Feeds:
Posts
Comments

Archive for September, 2011

Yoga Mudras

ముద్రలు

ముద్రలను రెండు చేతులతో చేయవలెను. ఎ పరిస్థితిలో ఉన్న వీనిని ఎప్పుడైన చేయవచ్చును

లింగముద్ర

రెండు చేతులు వ్రేళ్ళు పరస్పరం లాగి లోపలి వైపున ఉన్న బ్రొటన్‌ వ్రేలిని పైకి తీసు నిలువుగా నుంచవలెను. శరీరము నందు ఉష్ణత్వము పెరుగును. దగ్గుతగ్గును, ఖపము నశించును.

శూన్య ముద్ర

మధ్య వ్రేలు మడిచి దాని గోటిపై భాగమును బ్రొటన్‌ వ్రేలి యొక్క మొదటి కణుపుతో స్పృశించవలెను. మిగిలిన మూడు వ్రేళ్ళు నిటారుగా నుండవలెను.  ఈ ముద్ర చేయుట వలన చెవినొప్పి తగ్గును. చెవి నుండి చీము కారుచున్నను లేక చెముడు ఉన్నను ఈ ముద్ర 4 మొదలు 5 నిమిషముల వరకు చేయవలెను.

పృథ్వీ ముద్ర

చిటికెన వ్రేలిని బ్రొటని వ్రేలి పై భాగముపై స్పర్శచేయించవలెను. మిగిలిన మూడు వ్రేళ్ళు నిటారుగా నుంచవలెను. శరీరం బలహీనతను దూరం చేయడానికి, క్రొత్త, తాజా, తేజస్సు మరియు స్ఫూర్తి కొరకు ఈ ముద్ర అత్యంత లాభదాయకమైనది.  

సూర్యముద్ర

ఉంగరపు వ్రేలు ను ముడిచి దాని గోటిపై భాగముతో బ్రొటని వ్రేలిని తాకించవలెను. మిగిలిన మూడు వ్రేళ్ళు నిటారుగా నుండవలెను.

జ్ఞానముద్ర

తర్జని (చూపుడు వ్రేలు) ని బ్రటని వ్రేలి పై బాగము మీద తాకించవలెను. మిగిలిన మూడు వ్రేళ్ళను నిటారుగా ఉంచవలెను.  అనిద్ర లేక అతి నిద్ర, బలహీనమైన జ్ఞాపకశక్తి, క్రోద స్వభావము మున్నగు మానసిక రోగములందు ఈ ముద్ర లాభదాయము

వరణా ముద్ర

మధ్య వ్రేలిని ముడిచి దానిపై భాగమును బ్రటని వ్రేలి పై భాగమును తాకించవలెను. మిగిలిన మూడు వ్రేళ్ళు నిటారుగా నుంచవలెనభీ ముద్ర చేయుట వలన రక్త వికారములు, తత్ఫలితముగా సంక్రమించు చర్మరోగ పాండురోగములు మున్నగు జలతత్వములు లోపించుట వలన వచ్చు రోగములు తొలగును.

ప్రాణముద్ర

చిటికెన వ్రేలు, అనామిక మరియు బ్రొటని వ్రేలి పై భాగమును పరస్పరము ఒకేసారి తాకించవలెను. మిగిలిన రెండు వ్రేళ్ళు నిటారుగా నుంచవలెను.  ఈ ముద్ర ప్రాణశక్తికి కేంద్రము. దీనిచే శరీరము నిరోగమగును. నేత్ర రోగముల నశింప జేయుటకు, కంటి జోడు నంబరు తగ్గించుటకు ఈ ముద్ర అత్యంత లాభదాయకము.

వాయు ముద్ర

తర్జని ముడిచి దాని కణుపై భాగమును బ్రొటని వ్రేలి మొదటి కణుపులో తాకించవలెను. మిగిలిన మూడు వ్రేళ్ళు నిటారుగా నుంచవలెను. కీళ్ళ నొప్పులు, పక్షవాతము, హిస్టీరియా రోగములందు గుణమిచ్చును. ఈ ముద్రలో ప్రాణముద్ర చేసినట్లయిన శ్రీఘ్రలాభము కలగును.

అపాన వాయు ముద్ర

చూపుడు వ్రేలును బ్రొటని వ్రేలి మూలము నందు పెట్టి బ్రటని వ్రేలి అగ్రభాగమును మధ్య రెండు వ్రేళ్ళ అగ్రభాగములు స్పృశించవలెను. చిటికెన వ్రేలును వేరుగా నుంచవలెను. ఈ స్థితికి అపాన వాయు ముద్రయని పేరు, ఎవరికైనను ‘హర్ట్‌ఎటాక్‌’ లేక్‌ హృదయ రోగము అకస్మాత్తుగా నారంభమైన ఈ ముద్రను అవలంబనము చేయుట వలన ‘హర్ట్‌ ఎటాక్‌’ ను వెంటనే ఆపవచ్చును.  గుండెదడ, గుండె తీవ్రత లేక మందగతి గుండె మెల్లమెల్లగా కొట్టుకొనుట మున్నగు గుండె జబ్బుల యందు వెంటనే గుణము నిచ్చును. కడుపులో గ్యాసును, హృదయ, ఉదరమునందలి అశాంతి, సంపూర్ణ శరీరమందలి అశాంతి, ఈ ముద్రను అభ్యసించుట వలన తొలగింపవచ్చును.

అవసరమును బట్టి 20 మొదలు 30 నిముషముల వరకు దీన్ని అభ్యసించవచ్చును. 

Advertisements

Read Full Post »

శ్రీ విఘ్నేశ్వరాష్టోతర శతనామావళి

ఓం మహాగణాధిపతయే నమః

శ్లో||    అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
    అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే||  

ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం షన్ముఖాయ నమః
ఓం కృత్తియే నమః
ఓం జ్ఞానదీపాయ నమః    10
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయే నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబ జఠరాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః    20
ఓం మంగళ స్వరూపాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం ప్రధమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహస్తే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః    30
ఓం శ్రీపతయే నమః
ఓం ప్రాకృతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రిత వత్సలాయ నమః
ఓం శివప్రయాయ నమః
ఓం శ్రీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం భవాయ నమః
ఓం బలోత్ధితాయ నమః
ఓం భవాత్మజాయ నమః    40
ఓం పురాణపురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకరప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వేపన్యాసాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్ట వరదాయినే  నమః
ఓం సర్వసిద్ది ప్రదాయ  నమః    50
ఓం సర్వసిద్దయే  నమః
ఓం పంచహస్తాయ  నమః
ఓం పార్వతీ నందనాయ  నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసుర భంజనాయ  నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదక ప్రియాయ నమః
ఓం కాంతి మతే నమః
ఓం ధృతిమతే నమః        60
ఓం కామినే నమః
ఓం కపిత్ధవసన ప్రియాయ నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం విష్ణు ప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం జితమన్మధాయ నమః
ఓం ఐశ్వర్య కారణాయ నమః    70
ఓం జయినే నమః
ఓం యక్షకన్నెర సేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం ఉన్నత్తవేషాయ నమః
ఓం పరజితే నమః
ఓం సమస్త జగదాధారయ నమః
ఓం జ్యోతిషే నమః
ఓం పుష్కరోక్షిప్తవారణే నమః    80
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం అప్రాక్తాయ నమః
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః        90
ఓం సఖ్యై నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం సమస్తదేవతా మూర్తియే నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం బ్రహ్మ విద్యాధరయా నమః
ఓం జిష్టవే నమః
ఓం సహిష్ణవే నమః        90
ఓం సతతోత్దితాయ నమః
ఓం విఘాతకారిణే నమః
ఓం విశ్వదృశే నమః
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణగురవే నమః
ఓం సర్వైశ్వర్య ప్రదాయాయ నమః
ఓం ఆక్రాన్త చిత్‌చిత్బ్రభవే నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ  నమః    108

Read Full Post »