశోధించి ఆరోగ్యానికి ఎన్నో చక్కని మార్గాలను, యోగ సాధనను సృష్టించి అందించగలిగారు.
”నతస్య రోగో నజరా నమృత్యుః – ప్రాప్తస్య యోగాగ్ని మయంశరీరమ్‌’
యోగి అయిన వాడు, యోగాగ్నిమయ శరీరుడై, రోగములను, ముసలితనమును మృత్యువును జయించ గలుగుతాడు. యోగాకు పుట్టినిల్లు భారతదేశమైతే, ప్రస్తుతం ప్రాశ్చాత్తపు దేశాల్లో అద్భుతంగా ప్రచారంలో ఉంది. కానీ, ఇప్పుడిప్పుడే మన దేశంలో ఉధృతమైన ఆరాధన మొదలైనది. అందరూ ప్రకృతి పరమైన ఆహారానికి, యోగ సాధనకు పిల్లల నుండి పెద్దల వరకూ మక్కువ చూపుతున్నారు. ‘యోగ’ అనే పదం ‘యుజ్‌’ అనే సంస్కృత ధాతువు నుండి పుట్టింది. ‘యుజ్‌’ అంటే చేర్చ, కలుపు అని అర్ధం. శారీరక మానసిక ఆత్మ శక్తులను భగవంతునితో అనుసంధానం చేయడమే యోగం. బహు విధములైన జీవితాన్ని సముదృష్టితో చూసే మానసిక ధైర్యం అలవర్చుకోవడమే యోగ సాధన. భారతీయ తత్వజ్ఞాన ప్రకారము షడ్‌ దర్మనాలలో యోగ దర్శనం ఒకటి. భారతీయ భావనతో పరమాత్మ అంథటా వ్యాపించుంది. దానిలో జీవాత్మ ఒక అంశం’ జీవాత్మను, పరమాత్మతో అనుసంధానము చేసే మోక్షసాధనకు యోగాభ్యాసము మార్గం చూపుతుంది. ఈ యోగ మార్గాన్ని అనుసరించేవాడు యోగి లేదా యోగిని.
    భగవద్గీత యందు 6వ అధ్యాయంలో బాధ నుంచి, దుఖ నుంచి విముక్తి పొందడమే యోగం అని శ్రీకృష్ణుడు అర్జునుడకు ఉపదేశించాడు. సానపట్టిన వజ్రము పలు వర్ణాలలో ప్రకాశిస్తున్నట్లు యోగ అనే శబ్దానికి పలు అర్దాలు కలవు. ఇటువంటి యోగిన్ని సుమారు 500 సం|| నకు పూర్వమే మన సంస్కృతిలో భాగమైనది. యోగ ఈనాడు మానవ మానసిక, శారీర అసమతుల్యతల ద్వారా పొందుతున్న రోగాలకు చక్కని మార్గలను మన యోగులు, ఋషులు తపోశక్తితో సుమారు 2700 సంవత్సరముల పూర్వము కపిల మహర్షి తన శాంక్య దర్శనములో వివరించినారు. స్వామి వివేకానందుడు ”ప్రతి జీవియందును దివ్యత్వము గర్భితముగ నున్నది. బాహ్యాంతర ప్రకృతినందయు నిరోధించి అంతర్గతమగు నీ దివ్యత్వమును వ్యక్తము జేయుటయే జీవిత పరమావధి, ఇందులకై కర్మ, ఉపాసన, యోగ, జ్ఞాన మార్గములలో నొకటిని గాని, కొన్నిటిని గాని లేక అన్నిటిని గాని అవలంబించి ముక్తులగుడు” అని వక్కాణించెను. ఈ విధముగ మానవునిలో నంతర్గతముగన్న దైవాంశ శక్తిని బహిర్గతము చేసి, మానవుని పురిపూర్ణతవైపు పయనింపజేయు క్రమ పద్దతిని శ్రీ అరవిందులు ”యోగము” అనిరి. ఈ విధముగ యోగమనునది మానవుని జంతుస్ధితి నుండి క్రమంగా దైవస్ధితికి చేర్చు పద్దతి. ఈ ప్దదతిలో మానవుని పరిమిత, సంకుచిత, స్వార్ధపూరిత ఆలోచనా సరళి సంపూర్ణముగ పరివర్తన చెంది, సమతాభావముచే అబివ్యక్తమగుచు, సమన్వయ, సమగ్ర, నిస్వార్ధ వ్యక్తిత్వముగా రూపొందును. ఈ దైవత్యము, లేక ఆత్మ పరపక్వస్ధితి అత్యంత శుద్ధ చైతన్యము, సృజనాత్మకము, ఆనందమూను. కనుక యోగము ద్వారా ఆ స్ధితికి పయనించుట ఆహ్లాదకరము, ఆనందదాయకము. వ్యక్తిగాని, సమాజముగాని నిత్యము సుఖమును ఆనందమును, సృజనశీలతను, ఉన్నత మానసిక శక్తిని సాధించుటకు కృషి చేయుచుండుట చేత, వ్యక్తిగత పరిపూర్ణతకు, సామాజిక సమన్యమునకు యోగమే నిజమైన పరిష్కారము.
    ఈ యోగ పద్దతులు బహుముఖములు. దానిలో అంతర్గతముగనున్న ఐక్యతను, సమన్వయమును తెలిసికొనిననేగాని, ఈ బహుముఖత మధ్యలో దారి తప్పుట తథ్యము. ఒకసారి భిన్నత్వములోని ఏకత్వము చూసి అంతర్ధృష్టి పెంపొందించినచో, యోగ స్వభావమును తెలియజేయు సత్యము బయల్పడును. స్వామి వివేకానంద తమ ఉపన్యాసములలో ఈ సమన్వయతను వక్కాణించిరి. ఆయన ఇనుప కండరములు, ఉక్కు నరములు కలిగిన మానవులను కోరిరి. శ్రీ అరవిందులు భౌతిక, మానసిక, వైజ్ఞానిక, భావప్రేరిత, ఆధ్యాత్మిక పెరుగుదలపై దృష్టిని కేంద్రీకరించి చెప్పిరి. మానవుని వ్యక్తిత్యము అన్ని కోణములలో అభివృద్ధి చెందుటకనువుగా, యోగాచరణ పద్దతులు పొందుపరచబడిని. ఆసనములు శక్తిని పొదుపుచేసి, దానిని సూక్ష్మ రూపములైన మానసిక శక్తులుగా మార్చుట కుపయోగపడును. అట్టి ఆసనములు చేయుటకు వీలుగా శరీరమును తేలికాను, సులభముగాను వంచుటకు వీలుగా వ్యాయామములు ఉన్నవి. ఆసనములు మనిషి యొక్క అంత ప్రజ్ఞను పెంపొందింపజేసి, మనశ్శాంతిని కలుగుజేయును. శ్వాసకోశ, రక్తచలన, నరముల, జీర్ణకోశ మండలములును శుభ్రపరచుటను, శరీరమొక సమతుల క్రమపద్దతిలో పనిచేసి, తద్వారా సూక్ష్మనాడులను శుభ్రపరుచుటకు తోడ్పడును. ఈ మెలకువలు వ్యక్తిని ప్రాణాయామము, ముద్రలు, బంధములు అభ్యసించుటకు సిద్దపరుచును.
    ‘యోగ’ మన మానసిక, శారీరక సమస్యలకు చక్కని సమాధానం మనిషి యొక్క ఆహారము, ఆలోచన, ప్రవర్తన, దృష్టి, కర్మ జీవనశైలిని ప్రభావితం చేసే గొప్ప సాధన – ‘యోగసాధన’.

Read Full Post »

How to make different Jucies in Telugu

 రకరకాల జ్యూసులు తయారు చేసుకోనే విధానం

different type juices in telugu

juices how to make in telugu language

క్యారెట్‌ స్వీట్‌ జ్యూస్‌ : క్యారెట్‌(2), ఫైన్‌ ఆఫిల్‌ లేదా ఆరెంజ్‌ లేదా మౌసంబి, (పల్లీలు, పచ్చి కొబ్బరి ముక్క, బనానా – ఫ్యాట్‌ లేని వారికి), బెల్లం ముక్క, నిమ్మకాయ రసం కొద్దిగా, ఇలాచి పౌడర్‌, సాల్ట్‌, వాటర్‌. క్యారెట్‌ చిన్న ముక్కలు చేసి ఫైన్‌ ఆపిల్‌ ముక్కలు, పల్లీలు, పచ్చి కొబ్బరి, బనానా మిక్సీలో మిక్స్‌ చేసి బెల్లం ముక్క, నిమ్మకాయ రసం కొద్దిగా, ఇలాచి పౌడర్‌, సాల్ట్‌, వాటర్‌ కలిపి త్రాగాలి.

క్యారెట్‌ హాట్‌ జ్యూస్‌ : క్యారెట్‌ (2), నిమ్మ రసం, సాల్ట్‌, నల్ల మిరియాలు (2), 300 ఎం.ఎల్‌. వాటర్‌  లో క్యారెట్‌ ముక్కలు వేసి 300 ఎం. వాటర్‌ 150 ఎం.ఎల్‌ వచ్చు వరకు బాయిల్‌ చేయ్యాలి. ఫిల్టర్‌ చేసిన వాటర్‌ లో లైట్‌గా నిమ్మరసం, మిరియాలు కలిపి త్రాగాలి.     

బీట్‌ రూట్‌ స్వీట్‌ జ్యూస్‌ : సపోటా సైజ్‌ బీట్‌రూట్‌, బ్లాక్‌ గ్రేప్‌, బూడిద గుమ్మడికాయ ముక్క, బెల్లం ముక్క, ఇలాచి పైవి అన్ని మిక్సీలో వేసి త్రాగాలి.

బూడిదగుమ్మడికాయ జ్యూస్‌ : బూడిదగుమ్మడికాయ చెక్క, గింజలు తీసిన కండల కల చిన్న ముక్కలు, గ్రేప్‌ కొంచెం, జ్యూస్‌ చేసి బత్తాయి, నిమ్మ రసం, బెల్లం కలిపి త్రాగాలి.  

దోసకాయ జ్యూస్‌ : మీడియం సైజు దోసకాయ, టమాట, చిన్న కొబ్బరి ముక్క, కొత్తిమీర, జిలకర్ర, ఉప్పు అన్ని మిక్స్‌ చేసి కొద్దిగా వాటర్‌ వేసి త్రాగాలి. ష పొట్టని క్లీనింగ్‌ చేస్తుంది.

పూదీనా జ్యూస్‌ : పూదినా ఒక కట్ట ఆకులు, కొత్తిమీర ఆకులు, 1 1/2 గ్లాస్‌ వేడి వాటర్‌ లో ఈ ఆకులు వేసి బాగా మరిగిన తర్వాత దానిలో చిటికెడ్‌ ఉప్పు కొంచెం షుగర్‌ వడకట్టి నిమ్మకాయ పిండి త్రాగాలి. ఇన్‌జైజేషన్‌, పుడ్‌ అరగకపోవడం.

డేప్రూట్‌ జ్యూస్‌ : ఎండు కర్జూరాలు రెండు, కిస్మిస్‌ బ్లాక్‌ (6), జీడిపప్పు (4), బాధం పప్పు (రెండు), బెల్లం లేదా తేనె నానబెట్టాలి. మిక్స్‌ చేసి తినాలి.  ష సన్నగా వున్నవారికి

గోధుమ పాలు : గోధుమలు 50 గ్రా|| 24 గం|| నాన బెట్టాలి. నీళ్ళు వడకట్టి మళ్ళీ గోధుమలను గుడ్డలో కట్టి పెట్టాలి. మొలకలు వచ్చిన తరువాత మిక్సిలో వేసి అఫ్‌ అరటిపండు లేదా ఆపిల్‌ లేదా సపోటా వేసి మిక్స్‌ చేయ్యాలి. వాటిని వడకట్టి కొద్దిగా బెల్లం వేసుకొని త్రాగాలి.

జ    వీక్‌ పేషంట్‌, శరీరం ముడతలు, హిమోగ్లోబిన్‌ ఇంప్రూవ్‌.

జ    బ్లాక్‌ గ్రేప్‌ ను నానబెట్టి మార్నింగ్‌ తినటం నరాల బలహీనతనకు, వంకరలకు.

జ    రాగి పాత్రలో దాల్చిన చెక్క, తులసి ఆకుల నానబెట్టి మార్నింగ్‌ తాగాలి నీరు, ఆకులు తినాలి, చెక్క పారేయ్యాలి. చాలి మంచి ఆరోగ్యం కడుపులో.

హరిత రక్తం : ”హరిత రక్తం” అనబడే గోధుమ గడ్డికి వైద్యపరంఘా ఉపయోగాలెన్నో దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఆరోగ్యంఘా ఉన్న గోధుమ గింజల్ని యిసుక ముట్టిని నింపిన కుండలో నాటితే 5,6 రోజులలో మొలకలు వస్తాయి. వాటిని అలాగే తినవచ్చు లేదా వాటిని నూరి రసంలా చేసుకొని త్రాగవచ్చు.  

ఉషాపానం : రాగి చెంబులో నీళ్ళు యుంచి వాటిని ప్రొద్దునే త్రాగాలి. అప్పటి వరకు ఏమి తినరాదు.

మీరు తీసుకొనే ఆహారము : పెసర్ల నీళ్ళు, బియ్యం నీళ్ళు, బార్లీ నీళ్ళు, చనగల నీళ్ళు, దొడ్డు గోధుమ రవ్వ ఖిచిడీ, పాలు (ఆవుపావలు), బియ్యం, రొట్టె నువ్వుల నూనె, నెయ్యి, చనగలు, మురమురాలు, ఉప్పు, గోధుమహల్య (హలువా) మొదలగునవి.

ఫలాలు : ద్రాక్ష, నల్ల ద్రాక్ష, ఆపిల్‌, ఫైనిఫిల్‌, బిల్వపండు నిమ్మకాయ, ఆనిమ్మ, కొబ్బరి నీళ్ళు, ఖర్జూరం, జీడిపప్పు, పండిన మామిడి పండ్లు, అత్తిపండు ఆఖరోట్‌ మొదలగునవి.

కూరగాయలు : కందమూలాలు, గింజలు, తాజా మూలి, గింజలు లేని బెండ, కాకర, మెంతి, పాలకూర, బీరకాయలు, దోసకాయ, బీట్‌రూట్‌, కోహడా.

పెసర్ల నీళ్ళు : 50 గ్రాముల పెసర్లను వేసి అందులో 1500 మి.లీ. నీళ్ళును పోసి ఉడికించాలి. ఎప్పుడైతే పెసర్లు నీళ్ళతో కలిసిపోతాయో, అనగా ఒక కప్పు అయ్యేంతవరకు ఉడికింఇ అంధులో మసాలా వేసి తినాలి.

పెసర్లు : 50 గ్రాముల పెసర్లను వేసి అంఉలో 1500 మి.లీ. నీళ్ళును పోసి ఉడికించాలి. బాగా ఉడికిన తరువాత అందులో పసుపు, మిరియాలు, శొంఠి, అల్లం, జీలకర్ర, ధనియాలు మొదలు మసాల వేసి తినాలి.

బియ్యం గంజి : ఒక కిలో నీటిలో 50 గ్రాముల కడిగిన పాత బియ్యంపోసి ఉడికించాలి. ఒకట రెండు సార్లు ఉడికిన తరువాత, జల్లెడ పట్టి రోగి పరిస్థితిని బట్టి అందులో కొంచెం చక్కెర గాని ఉప్పుగాన్వి వేసి త్రాగించాలి.

బార్లీ నీరు : బియ్యం గంజి లాగానే 50 గ్రాముల బార్లీ ఒక కిలో నీటిలో పోసి ఉడికించి ఉడికిన తరువాత జల్లెడ పట్టి త్రాగించాలి.

బార్లీ గటక : 50 గ్రాముల బార్లీ పిండి 650 మి.లీ. నీళ్ళలో పోసి ఉడికించి అందులో పిండి నెమ్మదిగా పోసి ఉడికించి 10-15 నిముషాల వరకు ఉడకనిచ్చిన తరువాత, కొంచెం వేడి పాలను పోసి, చల్లబరిచిన తరువాత రోగికి తాగించాలి.

మహెరీ : ఒక పిడికెడు బియ్యాన్ని పెనంపై కొంచెం వేంచి, ఒక కిలో నీరు పోసి, అవసరమైన ఉప్పును చేర్చి, బియ్యాన్ని పోస, సగం నీరు పోయేవరకు ఉడికించాలి. తరువాత పుల్లటి మజ్జిగ పోయాలి. తరువాత అందులో నువ్వులు, జిలకర, ధనియాలు, లవంగాలు, మిరియాలు పోసి ఉడికించాలి.

జాపలు : బియ్యం, గోధుమలు, జొన్నలు వేరు వేరూ పెనంపై మామూలూ వేంచి, రువాత నీటిలో ఒక కిలో నీరు పోసి కావాలసినంత ఉప్పును వేసి చిన్నమంటపై ఉడికింఛాల. అందులో జీలకర్ర, మెంథులు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు, మిరియాలు పోసి తిరగమూత పెట్టుకోవచ్చు.

ధనియాల పంచకం : ధనియాలు, జీలకర్ర, సోంపు, నల్లద్రాక్ష, పటిక బెల్లం ఈ అయిదు వస్తువులను ఒకే విధంఘా తీసుకొని పిండి చేసి, ఇందులోని 20 గ్రాముల మిశ్రమాన్ని రాత్రి 200 మి.లీ. నీళ్ళళో నానబెట్టి వడపోసి తాగాలి.

పాల తీపి : 200 మి.లీ. పాలలో 200 మి.లీ. నీళ్ళను పోసి మీకిచ్చిన చూర్ణాన్ని 1 నుండి 2 గ్రాముల వరకు కలిప, మొత్తం 200 మి.లీ. నీళ్ళు మరిఇపోయేవరకు వేడచేసి చల్లబరచిన మిశ్రమాన్ని తాగాలి. అవసరం అనుకుంటే పటిక బెల్లం వేసుకోవచ్చు.

నల్లద్రాక్ష : కషాయం 20 గ్రాముల నల్లద్రాక్షలో 300 మి.లీ. నీళ్ళను కలిపి కనీసం 8 గంటలైనా నానబెట్టి, తరువాత ఉడికించి, 200 మి.లీ. నీళ్ళు మిగిలే వరకు ద్రాక్షను ఉడికించి వడపోసి తాగించాలి.

చనగల నీళ్ళు : 50 గ్రాముల చనగలను 500 నీళ్ళలో పోసి 6-7 గంటల వరకు నానబెట్టి, ఇత్తడి పాత్రలో పోసి ఉడికించి, పైన కొంచెం సైందవ లవణం, 5-6 మిరియాల గింజలను వేసి, కొంచెం ఉడికిన తరువాత, వడపోసి నీటిని రోగికి తాగించాలి.

దలియా : 50 గ్రాముల మంఛ గోధుముల రవ్వను తీసుకొని, కడిగి పాత్రలో వేయించి శనగలు తినకూడదు. ఇందులో 1500 మి.లీ. నీటిని పోసి ఉడికింఛాల. రవ్వ బాగా ఉడికిన తరువాత దింపి మసాల వేయంఢి, తిరిగి దలియా మంచిఆ ఉడిఇన తరువాత తినాల. తియ్యని దలియా తయారుచేయడానికి అవసరమైన పటిక బెల్లం గాని వేసి తయారు చేయాలి. నెయ్యి వేయాలనుకుంటే నీటితో పాటు 20 గ్రాముల నెయ్యిని వేసి ఉడికించాలి.

శొంఠి కషాయం : 200 మి.లీ. నీళ్ళలో 2-5 గ్రాముల శొంఠి పొడి వేసి ఉడికించాలి. ఒక కప్పులో 10-15 మి.లీ. ఆముదం నూనె పోసి మాసిక ధర్మాన్ని 7 రోజులకు ముందుగానే ఉదయం పరగడుపున తాగాలి.

కూరగాయలు రసంతో షర్‌బత్‌ : పైన కనబరచిన పచ్చళ్ళను చేయునప్పుడు (తురిమినప్పుడు) వచ్చే కూరగాయలు రసాన్ని సేకరించి దానికి టెంకాయ నీటికి కలిపి, చకెన్రు రుచకి తగిన ప్రమాణంలో చేర్చ తక్షణం ఉపయోగించండి  (ఇటువంటి షర్‌బత్‌ను చాలా సేపు వుంచి ఉపయోంచరాదు).

కాషాయం : ధనియాలు, జీలకర్ర (ధనియాలతో సగభాగం), నిమ్మరసం, పుదినా, అల్లం, యాలుకుపొడి, బెల్లం. కొద్దిగా వెచ్చఆ వేయించిన ధనియాలు జీలకర్ర పొడిఆ దంఛి దానిని కావలసినం నీటిలో కలిపి ఉడకబెట్టాలి. తరువాత దానికి పుదీనా అ్లం యాలులు పొడి బెల్లం వేసి బాగుగా ఉడికింఛి జల్లెడ పట్టి  (సోదించి) తరువాత నిమ్మరసం కలపాలి. కాఫీ, టీ త్రాగడానికి బదులు దీనిని త్రాగితే ఆరోగ్యం.

పుష్ఠినిచ్చే పానీయం : రెండు గంటలకాలం నానబెట్టన వేరుశెనగ విత్తనాలు 20 గింజలు తగినంథ బెల్లం లేక తేనె ఏదైనా పండు (అరటి, సపోట, ద్రాక్ష, ఆపిల్‌, నారింజ లాంటివి) పచ్చి కొబ్బరి కొద్దిగా కలిపి మిక్చర్‌లో రుబ్బేది. ఆ రసం ప్రతి నత్యం ఉదయం ఒక కప్పు సేవిస్తే చాలు ఎంతో ఆరోగ్యం శక్తి నిస్తుంది.

Read Full Post »

Older Posts »