Feeds:
Posts
Comments

Archive for February, 2013

Yoga Food with uses in Telugu, Yoga Food Description:

ఆహారం
”అన్నాద్భూతానిజాయంతే, జాతాన్యన్నే వర్ధంతే
అద్యతే త్తిచభూతాని, తస్మాదన్నంతదుచ్యతే”
    ఆహారం నుండి ప్రాణ కోటి జనించుచున్నది, జన్మించిన ప్రాణులు అన్నము చేతనే వృద్ధి పొందుచున్నవి. ప్రాణులచే భక్షింపబడుచున్నది. ప్రాణులను భక్షించునది కావున దీనిని అన్నము అను పేరు వచ్చినది.
”అధ్యతే విధి వద్భుక్త మత్తి భోక్తారమన్యధాం
ఆయుష్యం స్వాస్ధ్యధం, పూర్వమన్యదైవేతరత్‌ స్మృతమ్‌”
    మితముగా/హితముగా భుజింపబడిన ఆహారం భోక్తద్వారా భక్షితమగును. దీనికి విరుద్దముగా సేవింపబడిన అన్నము భోక్తనే భక్షించును. అనగా అల్పాయుష్కరము, అనారోగ్యకారకం అగును.
”ఆహారః ప్రాణినః సద్యోబలకృతదేహద్ధారకః
ఆయుస్తేజః సముత్సాహః స్మౄత్యోజో అగ్ని వివర్ధనః” 
    ఆహారం ప్రాణులకు సేవించినంతనే బలమును ఇచ్చును, శరీరంను వృద్ధి పొందించును. ఆయుష్షును తేజస్సును, ఉత్సాహమును, ఓజస్సును, అగ్నిని వృద్ధి పొందించును. కావున ప్రమాణయుక్తమున ఆహారంను స్వీకరించవలెను. 
”ఆహార శుద్ధౌ సత్వ్యశుద్ధిః
    అంతఃకరణ శుద్ది వలననే ఆలోచనలు, భావములు, శ్రద్ధాదిగుణములు క్రియలు పవిత్రములుగా ఉంఢును. మనుష్యుడు భుజించు ఆహారమును బట్టి అతని అంతఃకరణ స్థితి యేర్పడును. అంతఃకరణమునకు అనుగుణముగా శ్రద్ధయు ఉండును. ఆహారము శుద్దమైనచో అంతఃకరణము గూడ శుద్ధముగా ఉండును.
అన్నోపాసన :  
ప్రాణాలు అన్నమయాలు. అన్నం తినకపోతే ఇంద్రియాలు పనిచేయలేవు. ప్రాణాలు నిలువలేవు. అన్నం నుంచే జీవులు జన్మిస్తున్నారు. అన్నం వల్లే జీవిస్తున్నారు. అన్నంలోనే లయిస్తున్నారు. అందువల్ల ‘అన్నమే ఆత్మ’ అని ఉపాసన చేయాలి. అన్నమే ప్రాణంగా, ప్రాణమే మనస్సుగా, మనస్సే విజ్ఞానంగా, విజ్ఞానమే ఆనందంగా పరిణామం చెందుతూ ఉన్నది. కాబట్టి అన్నమే పంచవిధ కోశాలకూ మూలం. కాబట్టి అన్నాన్ని నిందిచకూడదు. (ఇది బాగాలేదు. దీన్ని మనుష్యులెవరూ తినరు ఈవిధమైన) అన్న నింద చేయకపోవటాన్ని ఒక వ్రతంగా భావించాలి. అన్నాన్ని పారవేయకూడదు. అలా దాన్ని సద్వినియోగం చేయటాన్ని వ్రతంగా భావించాలి. అన్నాన్ని వృద్ధి చేయాలి. దినదినమూ పెరిగే జీవుల ప్రాణాలు నిలపే అన్నాన్ని విరివిగా, సమృద్ధిగా ఏర్పాటు చేయటం వ్రతంగా భావించాలి. ‘అద్యతే ఇతి అన్నమ్‌’. మనం (సకల ప్రాణికోటి) భుజించేది కాబట్టి దీనికి అన్నము అని పేరు. అంతేకాదు ‘అత్తిఇతి అన్నమ్‌’ (మననే భుజించేది) ఏ నియమం లేకుండా – ఎప్పుడుతలుచు కొంటే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది దొరికితే అది, ఎలా దొరికితే అలా – తినేవాడిని ఆ అన్నమే తినివేస్తుంది. అంటే అతని ఆరోగ్యాన్నీ, ఆయువునూ తగ్గించి వేస్తుంది. కాబట్టి కూడా దీనికి అన్నం పేరు అన్నాన్ని కాపాడుకోవాలి.
సాత్త్వికాహారము :  
ఆయువును, ఉత్సాహాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతిని పెంపొందించే రుచికరములైనవి, చమురుతో కూడినవి. మనోహరమైనవి, శరీరంలో చాలాకాలము నిలువ ఉండేవి అయిన పదార్దాలతో కూడిన భోజనం సాత్త్వికాహం, ఇది ప్రశస్తమైనది.
రాజసికాహరము : 
చేదు, పులుప, ఉప్పు, కారపు రుచులతో మిక్కిలి ఉషఅణం కలదై, సారంలేక, దాహాన్ని పెంచుతూ, శారీరకంగానూ, మనసికంగానూ దుఃఖాన్నీ, రోగాలనూ పెంపొందించే వస్తువులతో కూడిన భోజనం రాజసాహారం. 
తామసాహారము : 
చాలా కాలానికి ముందే వండినది, రుచిలేనిది, కంపు కొట్టేది, పాచిపోయినది, క్రిమి కీటకాదులు పశుపక్ష్యాదులు ఎంగిలిచేసి విడిచినది, పూజకు తగనిదీ అయిన భోజనం తాసాహారం. ఇది ఎంతమాత్రం తినుటకు పనికిరానిది. మనుష్యుల్లో కూడా ఈ విభాగం ఉన్నది. అంటే సత్త్వగుణం ప్రధానంగా కలవారూ, రజోగుణ ప్రదానులూ, తమోగుణ ప్రధానులును. వారి వారి గుణాలకు తగినట్లే వారు ఆహారాన్ని ఇష్టపడతారు. అయితే శ్రద్ధ కలవాడు తన (సహజ) గుణాన్ని (శ్రద్ధను) తామసగుణాన్నుంచి రాజగుణానికీ, రాజసగుం నుంచి సాత్త్వికగుణానికీ మార్చుకోవాలి. అందుకు అహారంలో తగిన మార్పు చేసుకోవాలి. ఇది ఒక తపస్సు.
సమతులాహారం
శరీరం సక్రమంగా ఆరోగ్యంతో ఉండాలన్నా, శరీరానికి అవసరమైన శక్తి సరిపడా లభించాలన్నా మనం అన్ని పోషక విలువలు కలిగిన సమతుల్యాహారాన్ని రెగ్యులర్‌ తీసుకొంటూ ఉండాలి.
మన మనుగడకు అవసరమైన ఆహారం ద్వారా మనకు లభించే పోషక విలువలు :
కార్బోహైడ్రేట్స్‌, మాంసకృత్తులు, కొవ్వు పదార్ధాలు, విటమిన్‌లు, ఖనిజ లవణాలు         నీరు, పీచు పదార్ధం.
కార్బోహైడ్రేట్స్‌ : శక్తిని సమకూర్చటం కోసం మనం తిన్న ఆహారంలోని చెక్కర, పిండి పదార్ధం ముక్కలు ముక్కఉ కింద విభజింపబడతాయి. ఇవి త్వరగా హరాయించుకు పోతాయి. అంటే అప్పుడు మీరు తిన్న ఆహారం ఎక్సర్‌సైజులు చేయటానికి ముందు తీసుకోదగ్గ ఆహారంగా భావించవచ్చు.
మాంసకృత్తులు :  మన శరీరంలో మాంసకృత్తులు జీర్ణమయాయ్క అమినోయాసిడ్స్‌ కింద విడుదలయి నూతన కణ నిర్మాణానికి ఇటుకలా ఉపకరిస్తాయి.
క్రొవ్వు పదార్ధాలు : క్రొవ్వు పదార్ధాలు శక్తి కేంద్రీకృతం కావటానికి (్పుళిదీబీలిదీశిజీబిశిలిఖి జూదీలిజీవీగి కింద) ఉపకరిస్తాయి. శరీరంలో హార్మోనులు, ఆజీళిరీశిబివీజిబిదీఖిరిదీరీ లాంటి రసాయన వాహకాలు తయారు కావటానికి సహకరిస్తాయి.
విటమిన్లు : విటమిన్లు శరీరంలోని వివిధ కణాల చర్యలకు ఉపయోగపడాతయి. గ్లూకోజ్‌లోని శక్తి రిలీజ్‌ కావటానికి ఉపయోగపడతాయి.
ఖనిజ లవణాలు : ఎదుగుదల, రిపేరు మోకానిజాలకి ఉపకరించే 16 రకాల ఖనిజ లవణాలున్నాయి. ఇవి పోషక పదార్ధాల నుంచి శక్తిని విడుదల చేయించటానికీ, కొత్త  కణ నిర్మాణానికీ సహకరిస్తాయి.
పీచుపదార్దం : జీర్ణక్రియ మీద ప్రభావాన్ని చూపుతూ, శక్తిని సమకూర్చే మిగతా పోషక పదార్దాలను శరీరం హరాయించుకునేట్లు చేయటం ద్వారా ఫైబర్‌ మన శరీరపు కణ పునర్నిర్మాణాన్ని (్పులిజిజి ఖలిశిబిలీళిజిరిరీళీ ని) క్రమబద్దీకరించాటనికి ఉపకరిస్తుంది.
నీరు : మనకు ముఖ్యావసరాలన ఆహారం, ఆక్సిజన్‌, రోగనిరోధక కణాల్ని దేహమంతటికీ అందిస్తూ ప్రవహించే రక్తంలో 83 శాతం నీరు ఉంది.
    దేహం తనలోని మలిన పదార్ధాలను చెమట, మూత్రం రూపాలలో నీటి ద్వారానే బయటికి విసర్జిస్తుంది. దేహంలో సరిపడా నీరు లేకపోతే ఈ మలిన పదార్దాలు లోపలే ఉండిపోయి శరీరాన్ని విషపూరితం చేస్తాయి. ఆహారం జీర్ణం కావడానికి నీరు ఎంతో అవసరం. సరిపడా నీరు తీసుకోకపోతే మలబద్దకం ఏర్పడుతుంది.
    మనం తాగే నీటిలో కొంత భాగం తప్పనిసరిగా కిడ్నీలగుండా ప్రయాణించి కిడ్నీలలోనూ, మూత్రకోశంలోనూ, ముత్రనాళంలోనూ ఉండే మలినాలను బయటకి పారదోలుతుంది. ప్రతిరోజూ మనలోని కిడ్నీలు అయిదు గ్లాసుల నీటిని ఉపయోగించుకుంటాయి. శరీరానికి సరిపడా నీరు లభించకపోతే చర్మం పొడిబారుతుంది. రక్తంలో నీటి శాతం తక్కువ అయినపుడు రక్తం లవణపూరితమై తనకు అవసరమైన నీటిని నోటిలోని లాలాజల గ్రంధుల నుంచి గ్రహిస్తుంది. ఫలితంగా నోరు పొడిగా అయి మనకు ‘దప్పిక’ అనుభూతి కలుగుతుంది.
యాంటీ ఆక్సిడెంట్స్‌
    ఇనుముకు తుప్పు పట్టడం ఆక్సీకరణ అనే రసాయన ప్రక్రియవల్ల జరుగుతుంది. ఆక్సీకరణ ప్రభావం వల్ల ఆహార పదార్దాలు గోధుమరంగుకు మారతాయి.
    ఆక్సీకరణ కలిగిస్తున్న పదార్ధంతో యాంటీ ఆక్సిడెంట్‌ అయిన రసాయన పదార్ధం కలిపినపుడు అది ఆక్సీకరణ ప్రభావాన్ని తొలగిస్తుంది. ఉదారహరణకు నిమ్మరసాన్ని పిండారంటే ఆ పదార్ధం ఆక్సీకరణకు గురి కాకుండా చూస్తుంది. ఇక్కడ నిమ్మరసం యాంటీ అక్సిడెంట్‌గా పని చేస్తుంది.
    మన శరీరంలో కణజాలంలో సహజ సిద్దంగానే ఆక్సీకరణ ప్రక్రియ ‘ప్రీ రాడికల్స్‌’ అనే పదార్దాల ఉత్పత్తి జరుగుతుంది.
    మన శరీరంలో స్వల్పంగా ఏర్పడే పిరాడికల్స్‌ను కొన్ని బాక్టీరియా, వైరస్‌లతో సహజంగానే నశింపజేయ గలుగుతాయి. అధిక పరిమాణంలో ఉత్పత్తి చెందితే కణజాలాలు డామేజ్‌ చెందుతాఇ. ఇలా జరగడం వల్ల అవయవాలు విధులు నిర్వహించలేకపోవడం మరియు మనల్ని త్వరగా వృధాప్యానికి చేరువ చేస్తాయి.
    ఇలాంటి పిరాడికల్స్‌ శరీర భాగాలలోని కములలో అధికముగా ఉత్పన్నమైనప్పుడు  రోగాల తీవ్రత ఎక్కువగా ఉండును. ప్రకృతి అందించిన ఆహారం నుంచి మనకు సహజసిద్దంగా యాంటీ ఆక్సిడెంట్స్‌గా లభించే పోషక పదార్దాలు విటమిన్‌ ‘ఎ’, ‘సి’, ‘ఇ’, కాల్షియం.
    ఎ విటమిన్‌     :    పాలకూర, తోటకూర, మెంతికూర
                              క్యారెట్‌, మంచి గుమ్మడి, మామిడి, బొప్పాయి, రేగిపండ్లు
    సి విటమిన్‌     :    నారింజ, నిమ్మ, జామ, ఉసిరి, టొమాట
    ఇ విటమిన్‌     :    బాదంపప్పు, మొలకెత్తిన గింజలలో, ఆకుకూరలలో
    నిత్యం అమృతాహారం సేవించడం ద్వారా ఈ ఆక్సీకరణ నుండి ఏర్పడిన పీరాడికల్స్‌ను తొలిగించవచ్చును. 
అమృఆహారం నిజాలు

    మన శరీరంళో ప్రతి రోజు ఎంతో జీవశక్తి వినియోగం అవుతూనే ఉంది. ఆ శక్తి కణముల మొదలు నుండి శరీర నడవడికకు అవసరమయ్యే అవయవాలు మరియు ఇంకా అన్ని వ్యవస్ధల యందు అవసరం. ఈ జీవశక్తి ఈ అమృతాహారంలో పుష్కలంగా ఉంది.
    ప్రకృతి అందించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, మొలకెత్తించిన విత్తనాలలో సహజమైన జీవము ఉంది. మరియు మాంసకృత్తులు, విటమిన్లు, లవణములు, ఆమ్లమములు, ఖనిజాలు, పీచుపదార్దాలు సంపూర్ణంగా ఉన్నవి. అవి శరీరమునకు సహజముగా అందడం ద్వారా శరీరమును శుద్ది చేయడము మరియు చైతన్యవంతం చేసి తగిన శక్తి ఇవ్వడం జరుగుతుంది.
అధిక బరువు : ప్రకృతి సహజసిద్దమైన ఆహారంలో ఉండే కొవ్వు పదార్దాలు, నూనె పదార్దాలు శరీర సమత్వ బరువుకు సహకరిస్తాయి మరియు అందులో ఉండే పీచుపదార్దాలు శరీరమట్టంలో పేరుకుపోయిన కొవ్వు పదార్దాలు మరియు నీరును క్రమంగా కరిగించగలుగుతుంది.
తక్కువ బరువు : కొన్ని ప్రకృతి పదార్ధాలైన ఉదా – క్యారెట్‌ జూస్‌, అరిటిపండు, కర్జూరము, ఆపిల్‌, డ్రై ఫ్రూట్స్‌ మొదలగునవి. ప్రకృతి పదార్దాలలో ఉండే మాంస కృత్తులు సహజ ప్రోటీన్స్‌ బరువు పెరగడానికి తోడ్పడతాయి.
జీర్ణ వ్యవస్ధ : ఈనాటి మానవుడు కృత్రిమ ఆహారాలకు మాత్రమే అలవాటుపడి నిత్యము సుఖముగా జరగవలసిన విరోచనము జరగడం లేదు. దాని వలన క్రమేణా కడుపులో గ్యాస్‌, మంట, పుండ్లు, ఫైల్స్‌కు కారణమవుతున్నాడు. అలాంటి స్థితి నుంఛి జీర్ణవ్యవస్ధను కాపాడుతుంది. మరియు నిదానముగా జీర్ణమయ్యి పూర్తి శక్తిగా మారుతుంది. మరియు శ్లేష్మాలు మిగలకుండా పూర్తిగా విసర్జించబడుతుంది.
శ్వాసకోశం : శ్వాసకోశం మానసిక వత్తిళ్ళ వల్లగాని కొన్ని ఆహారపు పద్దతుల వల్లగాని సక్రమంగా జరుపుకోలేక పోతున్నాడు. అక్కడ ఎన్నో రకాల కఫములు, వాతపు నీరు నిలువులుగా పేరుకొని సంపూర్ణ సంకోచ, వ్యాకోచాలకు దూరమవుతున్నాడు. అమృతాహారము వీటిని శుదిధ చేసి స్వస్ధత చేకూర్చును.
మనస్సు : ప్రకృతి అందించిన ఆహారంలో కొన్ని మానసికమైన గ్రంధులను ఉత్తేజపరచగలదు. మరియు మానవ శరీరంలో జరిగే మెటబాలిజం మెదడుకే సుమారు 50 నుండి 60 శాతం అవసరమవుతుంది. అలాంటి మోటబాలిజమ్‌ను సవ్యంగా జరిపే గుణం ఈ ఆహారమునకు కలదు.
నాడీ వ్యవస్ధ : నాడీ వ్యవస్ధలో జరిగే ప్రాణవాయువు సంచలనమునకు ఈ ఆహారము ఎంతగానో సహకరిస్తంది.
చర్మము : రక్తములోని మలినాలను శుభ్రం చేసుకోవడం ద్వారా చర్మ కాంతివతంగా సృష్టించుకోగలము. మరియు అప్పటి వరకు ఏర్పడిన చర్మ రుగ్మతలకు కారణమైన మలినాలను బయటకు నెట్టిఏసి చర్మరుగ్మతల నుండి కాపాడును. చర్మము తన సహజ సౌందర్యమునకు చేరును.
రక్తం : మన శరీరాన్ని నిలబెట్టే ధాతువులలో ముఖ్యమైన స్ధానం రక్తానిది. మన బలం, కండపుష్టి, జీవనం చివరికి మన ఆయుష్యు వంటివన్నీ కూడా రక్తం మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే ‘రక్తం జీవస్య ఆధారం’ ఈ రక్తం లోపిస్తున్నపుడు ముఖ్యంగా పొట్లకాయ, గుమ్మడికాయ, పచ్చి అరటి, దొండ, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష, ఖర్జూరం, గోధుమలు, పెసలు, కందులు, రక్త వృద్ధికి తోడ్పడతాయి.
అమృతాహారం ఉపయోగాలు
ా    రక్షిత ఆహారం
ా    తక్కువ సమయంలో పూర్తిగా జీర్ణం అవుతుంది.
ా    ప్రేవులలోని శ్లేష్మాలను పూర్తిగా విసర్జిస్తుంది.
ా    అధిక బరువును (ఒబేసిటి) తగ్గిస్తుంది.
ా    రక్తాని శుద్ది చేస్తుంది.
ా    చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.
ా    మెదడును చురుకుగా ఉంచుతుంది.
ా    గాయాలను త్వరితంగా నయం చేస్తుంది.
ా    వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
ా    సుఖమైన నిద్రను అందించగలదు.
ా    శరీరాన్ని చైతన్యవంతంగా ఉంచుతుంది.
ా    అలసటను ఆమడదూరంలో ఉంచుటుంది.
ా    రక్తపోటు, మధుమేహ వ్యాధులను కంట్రోల్‌ చేయును.
ా    అల్సర్‌, ఎసిటిటీ నుంచి విముక్తి
ా    బూడిదగుమ్మడికాయ రసం విద్యార్ధులలో జ్ఞాపకశక్తిని అమితంగా పెంచును.
ా    సంకల్పబలం ద్విగిణీకృతం అగును.
ా    మీ శరీరం ప్రకృతికి అనుకూలంగా ప్రతి స్పందించి ఎనలేని శక్తిని చేకూరుస్తుంది.    
> ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.
Advertisements

Read Full Post »

Yoga Meaning with Description, What is Yoga in Telugu.
యోగ దర్శనం

    ‘యోగ’ మన మానసిక, శారీరక సమస్యలకు చక్కని సమాధానం మనిషి యొక్క ఆహారము, ఆలోచన, ప్రవర్తన, దృష్టి, కర్మ జీవనశైలని ప్రభావితం చేసే గొప్ప సాధన – ‘యోగసాధన’ అందుకే మన పెద్దలు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు. ఈ రోజుల్లో అందరికీ మహాభాగ్యం అంటే ధనం, బంగారం, కార్లు, బంగ్లాఉ, కలిగి ఉండడమని భావిస్తారు. కాని వీటంన్నింటికంటే ముఖ్యమైన భాగ్యం. ‘ఆరోగ్యమే మహాభాగ్యము’ మనిషి సాంకేతికంగా ఎంత అభివృద్ధి సాధిస్తున్నా, తన సొంత సోత్తు అయిన ఆరోగ్యాన్ని తను కాపాడుకోలేక పోతున్నాడు. మనిషి మనుగడలో ముఖ్యంగా మానసికమైన అలజడులకు, ఆలోచనలకు మహఃభావాలకు, అధికారాలకు అధికముగా లోబడుతున్నాడు. ఈ ఘర్షణే మానసికమైన శక్తిని కోల్పోతూ ప్రపంచంలో నిరుత్సాహంగా, నిర్జీవమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఈ ఫలితంగానే శారీరకంగా ఎన్నో రుగ్మతులకు ఆహ్వానం పలుకుతున్నాడు.
    ఇటువంటి అనారోగ్యాలను ఎదుర్కొవాలంఠే మనిషి మనస్సులో మనోశక్తి, శరీరములో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకు చక్కని మార్గము మన పూర్వికులు మానవ శరీర నిర్మాణాన్ని పరిశీలించి, పరిశోధించి ఆరోగ్యానికి ఎన్నో చక్కని మార్గాలను, యోగ సాధనను, సృష్టించి అందించగలిగారు. యోగాకు పుట్టినిల్లు భారతదేశమైతే, ప్రస్తుతం ప్రాశ్చాత్తపు దేశాల్లో అద్భుతంగా ప్రచారంలో ఉంది. కానీ, ఇప్పుడిప్పుడే మన దేశంలో ఉధృతమైన ఆరాధన మొదలైనది. అందరూ ప్రకృతి పరమైన ఆహారానికి, యోగ సాధనకు పిల్లల నుండి పెద్దల వరకూ మక్కువ చూపుతున్నారు.
    ‘యోగ’ అనే పదం ‘యుజ్‌’ అనే సంస్కృత ధాతువు నుండి పుట్టింది. ‘యుజ్‌’ అంటే చేర్చ, కలుపు అని అర్ధం. శారీరక మానసిక ఆత్మ శక్తులను భగవంతునితో అనుసంధానం చేయడమే యోగం. బహు విధములైన జీవితాన్ని సముదృష్టితో చూసే మానసిక ధైర్యం అలవర్చుకోవడమే యోగ సాధన. భారతీయ తత్వజ్ఞాన ప్రకారము షడ్‌ దర్మనాలలో యోగ దర్శనం ఒకటి. భారతీయ భావనతో పరమాత్మ అంథటా వ్యాపించుంది. దానిలో జీవాత్మ ఒక అంశం’ జీవాత్మను, పరమాత్మతో అనుసంధానము చేసే మోక్షసాధనకు యోగాభ్యాసము మార్గం చూపుతుంది. ఈ యోగ మార్గాన్ని అనుసరించేవాడు యోగి లేదా యోగిని.
    భగవద్గీత యందు 6వ అధ్యాయంలో బాధ నుంచి, దుఖ నుంచి విముక్తి పొందడమే యోగం అని శ్రీకృష్ణుడు అర్జునుడకు ఉపదేశించాడు. సానపట్టిన వజ్రము పలు వర్ణాలలో ప్రకాశిస్తున్నట్లు యోగ అనే శబ్దానికి పలు అర్దాలు కలవు. ఇటువంటి యోగిన్ని సుమారు 500 సం|| నకు పూర్వమే మన సంస్కృతిలో భాగమైనది. యోగ ఈనాడు మానవ మానసిక, శారీర అసమతుల్యతల ద్వారా పొందుతున్న రోగాలకు చక్కని మార్గలను మన యోగులు, ఋషులు తపోశక్తితో సుమారు 2700 సంవత్సరముల పూర్వము కపిల మహర్షి తన శాంక్య దర్శనములో వివరించినారు. మానవ జీవితపు దుఖః హేతువులు మూడు 1) ఆత్మికము 2) భౌతికము 3) దైవికము
1) ఆత్మికము : మనము చేతులారా కొని తెచ్చుకున్న మన సమస్యలు, నమ్మకాలు, ఊహలు, ఆలోచనలు, కోరికలు ఈర్ష్య అసూయలు, రాగ, ద్వేషాలు, ఇష్టా – అయిష్టాలు, కవలోకొస్తాయి.
2) భౌతికము : ఆర్ధిక పరిస్దితులు, కలహాలు, విబేదాలు, సామర్య లోపాలు మొదలగు (భౌతికమైనది, సామాజికమైనది.
3) దైవికము : ప్రకృతి వైపరిత్యాలు, చావులు, ప్రమాదాలు, లాంటివి మనసుకు బాధ కలిగిస్తాయి. ఇవి దైవికమైనవి.
    ఇవి మానసిక దుఖాఃలకు పరిష్కారం చెప్పాడు. కపిల మహర్షి సుమారు 2400 సంవత్సరాలకు పూర్వము, అంటే కపిలుడికి 300 సంవత్సరముల అనంథరము, పతంజరి మహర్షి యోగ సూత్రాలు రాశాడు. కపిలుడు చెప్పినట్లు మనసుకే కాక శరీరాన్ని తేజోవంతముగా చేసుకోవడం ఎలాగో పతంజరి వివరించాడు. పతంజలి ‘యోగ సూత్రములు’ అనే శాస్త్రీయ గ్రంధములో 185 సూత్రాలలో పతంజలి యోగ విద్య వివరించినారు.
    మనసుని, శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకునే మార్గంలో ఎనిమిది మెట్లుగా యోగ విద్యను పతంజలి మహర్షి వివరించి చెప్పినారు. దీనినే ‘పతంజలి అష్టాంగ యోగం’ అంటారు. దీనినే యోగాభ్యాసంలోని ఎనిమిది థలు అంటారు. లక్ష్య శుద్ది ఎంత ముఖ్యమైనదో, సాధన శుద్ది కూడా అంత ముఖ్యమైనది. ఆత్మ దర్శనానికి పతంజలి అందించిన 8 అంగములు సాధనా విధానములుగా ఉపయోగపడతాయి. అవి
1)    యమము (సార్వజనీన నీతి సూత్రాలు)
2)    నియయము (క్రమ శిక్షణతో కూడిన ఆత్మశుద్ధి)
3)    ఆసనము (భంగిమ)
4)    ప్రాణాయామము (ఉచ్చాస నిశ్వాసముల లయబద్ధ నియంత్రణ)
5)     ప్రత్యాహరము (ఇంద్రియాలను అంతర్ముఖం చేయడం)
6)     ధారణ (విషయముల నుంచి మనస్సును మరలించి నిలుపుట)
7)     ధ్యానము ఏకాగ్ర మనస్సుతో చింతించుట)
8)     సమాధి (ధ్యానముతో సిద్ధించిన అతీంద్రియ శక్తితో బాహ్యా అంతర్ముఖ ప్రపంచంతో సంబంధం లేని పరమాత్మ శక్తిని అనుభూతి పొందేది.)
1) యమము : సాధకునిలో ఉద్రేక, ఉద్వేగాలను నియంత్రిచే యమము అయిదు (5) రకములుగా విభజింపబడింది. దీనినే సమాజికమైన క్రమశిక్షణ అని చెప్పవచ్చు.
ఎ) అహింస : నీవు మనసుతో, మాటలతో, ఖర్మలతో కానీ ఎవరినీ మానసికంగా శారీరకముగా హాని కలిగించకుండా ఉండడమే అహింసా పద్దతిలోని ముఖ్యాంశము.
బి) సత్యము : మనసా, వాచా, కర్మణా సత్యానికి కట్టుబడి ఉండడం.
సి) అస్థేయం : ఇతరుల అనుమతి లేకుండా వారికి సంబంధించిన వస్తువులను తీసుకోకుండా ఉండడం అంటే దొంగతనం చేయకుండుట.
డి) బ్రహ్మచర్యం : దాంపత్య జీవితమును కొనసాగిస్తూ, బ్రహ్మచర్యాన్ని కొనసాగించడం. బ్రహ్మచారిగా ఉంటూ నైష్టి బ్రహ్మచర్యాన్ని కొనసాగించడం. అంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటడమని అర్ధం.
ఇ) అపరిగ్రహము : ఇతరుల నుంచి ఏమి ఆశించకుండా ఉన్న దానితో తృప్తి పడడం. అనగా సరిపడా పొందుతూ, ఎక్కువగా కూడబెట్టకుండా ఉండటం.
2) నియమము : ప్రక్కవారితో సామరస్యంగా, అంటే పరిష్కారయుతంగా జీవించడానికి తోడ్పడే నియయము 5 విధాలుగా విభజింపబడింది. దీనినే వ్యక్తిగతమైన క్రమశిక్షణ అని చెప్పవచ్చును.
ఎ) శౌచము : శారీరక, మానసిక పరిశుభ్రతను పాటించడము బాహ్య, అంతర్‌ శుద్ధి కలిగి ఉండటం.
బి) సంతోషము : నిజ జీవితములో చేయవలసిన కర్మలను సక్రమంగా నిర్వర్తిస్తూ సంతోషముగా ఉంటము చేసే కర్మల ఫలితములకు విచారము పొందక తృప్తిగా ఉండటటమే సంతోషం.
సి) తపస్సు : మనసును మానవ అవమానముల యందు, శీతోష్ఠ సుఖ దుఃఖముల యందు, మనసును భవబాంధాల నుండి దూరముగా ఉంచి ఒకే రీతిగా సమభావం కలిగి ఉండడము.
డి) స్వాధ్యాయము : ‘ఆత్మవిచారము’ కలిగి ఉండడం అనగా తనను తాను తెలుసకోవడమే మరియు సత్‌ గ్రంధములను పఠనము చేయడం, సత్పురుషుల సాంగత్యం చేయఢం కూడా స్వాధ్యాయ మనిపించుకుంటుంది.
ఇ) ఈశ్వర ప్రణిదానము : ప్రతి పనిని ఫలాపేక్ష లేకుండా సృష్టికర్తను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ భగవంతునికి పూర్తిగా మనల్ని మనము అర్పించుకోవడం.
3) ఆసనము : ఆసనమంటే స్ధిరంగా, సుఖముగా ఒక భంగిమలో కూర్చోపెట్టేది. ఏదో ఒక భంగిమలో శరీరాన్ని కొద్దిసేపు నిశ్చలముగా ఉంచడం ద్వారా శరీర భాగములకు కావలసిన శక్తి, పని చేసే క్రమ ప్దదతి పొందుతుంది. ఆశనాలు చాలా రకాలున్నాయి. ఇవి ఇన్ని అని నిర్ణయించలేము. సృష్టిలో ప్రాణులెన్నున్నాయో అని ఆసనాలున్నాయి అని చెప్పబడుతుంది. మొత్తం 84 లక్షల ఆసనాలున్నాయంటారు. పకక్షులు, జంథువులు, క్రీములు, కీటకములను అనుసరించి ఆసనాల పేర్లు పెట్టినట్లు గమనించగలరు.
4) ప్రాణాయామము : శ్వాసను ఒక క్రమ పద్దతిలో తీసుకుంటూ వదులుతూ సమత్వరపరిచే ప్రకియ ప్రాణాయమము. ఈ పద్దతిని పాటించడం వల్ల శ్వాసక్రియ వృద్ధి చెంది చెడు వాయువు బయటకు వెళ్ళి రక్త శుద్ది జరుగుతుంది. ప్రాణాయామ క్రియవల్ల శ్వాస ఉచ్ఛ్వాసల వేగము పూర్తిగా తగ్గి ఇంచుమించుగా నిలుస్తుంది. చిత్త వృత్తులు నిరోధించబడుతాయి.
5) ప్రత్యాహారము : జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వాటి వాటి విషయాలనే సదా అనుసరిస్తాయి. చెవి శబ్దాన్ని, కన్ను దృశ్యాన్ని, ముక్కు వాసనను కోరుకుంటాయి. ఇలా ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచడమే ప్రత్యాహారమనబడుతుంది.
6)  ధారణ : మనసును కేంద్రీకరించగలడం. ఒకే ఒక చోట చిత్తాన్ని నిలపడము. ఫలితముగా మనము దేన్ని అయినా సాధించగలం అన్న నమ్మకం ఏర్పడుతుంది. మనసుతో ధరించేదే దారణ.
7) ధ్యానం : ధ్యానం ఒక రకంగా చెప్పాలంటే తదేకమైన ధారణను ధ్యానము అని చెప్పవచ్చు. మనస్సులో ధరించిన దానిపైనే ధ్యాస కలిగి ఉండటమే ధ్యానము. మానసిక ప్రశాంతతో పాటు శరీరానికి బలాన్నిచ్చే ధ్యానం అన్ని విధాలయిన అనారోగ్యాలను దూరంగా ఉంచుతుంది.
8) సమాధి : ఇది అష్టాంగ యోగములలో అత్యంత ప్రధానమైనది. దీన్ని అనువు పూర్వకముగా తెలుసుకోగలము. బాహ్య ప్రపంచంపైన కానీ, అంతర్ముఖ స్ధితులపైన కానీ, సంబంధం లేకుండా సమత్వమైన మనసు ఏర్పర్చుకోగలిగే ప్రక్రియనే సమాధి సాధన అంటారు.
    ఇవి అన్ని ఒక దానిపై ఇంకొకటి ఆధారపడి ఉన్నది. అష్టాంగములో మొదటి అంగాలు యమ, నియమ, ఆసాన, ప్రాణాయమాలు, ప్రత్యహారం బాహ్యయోగమని, ప్రత్యాహం, ధారణ, ధ్యానం చివరి 3 అంగాలు అంతర యోగ అని అంటారు. 
> ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

Read Full Post »

Yoga Asanas in Telugu, Yoga Asanas with Details (Shavasan, Vakrasan)

ఆసనములు
    ఆసనము అంటే శరీరములో ఏ భాగము కదలకుండా శరీరములో ఏ భాగంలోనూ నొప్పి లేకుండా కూర్చేనే స్థితి. కపిల మహర్షి తన సాంఖ్య దర్శన గ్రంధంలోనూ, పంజలి యోగసూత్రాలలోనూ ‘సిథర సుఖమ్‌ ఆసనమ్‌’ అని నిర్వచించారు. ఈ ఆసనాలు శరీర స్ధితి స్థాపక శక్తిని, పటిష్టతను, పటుత్వాన్ని పెంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ కనుక క్రమబద్ధంగా యమ, నియమాలు పాటిస్తూ ఆసనాలు అభ్యాసం చేస్తే చక్కని ఆరోగ్యము పొందవచ్చు. ఆసనాలు ఆరోగ్యాన్ని అన్ని విధాలా కాపాడుతాయి. ఆటుపోట్లకు తట్టుకునే శక్తిని శరీరానికి కలుగజేస్తాయి.
    ఆసనాలు యోగసాధనకే పరిమితమని పతంజలి అభిప్రాయం. ఇప్పటి అవసరాన్ని బట్టి ఆసనాలు ఆరోగ్యానికీ అత్యంత అవసరమే. అయితే ఆసనాలు కండర బలానికి తోడ్పడవు. ఆసనాలు రక్త ప్రసరణను సాఫీగా చేసి మాలిన్యాలను నివారించి శరీరాన్ని కాంతివంతంగా చేస్తాయి. నాడీ మండల చన ప్రగతికి, కార్యతీవ్రతకు దోహదపడతాయి. వివిధ అంతఃగ్రంథులను, అవయవాలను ఉత్తేజరపచి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించేవి. ఆసనాలు.
    యోగాసనాలకు వెన్నుపాము, మెడ, తల నిటారుగా ఉంచాలి. దాని వలన వెన్ను పాములోని నాడీ మండలంకు ఎట్టి ఒత్తిడి పడకుండా పూర్ణ స్వేచ్ఛ కలిగి యుంటుంది. బూమికి లంబముగా వెన్ను పామును నిలిపినందున నాడీ శక్తి, నాడీ శుద్ధి కలుగుతాయి. ఆసనం యొక్క ముఖ్యోద్ధేశం మనస్సును స్వాధీనంలోనికి తీసుకొని రావడం, కొన్ని ప్రత్యేక రుగ్మతలకు కొన్ని ప్రత్యేక ఆసనాలు గురువుగారి సలహాలు, సూచనలు పాటిస్తూ చేయాలి.
    ఆసనాలవల్ల అంతః గ్రంథులన్నీ తేజస్సుగా పనిచేస్తాయి. ఆరోగ్యం చెక్కు చెదరదు. హృదయము, ఊపిరితిత్తులు, కాలేయము, మూత్రపిండములు, జీర్ణమండలం, జీర్ణక్రియ, చిన్నప్రేగు, – మొదలైన అన్ని భాగాలు ఆరోగ్యంతో అలరారుతూ తమ విధులను సక్రమంగా, సమర్ధవంతంగా నిర్వహిస్తూ వుంటాయి. ఫలితంగా వ్యాధులు దరిచేరవు. దరిచేరిన వ్యాధులు క్రమేణా అదృష్యమౌతాయి. ఆహార విహారాలలో నియంత్రణ క్రమం తప్పని అభ్యాసం అంథులేని ఆనందానికి, ఆరోగ్యానికి కారణబూతమన్నది మరచిపోకూడదు.
ఆసనాలు వేసేముందు తీసుకోవలసిన జాగ్రత్తలు :
ఆసనాలు వేసే ప్రదేశంగాని, గదిగాని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గాలి వెలుతురు ధారాళముగా వచ్చేటట్లు చూసుకోవాలి. పరిశుభ్రమైన గాలి ఊపిరిత్తులకు చాల మంచిది. కాబటిట& సువాసనలు వచ్చే విధంఘా ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. తరువాత నేలపై చాపను పరచి, దానిపై మెత్తటి శుభ్రమైన రగ్గుగాని, దుప్పటిగాని వేసి దానిపై తెల్లని వస్త్రాన్ని పరచాలి. మరీ ఎత్తుగానీ, మరీ పల్చగా గాని ఉండరాదు.
    ఉదయం 4 గం. కాలంలో లేచి, కాలకృత్యాలు ముగించాలి. మలబద్ధకమే అన్ని రోగాలకూ ఆదికరాణం కాబటిట& ఆవిషయంలో అశ్రద్ధ అస్సలు చూపకూడదు.
    ఖాళీపోట్టతో ఆసనాలు వేయాలి. నిశ్శబద్ధాన్ని విధిగా పాటించాలి. ఎంతవరకు వంగాను?
ఇంతేనా? ఇంక చాలునా?… అంటూ ప్రశ్నలతోనూ, అనుమానాలతోనూ ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. ‘నిశ్శబ్ధం’ మనస్సుకు జ్ఞానదీప్తిని కలిగిస్తుంది. వివిధ అవయవాలపై దృష్టిని కేంద్రీకరించే వీలు కల్పిస్తుంది. నిదానం ప్రధానము. చాలా నెమ్మదిగా, సూచనానుసారం ఆసనాలు వేయాలి. మొదట్లో సెకన్లతోను, నిముషాలతోనూ సరిపెట్టి కాలక్రమేణా సమయం పెంచుకోవచ్చు. ఎక్కువ సమయం వేస్తే ఎక్కువ ఫలితం వస్తుందనుకోరాదు.
    మనస్సును దివ్యబావాలతో నింపి, అంతరంగిక మౌనం పాటిస్తూ ఆసనాలు వేయడం వల్ల ఆశించిన ఫలితం తప్పక సిద్ధిస్తుంది. సాయంత్రం ఆసనాలు వేసేవారు మూడు, నాలుగు గంటల క్రితం వరకు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఏఉండాలి. వేయబోయే సమయానికి పొట్ట ఖాళీగా ఉంచాలి. ఒక గ్లాసుగాని, అరగ్లాసుగాని మంచి నీరు తాగి ఉపక్రమించాలి.
    తరువాత అత్యంత ముఖ్యమైనది : ఆసనాల సమయంలో శ్వాసక్రియ జరిపే విధానం, అసంబద్ధంగా, నియమరహితంఘా శ్వాసిస్తూ ఆశనాలు వేస్తే ఫలితం రాకపోగా ప్రమాదం ముంచుకొస్తుంది. ముందుకు వంగి వేసే ఆసనాలకు మొదట పూర్తిగా గాలి పీల్చుకుని నెమ్మదిగా వదులతూ, పొట్ట వెనుక్కులాగుతూ నిదానంగా వంగాలి అదే వెనక్కు వంగే సమయంలో పూర్తిగా శ్వాస వదిలేసి నిదానంగా పీల్చుతూ వంగాలి ఈ శ్వాస టెక్నిక్‌ చిక్కిందంటే ఆసనాల్లో మీరు అద్భుతమైన ప్రతిభను కనబరచగలరన్నమాటే. 
ఆసనాలకు సిద్దం చేయండం
ా    మనం అష్టాంగయోగ తరగుల విధంగా యమ, నియమ ఆసన, ధ్యాన ధారణ అని చెప్పుకున్నాము కదా.
ా    అందులో మూడవది అయిన ఆసన విధాన్ని తెలుసుకునేదే క్లాస్‌.
ా    ఆసనాలు 80,000/- ఉన్నాయి
ా    ఇన్ని రకాల ఆసనాలు ఒక యోగ మాస్టర్‌ కి మరియు యోగ సాధనలో నిమగ్నమయ్యె వారికి అవసరం.
ా    నిత్యం ఉద్యోగాలు, వ్యాపారాలో జీవిస్తున్న మనకు అన్ని రకాల ఆసనాల సాధన చెయ్యడానికి ఎంఓ సమయం పడుతుంది.
ా    అయినా దైనందిన జీవితంలో శారీరక మానసిక జీవితానికి సరిపడ ఆసనాలు ఇక్కడ నేర్చుకోబోఉన్నాము
ా    ఆసనాలు అంటే చాలా మంది భయపడతారు.
ా    కాని ఇక్కడ చాలా సులభంఘా నేర్చుకుంటారు.
ా    మరియు మీ శరీరం కూడ ఆసనాలు వేయడాన్కి అనుకూలంగానే ఉన్నది.
ా    ఆసనాలకు కార్పెట్లు, దుప్పట్ల మందం 6 మీ.మీ. ఉండాలి. పరుపుల మీద చేయరాదు.
ా    తల నుండి క్రింది వరకు ఒకే ఎత్లుఓ ఉండాలి. (ఎత్తుపల్లాలు ఉండకూడదు)
ా    దుప్పట్ల మధ్యలో ముడతలు ఉండరాదు.
ా    ఆసనానికి ఆసనానికి మధ్య ఇస్త్రి చేస్తున్నట్లుగా చెయ్యాలి.
ా    శరీరంపై దుస్తులు వదులుగా శరీరాన్ని వంచడానికి వీలుగా అనుకూలంగా ఉండాలి. బెల్డ్‌ ఉంచరాదు, జీన్స్‌ ప్యాంట్‌ మందం బట్టలు వేయవద్దు.
ా    కళ్ళజోడు ఉండరాదు, అండర్‌ గార్‌మెంట్స్‌ సరియిన ఫిట్‌నెస్‌తో ఉండాలి, తప్పని సరిగా ఉపయోగించాలి.
ా    ఖాళీ కడుపుతో ఆసనాలు చేయ్యాలి, ఎప్పుడు చేసినా సరె. 
ా    శరీరంపై గోల్డ్‌ ఆర్నమెంట్స్‌, గాజులు, ఉంగరాలు, ఇబ్బంది కలిగించే వస్తువులు ఉండరాదు.
ా    ప్రతి ఆసనాన్ని నిధానంఘా వెయ్యాలి నిదానంగా బయటకు రావాలి.
ా    మొదటగా నేర్చుకుంటున్న మీకు మేము చూపిన విధంఘా చేయాలని గాని బలవంతంగా చేయరాదు.
ా    ఆసనాలు వేసేటప్పుడు శ్వాసకు సంబంధం లేదు.
ా    ఆసనంలోకి ఎళా వెళ్ళామో అలాగే వెనక్కి రావాలి.

ా    ఆసనాలు వేసేటప్పుడు పళ్ళు బిగించడం, మోహాన్ని బిగించడం చేయకూడదు.

యోగాసనాలు


1) శవాసనం :

ఎడమవైపు నుండివెల్లకలా పడుకోవాలి
రెండు అరచేతులను ఆకాశం వైపు చూస్తున్నట్లుగా శరీరం ప్రక్కన ఉంచాలి.
రెండు పాదాల మధ్య అర అడుగు దూరం ఉండాలి. తలను ఆకాశం వైపు చూస్తున్నట్లుగా ఉంచి కండ్లు మూసుకొని ఉండాలి.
శరీరాన్ని పూర్తి విశ్రాంతిగా వదలివేయాలి.
ఎడమవైపు తిరిగి చేతుల సపోర్టుగా నిదానంగా బయటకు రావాలి.
2) శరీర మర్ధన :
చేసిన ప్రతి సారి నిదానంఘా ప్రక్కప్రక్కన నొక్కుతూ గుండె దగ్గరకు చేర్చాలి.
ఎడమ కాలు, కుడి కాలు
ఎడమ చేయి, కటి చేయి
పొత్తి కడుపు, లోయర్‌ స్టమక్‌
లోయర్‌ బ్యాక్‌, అప్పర్‌ బ్యాక్‌
ఫేస్‌ మసాజ్‌, గడ్డం తో మొదలు
3) శవాసనం
4) రాకింగ్‌, రోలింగ్‌, సైకిలింగ్‌
ఎ) రాకింగ్‌ – శవాసనంలో ఉండి కాళ్ళను మడిచి తొడల భాగాన్ని, ఛాతి పైకి తీసుకురావాల. రెండు చేఉలతో బంధించాలి. శరీరాన్ని ముందుకు వెనుకు నిదానంగా 5 సార్లు మ్యూవ్‌ చేయ్యాలి.
బి) రోలింగ్‌ :
పై విధంగా లాక్‌ చేసి శరీరాన్ని ఎడమ వైపుకు పూర్తిగా వాల్చాలి. మరలా కుడి వైపు కూర్చోవలి. ఇలా రెండు వైపులా 6 సార్లు చేయ్యాలి.
సి) సైక్లింగ్‌ :
శవాసనంలోనే రెండు కాళ్ళను జతగా పైకి లేపాలి. రెండు అర చేతులను మోచిప్పలపై ఆనించి సైకిలింగ్‌ చేయాలి.
ఉపయోగాలు : 1) వెన్నుముకను చైతన్య పరచును
2) జీర్ణవ్యవస్ధను సరి చేయును.
5) శవాసనం
6) ఎ) అర్ధ పశ్చిమోత్తాసనం :
సుఖానంలో కూర్చొని ఎడమ కాలు చాచి కుడి కాలు మడిచ పాదాన్ని ఎడమ తొడకు ఆనించాలి.
రెండు చేతులను శరీరం ప్రక్క నుండి నిదానంగా పైకి తీసుకురావాలి.
మెల్లగా శరీరాన్ని ముందుకు వంచుత రెండు చేతులతో పాదాన్ని పట్టుకొని తల నుదిటి భాగాన్ని మోకాలుపై ఆనించాలి, మోకాలు పైకి లేవకుండా ఆనించాలి.
బి) అలానే కుడికాలు చాచి, ఎడమ కాలు మడిచి చెయ్యాలి.
సి) పూర్ణ పశ్చిమోత్తాసనం
అలాగే రెండు కాళ్ళు జతగా చాచి, ఉంచి చెయ్యాలి.
ఉపయోగాలు :
1) పిరుదుల భాగంలోని నరాలను వదులుగా ఉంచును.
2) తొడలు, పొట్ట భాగంలోని క్రొవ్వును తగ్గించును.
3) డయాబెటీస్‌ తగ్గించును.
4) వెన్నుకు రక్త ప్రసరణ కలిగించును.
7) శవాసనం :
8) సర్వాంగసనం :

శవాసనంలో ఉండి అరచేతులతో పిరుదులు పట్టుకొని ఒక్క సారిగా, నిదానంగా నడుము వరకు కాళ్ళను పైకి లేపాలి.
ఎ) వైడెనింగ్‌ లెగ్స్‌
బి) వాకింగ్‌ లెగ్స్‌
సి) సిసర్స్‌
డి) సైక్లింగ్‌, రివర్స్‌ సైక్లింగ్‌
ఇ) పద్మాసనం
ఎఫ్‌) నడుము వద్ద ట్విస్టింగ్‌
నిదానంగా కాళ్ళను మడచాలి. రెండు చేతులతో శరీరాన్ని క్రిందకు నిదానంగా వదలాలి.
ఉపయోగాలు :
1) జీర్ణ వ్యవస్ధ శుద్ధి అగును.
2) నాడి వ్యవస్ధ సమత్వ స్థితికి వచ్చును.
3) రక్తం మొదడుకు సక్రమంఘా అందించబడును.
4) ఆస్దమా, బ్రొంకైటీస్‌ నుండి ఉపశమనం కలిగించును.
5) పొట్ట భాగంలో క్రొవ్వు కరిగించును.
9. శవాసనం
10. హలాసనం

సర్వాంగసనంలో పూర్తిగా కాళ్ళు పైకి ఎత్తిన తరువా నిదానంగా కాళ్ళను ఛాతి మీదుగా వంచుతూ తల దగ్గర భూమి పైకి ఆనిస్తూ బ్రొటన్‌ వ్రేళును భూమిపై తాకించాలి. చేతులను నడుముకు ముందు భాగములో భూమిఐ బోర్లించి ఉంచాలి.
ఉపయోగాలు :
1) మూత్రపిండాలు, కాలేయం, పాంక్రియాస్‌ను, మల బద్దకం తగ్గించును
3)పైల్స్‌కు ఉపశమనం కలిగించును
11) మకరాసనం :
బోర్లాపడుకొని తలను ఎడమ వైపుకు త్రిప్పి ఎడమ కాలు మడచి ఎడమ చేఇని ముఖమునకు ముందు భూమిపై బోర్లించాలి. కుడిచేతిని తలపై భాగంలో భూమిపైన బోర్ల పెట్ట ఉంచాలి.
12) భుజంగాసనం :
పూర్తి బోర్లా పడుకొని అరచేతులను భుజాల క్రింద, ఛాతి ప్రక్క భూమిపై ఆనించాలి. నిదానంగా బొడ్డు వరకు పాము పడగలాగా సాధ్యమైనంత పైకి ఎత్తాలి.
    ఆ తరువాత చూపు ఆకాశం వైపు చూస్తున్నట్లుగా ఉండవలెను. పాదాలు ఆకాశంవైపు చూస్తుంటాయి.
ఉపయోగాలు :
1) లైంగిక సమస్యలు ఉండవు. 
2) మలబద్దకం తగ్గించును
3) డిస్క్‌ తప్పిఉంటే దానిని యధాస్ధానము లోకి తెచ్చును.
4) తిమ్మురులు తగ్గించును.
13) మకరాసనం :
14) శలభాసనం :

ఎ) అర్ధశలభాసనం (ఎడమ) : పూర్తి బోర్లా పడుకొని రెండు చేతులను ఆది ముద్రలు చేసి తొడలు క్రింద ఆనించి ఉంచాలి.
తలను ఎడమవైపు తిప్పి ఎడమకాలు మాత్రమే మోకాలు వంగకుండా సాధ్యమైనంత పైక లేపాలి.
బి) కుడివైపు
సి) పూర్ణ శలభాసనం : పూర్తి నేలపై బోర్లాపడుకొని గడ్డం నేలకు ఆనించి రెండు కాళ్ళను జతగా పైకి లేపాలి.
ఉపయోగాలు :
1) గుండె జబ్బులు వాళ్ళకు చాలా మంచింఇ.
2) సయాటికా ప్రాబ్లం పోతుంది. 
15) మకరాసనం : ఎడమవైపు
16) వక్రాసనం :
సుఖాసనంలో కూర్చొని ఎడమ కాలు మడచి పాదాన్ని కుడి తొడ కింద ఉంచండి.
కుడి పాదాన్ని ఎడమ కాలు బయట ఉంచాలి.
ఎడమ చేతిని ఛాతి మీదుగా తీసుకువచ్చి కుడి పాదాన్ని పట్టుకోవాలి.
కుడి చేతిని వీపుపైన ఆనించాలి.
తలను కుడి వైపుకు పూర్తిగ వెనుకకు త్రిప్పాలి.
బి) అలానే కుడికాలు మడచి చేయ్యాలి.
ఉపయోగాలు :
1) నడుము కండరాలను చైతన్యం చేస్తుంది.
2) నాడి వ్యవస్ధలోని 72000 ప్రాణ నాడులను ఉత్తేజం చేస్తుంది.
3) ఎడ్రినల్‌ గ్రంధులు సక్రమంగా పని చేయునట్లు చేయును.
17) మహముద్ర లేదా యో ముద్ర 
పద్మాసనంలో గాని అర్ధపద్మాసనములోగాన లేదా సుఖాసనంలో గాని కూర్చుని చేతులు వెనుక పట్టుకొని ఉంచాలి. తలను నిధానంగా వెన్నుముఖను ముందుకు వంచుతూ తలనుదిటి భాగాన్ని నేలపై ఆనించాలి. (గర్భిణి స్త్రీలు చేయరాదు).
ఉపయోగాలు : 1) పొట్టలోని కండరాలను ఉత్తేజ పరచును. 2) ఛాతి పెరుగుదలకు ప్రోత్సహించును.
18) పాదహస్తాసనం :
నిల్చుని రెండు చేతులను నిదానంగా శరీరం ప్రక్క భాగం నుంచి పైకి లేపాలి చేతులను కలిపి కలి ముని వేళ్ళపైన స్ట్రెచ్‌ చేయ్యాలి. మెల్లగా చేతులతో సహా శరీరాన్ని ముందుకు వంచూ చేతులతో పాదాలను పట్టుకోవాలి. తల నుదిటి భాగాన్ని మోచిప్పలపై ఆనించాలి.
ఉపయోగాలు : శరీరంలో వ్యాధి నిరోక శక్తి పెంచి మలినాలను శుద్ధి చేయును.
19) భ్రమరి : శవాసనంళో ఉండి పూర్తిఆ శ్వాసను పీల్చుకొని ”ఉమ్‌” అనే శబ్దం చేస్త శ్వాసను బయటకు వదలాలి.
ఉపయోగాలు : శరీరాన్ని మనసుకు పూర్తి విశ్రాంతిని ప్రశాంతను ఇచ్చును
20) శవాసనం
21) భ్రమరి :

శవాసనంలో పడుకొని పూర్తిగా నోరు మూసుకొని ముక్కు ద్వారా గాలిని వదులుతూ శబ్దం చేయాలి.
ఉపయోగములు : గొంతుకు సంబంధించిన లోపాలు నివారింపబడును. స్వరమాధ్యం పెరుగుతుంది.
20) శవాసనం
22). ధనురాసనం :

ముఖం భూమిపై ఆనించి ఛాతి పై పరుండవలెను. చేతులు ప్రక్కలనుంచవలెను. నెమ్మదిగ్కాఆళ్ళు వెనుకకు మడవవలెను. చేతులను వెనుకవైపున లేపవలెను. చేతులతో చీలమండలం పట్టుకొనవలెను. తల ఛాతిపైకెత్తవలెను. శరీరమంతా పొత్తికడుపుపై మోపవలెను. ఇలా 5 నుండి 6 సార్లు చేయవలెను.
ఉపయోగములు : ప్రేగులలో వాయు సంబంధమైన రుగ్మతులు తొలగిపోవును. సోమరితనం ఉండదు. అభ్యాసకులు శక్తి పూరితంగా, ఉత్సాహంగా పునరుజ్జీవనం పొందెదరు. 

> ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

Read Full Post »

Yoga Surya Namaskar Mantras in Telugu with Practicing Brief Details.
సూర్య నమస్కారాలు

    మొదట  సూర్య భగవాడునికి ధన్యవాదములు తెలుపుతున్నాను. ఇక్కడ సూర్యడ్ని భగవంతుడు అని సంబోధిస్తన్నాను. ఎందుకంటే సృష్టికే వెలుగును, వేడిని ఇచ్చేవాడు. ఈ సృష్టిలో సూర్యుడే లేకపోతే భూమిపైన జీవరాసులకు మనుగడే లేదు. సకల జీవరాశికి అన్నదాత ఆ సూర్య భగవానుడు భగవంతుడు లేడు అనే వారు సైతం కాదనలేని ప్రత్యక్ష దైవం నారాయణు సూర్యభగవానుడు. అలాంటి సూర్యభగవానున ఆరాధించడం అనేది మన దేశంలో పూర్వ కాలము నుండి వస్తున్న సాంప్రదాయం. ప్రాతః కాలవేళ కాకృత్యాలు తీర్చుకొని సాధ్యమైఏ స్నాం ఆచరించ వీలైనంత వరకు తెల్లని వస్త్రములు ధరించి గాలి వెలుతురు చక్కగా ప్రచురింఉ ఆరు భయట ప్రదేశములో సూర్యనమస్కారములు ఆచరించుట శ్రేష్ఠం. సూర్యుని యొక్క మూడు థలు సృష్టి, స్థితి, లయలను సూచిస్తు వుంటాయి. సూర్యోయము సృష్టిని మధ్యాహ్నం స్థితిని సూర్య అస్తమయం లయమవటాన్ని పోలి వుంటాయి. ప్రతి రోజు ఉదయిస్త, ప్రకాశిస్తూ అస్తమిస్తూనే ఉంటాడు. సూర్యుడు ప్రపంచలోని చీకటిని తొలిస్తూ నిద్రపోయిన ప్రపంచాన్ని మేలుకొల్పుతారు. ఇంతటి విశిష్టత ఉండబట్టి సూర్యనమస్కారములు అనేవి అనాధి నుండి మన దేశంలో మొదలు పెట్టబడినవి. ఋగ్వేదంలో యుజుర్వేదంలో కూడ ఉదయం లేవగానే    సూర్యడ్ని యేవిధంఆ ప్రార్ధించాలో చెప్పబడినది. సూర్యనమస్కారములు పాఠ యోగములో ఒక బాఘము అయిఏ సూర్యడ్ని మంత్ర శక్తితో ప్రార్ధిస్తూ నమస్కరిస్తూ చేసే భంగిమలనే సూర్యనమస్కారములు అంటారు. సూర్యనమస్కార సాధన 12 భంగిమలలో, 7 ప్రాణ ప్రవాహక క్రేంద బిందువులను జాగ్రృతి చేస్తూ, పంచత్వ ప్రాప్తి పొంది యోగ సాధన సిద్ధికి నాంది పలుకుతుంది. సూర్యనమస్కారములను అభ్యసించుటకు వలన శరీరంలోని 72000 నాడులు ప్రకంపనం చెంది నాఇ మండలము ఆరోగ్యవంతముగా తయ్యారయి రక్త ప్రసరన చక్కగా జరిగి సాధకునికి ఫలితము త్వరగా లభిస్తుంది.

ఆచరణ సమయం : సూర్య నమస్కారములు సూర్యోదయ సమయము గాని సూర్య అస్తమయ సమయం గాని ఆ సూర్య భగవానునికి ఎదురూ నిల్చొని ప్రశాంతమైన చిత్తం (మనస్సు)లతో, చేయవలయును, శాస్త్ర రిత్యా సూర్యోదయపు వేళలో చెమట ఉత్తమం, ఎందుకనగా ఆ సమయమున గాలిలో ప్రాణ వాయువు అధికంగా ఉండడమే కాక ప్రకృతి ప్రశాంతకు చేరువు వుండుట వలన ప్రాణ వాయువు శరీరంలోకి చేరి త్వరా సంపూర్ణ ఆరోగ్యాన్ని కలుచేయును.
ఆచరణ నియమాలు :
1)     కాలకృత్యాలు తీర్చుకొనిన తర్వాత సూర్యనమస్కారములను చేయవలయును.
2)     సూర్య నమస్కారాలు వట్టి నేలపై చేయరాదు. తీవాచి లేదా దుప్పటి పైన చేయడం ఉత్తమం. 
3)     సూర్య నమస్కారాలు ఆచరించుటకు ఎలాంటి వాతావరణ కాలుష్యం వుండని ప్రశాంత ప్రదేశము శ్రేష్ఠము.
4)     ఆహారం తీసుకున్న వెంటనే చేయరాదు.
5)     ఇవి యోగాళనములలోకి రావు. కాని ఆసనాలకు వీటికి ఉన్న సంబంధాన్ని బట్టి ఇక్కడ ఒకటి చెప్పవలసి వస్తుంది. కొన్ని ఆసనాలు సూర్య నమస్కారాలు లలో కనిపించడం వల్ల అనిపిస్తుంది. ఆసనాలకు, ప్రాణయామాలకు ముందు సూర్యనమస్కారములను చేయవలయును. ఖండరాల బిగుతుదనము తగ్గి మొత్తగా అవుతాయి.
6)     సూర్య నమస్కారాలు లలో విశేషత ఏమిటంటే ప్రతి భంగిమలోను శ్వాసక్రియ అప్రయత్నంగా చక్కగా జరుగుతూ వుంటుంది.
7)     సాధన సమయము నందు ఒక భంగిమ నుండి మరొక భంగిమనకు వెళ్ళుతునప్పుడు స్వచ్ఛముగా భీజమంత్రమును వుచ్ఛరిస్తూ ప్రశాంతంగా వెల్లవలయును.
8)     ఆరోగ్యము సరిగా లేనపుడు ఉత్తరం-దక్షిణం వైపు చేయుట నిల్పి వేయవలయును చక్కబడిన తర్వాత తిరిగి ప్రారంభించవలయును.
    ఈ చరాచర జగత్తులో సకల జన జీవనానికి ప్రాణ ప్రదాత అయిన సూర్య భగవానుని స్త్రీ, పురుష బేధము లేకుండా ఆచరించినచో ఆయుర్‌ వృద్ధి, తేజస్సు, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత,   ఇంద్రియ నిగ్రహణ కలిగి పరిపూర్ణ ఆరోగ్యముతో జీవన యాత్ర సాగించటం అనేది సత్యం. అందుకే సర్య ప్రార్ధనతో ప్రారంభిస్తాము.     సూర్యనమస్కారములను 12 భంఘిమలతో 12 నామమలకు బీజాక్షరములను జతచేసి భీజమంత్రములూ ఉచ్చరిస్త సూర్యనికి అభిముఖముగా నిల్చొని సూర్యనమస్కారములను సాధన చేయాలి.
గమనిక :
1) మెడ, నడుము సమస్యలున్న వారు సూర్యనమస్కారములను చేయరాదు.
2) గురువులను సంప్రదించి చేయవలయును.
3) 12 ఆసనాలను వరుసనే 12 మంత్రాలు చదువుకుంటూ చక చక చేసుకుంటూ పూర్తి చేస్తే ఒక రౌండ్‌ పూర్తి అవుతుంది. ఇలాంటి రౌండ్‌లు 12 చేయ్యాలి.
చివరి మాట : మనకు ఎంతో ఆకలి వున్నప్పుడు ఎవరైన ప్రేమతో ఆహారమును అందిస్తే ఎలా కృతజ్ఞతలు తెలుపుతామో, మనము నడుచుకుంటూ అలిసి వెలుతున్నప్పుడు వాహనము ఆపి ఎక్కించుకున్నప్పుడు ఎలా కృతజ్ఞతలు తెలుపుతామో గమనించండి. ఏ ఫలితములు ఆశించకుండా ఇన్ని ఫలితములను అందిస్తూ తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. నీవు ఆ భగవంతుడు అందించిన ఈ సాధనను నీవు ఆచరించి నీవు నీ ధర్మాన్ని ఆచరించుము.
    సృష్టి, స్థితి, లయ కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దివ్య ఆత్మ స్వరూపమే ”సూర్య భగవానుడు”. జగతిలోని సకల ప్రాణికోటికి సౌభాగ్యాలను ఒసగు ప్రత్యక్షదైవమే ‘సూర్యనారాయణుడు” అరుణకిరణాలు జీవక్తి దాయకాలు. అందువల్ల రోజూ ఆ భానుమూర్తికి అభిముఖంఘా నిల్చోని సూర్యనమస్కారాలు చేసినట్లయితే సర్వసుఖశాంతులు లభించును. సూర్యనమస్కారాలు ఆసనాలలో భాగము కాకపోయినా ఇవి ఆసనములతో నిర్మితమైనవే. ఈ ఆసన స్తితుల వలన శరీరంలో నాడీవ్యవస్థ, కండర వ్యవస్థ ప్రక్షాళనమై సాధకునికి ఆయురారోగ్యం సమకూరును.
        శ్లో||    ఓం మిత్రరవి సూర్యభాను – ఖగపూష హిరణ్యగర్భ
            మరీచాదిత్య సవిత్రార్క – బాస్కరేభ్యో నమః

    సూర్యనారాయణుని ప్రతి కిరణమూ ఆరోగ్యదాయకమే. రోజూ సూర్యోదయాన, సూర్యస్తమయాన సూర్యభగవానునికి అభిముఖంగా నిలుచుని పై తెల్పిన మిత్రది సూర్యనామాలను ప్రణవపూర్వకంగా స్మరించిన (ఉచ్ఛరించిన) సకల శుభాలు కలుగును.
”నమస్కార ప్రియ స్సూర్యః”
    సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. ప్రతి రోజూ సుందర సూర్యోదయపు వేళ ప్రకృతి రమణీయ ప్రదేశంలో సూర్యభగవానునికి అభిముఖంగా నిల్చుని ప్రశాంతమైన మనసుతో సూర్యనమస్కారాలు ఆచరించినట్లయితే శారీరక శక్తి చేరువై, జీవశక్తి లభ్యమై, మానసిక శక్తి వృద్ధి చెంది సంపూర్ణమైన ఆరోగ్యం, మానసిక శాంతి శారీరక ఉల్లాసం, ఆనందం సాధనకు లభ్యమగును.
    సూర్యనమస్కారాలను 12 విధాలు గా సూర్యభగవానుని 12 నామములకు బీజాక్షరములను జతచేసి బీజమంత్రాలుగా ఉచ్చరిస్తూ సూర్యనమస్కారాలను అభ్యసించుట వలన శరీరంలోని 72 వేల నాడులు ప్రకంపనం చెంది నాడీ మండలం ఆరోగ్యవంతంగా తయారై రక్తప్రసరణ చక్కగా జరిగి సాధకునికి ఫలితం త్వరగా లభ్యమగును. 
ఆచరణ సమయం :
    సూర్యనమస్కారాలు సూర్యోదయం సమయమునగానీ, సూర్యాస్తమయ సమయమున గానీ ఆ సూర్య భగవానునికి ఎదురుగా నిల్చుని ప్రశాంతమైన చిత్తం (మనస్సు) లతో, చిత్తైకాగ్రతతో చేయవలెను. శాస్త్రరీత్యా సూర్యోదపు వేళలో చేయుట ఉత్తం. ఎందుకనగా ఆ సమయమున గాలిలో ప్రాణవాయువు అధికంగా ఉండుటయే గాక ప్రకృతి ప్రశాంతతకు చేరువుగా ఉండుట వలన ప్రాణవాయువు శరీరంలోకి చేరి త్వరగా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధనకు కలుగజేయును.
ఆచరణా నియమాలు :
ా    కాలకృత్యాలు తీసుకొని స్నాసంధ్యానుష్ఠానములు ఆచరించిన తరువాత సూర్యనమస్కారాలు చేయవలెను.
ా    సూర్యనమసాకరాలు వట్టి నేలపై చేయరాదు. తివాచీని గాని లేదా ఏదైనా శుభ్రమైన వస్త్రమును వేసుకొని దానిపై చేయుట ఉత్తమం.
ా    సూర్యనమస్కారాలాచరించుటకు కాలుష్యముండని ప్రశాంత ప్రదేశం శ్రేష్టం.
ా    ఆహారం తీసుకొన్న వెంటనే సాధన చేయరాదు. కనీసం భోజనం తరువాత రెండుగంటలు, పానీయములైతే 20 నిముషాల వ్యవధి ఉండవలయును.
ా    సూర్యనమస్కారాలభ్యసించువారు కాఫీ, టీ, మత్తుపానీయాలు, ధూమపానం చేయరాదు. ఎందుకనగా వాటిలో నరాలకు ఒత్తిడి కల్గించే గుణమున్నది. అంతే గాక శరీరంలో విటమిన్లను నశింపజేసి రోగనిరోధక శక్తిని తగ్గించును.
ా    సాధన సమయమునందు ఒక భంగిమ నుండి మరొక భంగిమకు వెళ్ళునపుడు స్వచ్ఛంగా బీజమంత్రమును ఉచ్చరిస్తూ ప్రశాంతంగా వెళ్ళవలయును.
ా    6 సం|| లు పైబడిన పిల్లలందరూ సూర్యనమస్కారాలు అభ్యసించవచ్చు.
ా    ఆరోగ్యం సరిగా లేనపుడు సూర్యనమస్కారాలు చేయుట నిల్పివేసి ఆరోగ్యం చక్కబడిన తర్వాత మరలా ప్రారంభింపవలయును.
ా    స్త్రీలు బహిష్టు (3రోజులు) సమయంలో సాధన చేయరాదు.
ా    గర్భవతులు సూర్యనమస్కారాలు అభ్యసించదలచిన గురువుగారిని సంప్రదించి వారి సలహాలను స్వీకరించి సాధన చేయవలయును.
ా    గుండెజబ్బులు ఉన్నటువంటి వారు సూర్యనమస్కారాలు అభ్యసించకుండుట ఉత్తమం. అభ్యసించదలచిన గురువుగారి సలహానుసారం సాధన చేయవలయును.
ా    సాధన సమయమున మనస్సును పూర్తిగా సాధనపైనే నిలపాలి.
ా    సూర్యనమస్కారాల సాధన పూర్తి అయిన తర్వాత ‘శవాసనం’ విశ్రాంతి తీసుకొనవలయును.
మంత్ర ఉపయోగం
ఓం : ఈ బీజాక్షరంతో బిగ్గరగా బొడ్డునుండి ‘ఓం’ కారాన్ని పూర్ణముగా ఉచ్ఛరింఛుట వలన కంఠనాళాలు, హృదయము, ఉదరము, మెదడు మున్నగునవన్నీ చైతన్యమగును. అంతేగాక నాభియందున్న మణిపూరక చక్రమును ప్రకాశింపజేయును.
హ్రాం : ఈ బీజాక్షరము హృదము నుండ వెలువడును. వాయునాళం, గొంతు, గుండె, పొట్ట మొదలైన వాటికి బలము చేకూరును. పరిశుభ్రమైన రక్తమును శరీర భాగాలకు అందించుటలో సహాకరించును. హృదయ మందున్న అనాహత చక్రమును ప్రకాశింపజేయును.
హ్రీం : ఈ బీజాక్షరము కంఠం నుండి వెలువడును. కంఠం, అంగలి, ముక్కు రొమ్ము, హృదయం, జీర్ణకోశములకు పుష్టినిచ్చును. కంఠవ్యాధులను తగ్గించును. యవ్వమును పెంపొందింపజేయును. కంఠమందు ఉండు విశుద్ద చక్రమును ప్రకాశింపజేయును.
హ్రూం : ఈ బీజాక్షరము నాభి నుండి వెలువడును. లివరు, ఉదరం, ఆంత్రములు, పొత్తికడుపు, జననేంద్రియాలు, ఆరోగ్యంగా తయారగును. స్త్రీలు ఈ బీజాక్షరంను జపించిన పొత్తి కడుపు నొప్పి, ముట్టుకుట్టు నొప్పి తగ్గును. స్వాదిష్ఠాన చక్రమును ప్రకాశింపజేయును.
హ్రైం : ఈ బీజమంత్రము మూత్రపిండాలకు పుష్టినిచ్చి మూత్ర సంబంధమైన సమస్తవ్యాధులను తగ్గించి నపుంసకత్వం, వంద్యత్వంను తగ్గించును.
హ్రౌం : ఈ బీజాక్షరము మూలాధారం నుండి వెలవడును. మలకోశమును, ఆసనమును, మూత్రపిండాలను ఆరోగ్యపరుచును. మూలాధార చక్రమును ప్రకాశింపజేసి కుండలినీశక్తిని మేల్కొల్పును.
హ్రంః : ఈ బీజాక్షరము శరీరంలోని అన్ని భాగాలకు ప్రయోజనం కల్గించును. కంఠం, రొమ్ము, గుండె ఉదరం, ఆంత్రము, ఉత్తేజమై, ఆరోగ్యంగా పనిచేయును.
సూర్య నమస్కారాలు ఉపయోగాలు : 
ా    సూర్య నమస్కారాలు శరీరానికి సంజీవని వంటిని.
ా    సూర్య నమస్కారాలు చేయుట వలన శరీరంలోని ప్రాక్రియాసిస్‌ చైతన్యవంతమై ఇన్సులిన్‌ ఉత్పత్తి బాగా జరిగి మధ్యమేహ వ్యాధి (షుగర్‌) త్వరితగతిన తగ్గును.
ా    నాడీవ్యవస్థ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది నరాల బలహీనతను, పక్షవాతవ్యాధిని నివారించును.
ా    హృదయ కండరం, కాలేయము, మూత్రపిండాలు ఆరోగ్యంగా, బలంగా తయారై వాటికి సంబంధించిన వ్యాధులను నివారించును.
ా    వెన్ను ఎముకకు రక్తప్రసరణ చక్కగా జరిగి వెన్నెముక దృఢంగా తయారై శరీరానికి నూతన ఉత్సాహాన్ని కల్గించును.
ా    ఉషఃకాల సూర్యకరిణం ఆరోగ్యప్రదాయకం. సూర్యకిరణాల తాకిడికి చర్మవాద్యులు తగ్గును.
ా    శరీంలోని కొలెస్టరాల్‌ శాతం తగ్గి బానపొట్టలు తగ్గి ఉదర, హృదయసంబంధ వ్యాధులు తగ్గిపోవును.
ా    మొదడుకు రక్తప్రసరణ చక్కగా జరిగి తలనొప్పి, మైగ్రేన్‌ (అర్ధ తలనొప్పి) వంటి తలకు సంబంధించిన వ్యాధులు రావు.
ా    కీళ్ళ నొప్పులు, వాత సంబంధమైన వ్యాధులు తగ్గిపోవును. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా తయారై శరీరం తేజోవంతమగును.
ా    అజీర్ణము, గ్యాస్ట్రిక్‌ట్రబుల్‌, మలబద్దకము మొదలైన ఉదరసంబంధమైన వ్యాధులు తగ్గిపోవును.
ా    జ్ఞానేంద్రియములు ఆరోగ్యంగా, చురుకుగా తయారగును.
> ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

Read Full Post »

Yoga Pranayama Breathing Practicing Details in Telugu (Vajrasanam, Mudras).

వజ్రాసనం

1.     కాలిబొటన వ్రేళ్ళు రెండూ జతగా ఉంటాలి. ఒకదానిపై ఒకటి గాని, ఒకటి క్రింది ఒకటి పైన గాని ఉండరాదు.
2.    ఛాతి ముందుకు ఉండాలి. వెన్నెముక (వైపు) నిటారుగా ఉండాలి.
4.    భుజాలు వదులుగా విశ్రాంతిగా ఉండాలి.
5.    రెండు మోకాళ్ళ చివర నాలుగు వ్రేళ్ళ అంతరం ఉండాలి.
ఉపయోగాలు :
1.     ఖాళ్ళకు సంబంధించిన అన్ని నొప్పులూ తగ్గిపోతాయి.
2.    జీర్ణక్రియకు సంబంధించిన అన్ని రుగ్మతులు తొలగిపోతాయి.
3.    ఆకలి లేనివారికి ఆకలిపుడుతుంది. అతిగా ఆకలి ఉన్నవారికి సరియౌతుంది.
4.    కాళ్ళ మీద కొందరికి ఏర్పడే రక్తనాళాల ముడులు తొలగిపోతాయి.
5.    వజ్రాసనంలో ప్రాణామయం సాగిస్తే అత్యంత ఉత్తమమైన ఫలితం అందుతుంది.
విభాగ ప్రాణాయామము (వజ్రాసనంలో ఉండి చెయ్యాలి)
కనిష్ఠ :
1. చేతులు సమంగా ఉంచాలి, నాలుగు వేళ్ళు జతలో ఉండాలి.
2.    చూపుడు, ఒటనవేళ్ళను కలిపే గీత మాత్రమే శరీరానికి తాకుతూ ఉంటుంది.
3.    హస్తాలు భూమికి సమాంతరముగా వుంచాలి.
4.    చూపుడు, బ్రొటన వేళ్ళను కలిపే గీత మధ్య బిందువు శరీరంపై సరిగ్గా ప్రక్కన తాకాలి.
5.    చేతులు చివరి ప్రక్కటెముక క్రింద ఉంచండి. మోచేతులు ముందుకు వెళ్ళాలి.
6.    పూరక, కుంభక, రేచక, శూన్యక లను పాటిస్తూ శ్వాసను జరపాలి.     
ఉపయోగాలు : ప్రాణశక్తి బొడ్డు నుండి పాదాల వరకు అందించబడును. ఆయా భాగాలకు ప్రాణశక్తి అందించబడుట వలన అన్ని భాగాలు చైతన్యవంతముగా పనిచేయును.
మధ్యమ విభాగ ప్రాణాయామము :
1.     బొటన వేళ్ళు చంకల మధ్యలో వుంచాలి.
2.    బొటనవేలు చూపుడు వేళ్ళ మధ్య గీత మాత్రమే శరీరానికి తాకుతూ వుంటుంది.
3.    హస్తాలు సాధ్యమైనంద ఎదపై భాగములో వుంచాలి.
4.    జబ్బలు భూమితో సమానంగా ఉంచాలి. చంకలో బొటనవ్రేలితో వత్తిడి కలిగించరాదు.     5.    పూరక, కుంభక, రేచక, శూన్యక లను పాటిస్తూ శ్వాసను జరపాలి.
ఉపయోగాలు : బొడ్డుపై నుండి గొంతు భాగము వరకు ప్రాణశక్తి అందించబడుట వలన ఆయా భాగాలు చైతన్యవంతముగా పనిచేయును.
జ్యేష్ట విభాగ ప్రాణామయము :
1.     మొదట ఎదను పూర్తిగా పైకి ఎత్తండి. గడ్డాన్ని ఎదపైన తాకించండి.
2.    చేతులను వెనుకకు తిప్పండి. వెన్నుపైన సులభంగా ఉంచాలి.
3.    తల క్రిందకి వంచి ఉంచండి. జబ్బలు చెవుల వెనుక తలను క్రిందకు పట్టి ఉంచుతుంది.
4.    మరల ఒకసారి ఎదను పైకి పూర్తిగా ఎత్తాలి.
5.    చివరగా మీ గడ్డం ఎదకు తాకి వుంచాలి. మీ ముఖం సాధ్యమైనంత నేరుగా వుండాలి.
6.    పూరక, కుంభక, రేచక, శూన్యక లను పాటిస్తూ శ్వాసను జరపాలి.
ఉపయోగాలు : తల భాగమునకు ప్రాణశక్తి పంపించబడును.
– విభాగ ప్రాణాయామము 7 సైకిల్స్‌ చేయ్యాలి.
ధౌతి :  (3 సార్లు చేయ్యాలి)
1.     వజ్రాసనంలో ఉండి రెండుచేతులను వెనుక వైపు వెలకిలా పాదాల ప్రక్కన పెట్టాలి.
2.    శ్వాస ను నెమ్మదిగా తీసుకోని, నెమ్మదిగా వదులుతూ క్రిందికి వంగాలి.
4.    క్రిందికి వంగిన తర్వాత క్రింద శూన్యకంలో ఉండాలి. శ్వాస తీసుకోవద్దు, వదలవద్దు.
ఉపయోగాలు : శరీరంలో వున్న వేడి బయటికి వెళ్ళుతుంది. 
 
ముద్రాప్రాణాయామము (వజ్రాసనంలో ఉండి చెయ్యాలి)
చిన్ముద్ర :
1.    చూపుడు వ్రేలు మరియు బొటన వ్రేలు చివరలు ఒకదానికొకటి తాకుతూ ఉంటాయి.
2.    వ్రేళ్ళ మధ్య వృత్తాకారంగా వుండాలి.
3.    మిగిలిన మూడు వ్రేళ్ళు ఒకదానికొకటి తాకుతూ ఉంటాయి.
4.    ముద్ర మాత్రము బిగుతుగా వుంటుంది.
5.    మోచేతులు నడుము ప్రతీ భాగము తాకాలి.
6.    పూరక, కుంభక, రేచక, శూన్యక లను పాటిస్తూ శ్వాసను జరపాలి.
ఉపయోగాలు : కనిష్టలో జరిగే ఉపయోగాలే వుంటాయి.
చిన్మయముద్ర :
1.     చూపుడు వ్రేలు బొటనవేలు కొనలు మాత్రమే జతలో ఉండి వృత్తాకారంగా ఉండాలి.
2.    మొదట వ్రేళ్ళను వాటి మూలల్లోకి మడిచి తరువాత అరచేతుల్లోకి మడచాలి.
ఉపయోగాలు : మధ్యమలో జరిగే ఉపయోగాలు ఉంటాయి.
ఆదిముద్ర :
1. బొటన వ్రేలును మడచి అరచేతిలో పెట్టవలెను.
2.    మిగతా 4 వ్రేళ్ళతో దాన్ని కప్పివేసి గుప్పిటగా చెయ్యాలి.
ఉపయోగాలు : జ్యేష్ట ఉపయోగాలు దీనిలో కూడ జరుగును.
మేరుదండ :
1.     వ్రేళ్ళకొనలను వాటి మూల భాగాలలో వుంచాలి.
2.    తరువాత అరచేతులలోనికి మడవాలి.
3.    బొటన వ్రేళ్లు నిటారుగా వుండాలి.
4.    ముద్రను తొడ మధ్య భాగములో వుంచాలి.
5.    మోచేతులు శరీరము ప్రక్క భాగానికి తాకాలి.
ఉపయోగాలు : వెన్నుముకను చైతన్యవంతంగా చేయును.
పూర్ణముద్ర :
1.    పిడికిలి జతగా ఉంచాలి. ఉంగరాలు పెట్టుకొనే భాగము కలిపి ఉంచాలి.
2.    చేతులను పొట్టకు ఆనించి తొడలపైన ఉంచాలి.
3.    ఎదను లోపలకి అనుకొని మణికట్టును క్రిందకి నొక్కి భుజాలను పైకి ఎత్తి మోచేతులను ముందకు త్రిప్పాలి.
ధౌతి : పై విధంగా 3 సార్లు చేయ్యాలి.
శీతలీ :
నాలుకను మడచి, మడిచిన గొట్టం ద్వారా గాలి పీల్చుకొని, మూతిని మూసి ముక్కుద్వారా గాలిని వదలాలి. ఈ విధంగా 10 సార్లు చేయ్యాలి.
శీతలీకరణ :
నోటిలో పండ్లను ఆనించి పంటి సందుల ద్వారా గాలి పీల్చుకొని, మూతిని మూసి ముక్కుద్వారా గాలిని వదలాలి. ఈ విధంగా 10 సార్లు చేయ్యాలి.
ఉపయోగాలు : శీతలీ, శతలీకరణ ద్వారా వంటిలో వేడి తొలగి బాడీ చల్లబడుతుంది.
విభాగ ప్రాణామయము ద్వారా నాడులలోని మలినాలు బయటికి పంపించబడును. ముద్రాప్రాణాయామము ద్వారా ప్రాణశక్తి సాఫీగా పంపించబడును.
 
జాగింగ్‌ చేయు విధానం :
1.    మునివ్రేళ్ళు మాత్రమే నేలను తాకాలి, పాదాలు తాకరాదు.
2.    ఆది ముద్రలో ఉండాలి. చివరరి వరకు దీన్ని కొనసాగించాలి.
3.    ముందు కాళ్లు మాత్రమే పైకి తేవాలి.
4.    ముక్కుల ద్వారా వేగంగా గాలి బయటకు వదుల్తూ ఉండాలి.
5.    జాగింగ్‌ అయిన తర్వాత ఆదిముద్రలను వదలకుండా అలాగే ఉంచండి.    
సుఖప్రాణాయామము :
1.    ఎడమ తొడపైన ఎడమ అరచేయి ఆకాశమువైపు వుంచాలి.
2.    కుడి చేయ్యి బొటన వ్రేలును & చిటికెన వ్రేలు మాత్రమే వాడాలి.
3.    మిగతా వ్రేళ్లు ఒకదానితో ఒకటి జతలో ఉండాలి.
4.    కుడి ముక్కును బ్రొటన వేలుతో మూయండి.
5.    ఎడమ ముక్కు గుండా శ్వాసను వదిలేసి అదే ముక్కు ద్వారా గాలిని పీల్చాలి.
6.    ఇప్పుడు ఎడమ మక్కును చిటికెన వేలుతో మూసి కుడి ముక్కును తెరవండి.
7.    కుడి ముక్కు ద్వారా గాలిని వదలండి. తరువాత అదే ముక్కు ద్వారా గాలి పీల్చాలి.
8.    మళ్ళీ కుడి ముక్కును మూసి ఎడమ ముక్కు ద్వారా గాలిని వదిలి మళ్ళీ అదే ముక్కు ద్వారా గాలిని పీల్చాలి.
ఉపయోగాలు : మనస్సు శరీరాన్ని సమన్వయపరచి ఎప్పుడు సమత్వంతో వుంచుతుంది.
మహత్‌ ప్రాణాయామం :
1.     పూర్ణముద్రలో చేసిన విధంగానే పిడికిలి జతగా ఉంచాలి. ఉంగరాలు పెట్టుకొనే భాగము కలిపి ఉంచాలి. చేతులను పొట్టకు ఆనించి తొడలపైన ఉంచాలి. ఎదను లోపలకి అనుకొని మణికట్టును క్రిందకి నొక్కి భుజాలను పైకి ఎత్తి మోచేతులను ముందకు త్రిప్పాలి.
2.     శ్వాసను తీసుకొని చేతులను లాక్‌ చేయవలెను.
3.    కలపాల భూతి 15 సార్లు  చేయవలెను.
4.     నెమ్మదిగా కంఠంను బిగించి, గడ్డాన్ని క్రిందకు ఆనించి శ్వాసను బిగబట్టివలెను.
5.    వుండగలిగినంత సేపు వుండి నెమ్మదిగా తలను పైకెత్తి లాక్‌ రిలీజ్‌ చేయవలెను.
ఉపయోగాలు : గుండెలో లన్స్‌లకు పట్టి వున్న దుమ్ము, మలినాలు వదలుతాయి.
ఈ విధంగా మహత్‌ ప్రాణాయామం 2 సార్లు చేయవలెను.
ధౌతి : పై విధంగా 3 సార్లు చేయ్యాలి.

ముద్రప్రాణాయామము ద్వారా  :
శరీరములో ఏ భాగములో నైన నొప్పి ఉన్నప్పుడు ఆభాగాలకు అనువైన ముద్ర ఆవైపు మాత్రమే ఉంచుకొని ఇంకొక వైపు విశ్రాంతిగా ఉంచుకొనవలెను.
కుడికాలు నెప్పికి     : కుడివైపు చిన్ముద్ర పెట్టి చేయ్యాలి.
ఎడమవైపు గుండెకు,      : చిన్మయముద్ర ఎడమవైపు
కుడివైపు పార్శ్వపు నెప్పి     : కుడివైపు ఆది ముద్ర పెట్టి చేయాలి.
నడుము నొప్పికి     : మేరుదండ బోర్లించి ఉంచి చేయాలి.
వీపునొప్పికి     : మేరుదండ వెల్లకిల ఉంచి చేయాలి.
కుడివైపు శరీరమంతటికీ     : పూర్ణముద్ర కుడివైపు ఎడమచేయి తొడలపైన ఆనించి వుంటుంది.

జ్ఞాపక శక్తిని పెంచు భ్రామరీ ప్రాణాయామము :
    మొట్టమొదట సుఖాసనము, పద్మాసనము లేక సిద్దాసనము నందు కూర్చుండ వలెను. తదనంతరం  రెండు మోజేతులు భుజములకు సమానముగా నుండు నట్లుంచి రెండు చేఉల చూపుడు వ్రేళ్ళు రెండు చెవుల యందును నెమ్మదిగా నుంచవలెను. ఒక్కసారిగా వేముఆ రెండు చెవులు మూయరాదు. వెలుపలి ధ్వని వినపడకుండా నెమ్మదిగా వ్రేళ్ళతో చెవులు మూయవలెను.
    ఇప్పుడు దీర్ఘశ్వస తీసుకొని కొంచెం కాలమాగి పెదవులు మూసుకొని మెల్లమెల్లఆ భ్రమర నాదము వలె ‘ఓం’ కార నాదము చేయవలెను. తదనంతరము కొలది కాలము శ్వాస తీసుకొనరాదు. అనగా బహిర్‌ కుంభకము చేస తిరిగి ఇఏ ప్రకారము 8 నుండి 10 సార్లు చేయవలెను.
ఈ భ్రామరీ ప్రాణాయామము వలన జ్ఞాపక శక్తి అధికముగా వృద్ధి అగును. మెదడులోని నాడులు శుద్ధియై మెదడుకు రక్త ప్రసరణ చక్కగా జరుగును.

> ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

Read Full Post »

Yoga Pranayama Description in Telugu, Yoga Breathing Details in Telugu.
 ప్రాణాయామము

    ప్రాణాయామం అనుశబ్దంలో ప్రాణం, ఆయామం అను రెండు శబ్ధాలు కలసి వున్నాయి. ప్రాణం అంటే జీవనశక్తి, శ్వాస అన్నమాట, ఆయామం అంటే పెంచుట, విస్తరింప చేయుట శ్వాసను పొడగించుట, నియంత్రించుట. దీని వలన మానసిక వికారాలను, దూరం చేయవచ్చును. మనస్సు మనవశంలో ఉంచుకోవచ్చును. ప్రాణాయామమనేది మనిషి యొక్క మానసిక స్ధాయిని సాధారణ స్ధాయి నుండి ఉన్నత స్ధాయికి తీసుకెళ్ళే శాస్త్ర యుక్తమైన ప్రక్రియ. మన పూర్వీక బుషులు మనసును అదుపు చేయుటకై కనిపెట్టిన ఒక సాంకేతిక విధానము. మాన జీవితము యొక్క అన్ని కోణములు దీనిలోనే ముడిపడి వున్నవి. ఎందుకంటే మానవ జీవితం శ్వాసతో మొదలవుతుంది, శ్వాసతో అంతమవుతుంది. తల్లిగర్భంలో బిడ్డ ఉన్నపుడు స్వతంత్రంగా శ్వాసించలేడు. తల్లికి బిడ్డకు మధ్య గొట్టము వంటి ”జరాయువు” వుంటుంది. దీని ద్వారానే తల్లినుండి బిడ్డకు పోషక పదార్ధములు, ప్రాణశక్తి లభిస్తాయి. అలాగే బిడ్డ దేహంలో తయారైన మలినములు, కార్భన్‌ డయాక్సైడ్‌ తిరిగి తల్లి దేహంలోనికి వస్తాయి. బిడ్డ తల్లి దేహము నుండి బయటకు రాగానే తల్లికి బిడ్డకు మధ్య వున్న సంబంధము తొలగిపోతుంది. అప్పుడు బిడ్డ మొదటి శ్వాసను ప్రారంభిస్తాడు. దానిని జీవితాంతం కొనసాగిస్తాడు. చివరకు నిచ్ఛ్వాసంతో జీవితం అంతమవుతుంది. ప్రాణం బయటకు పోయే సమయాన కొంత శాతం మలద్వారం గుండా, మరికొంత శాతం ముక్కు రంధ్రములు గుండా విడుదలవుతుంది. అందువలనే మలద్వారమును మృత్యుదేవత అన్నారు. మలద్వారమును బంధించగలిగితే బయటకు విడుదలయ్యే ప్రాణశక్తిని ఆపవచ్చు.
    విశ్వమంతా పంచభూతాలమయం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు విశ్వమంతా వున్నాయి. ఇవి ఒకదాని నుండి మరొకటి ఏర్పడుతాయి. ఒకదానిచే మరొకటి హరించబడతాయి. ఉదాహరణకు భూమి నీటిచే హరించబడుతుంది, నీరు అగ్నిచే దహించబడుతుంది. అగ్ని వాయువుచే హరించబడుతుంది, వాయువు ఆకాశముచే హించబడుతుంది. తిరిగి ఇవి అన్నీ అదే క్రమములో ఏర్పడుతాయి. అయితే ఇలా మార్పులు జరగడానికి వెనుక ఒక శక్తి తప్పనిసరిగా వుండి వుండవలసిందే. ఆ శక్తినే ప్రాణశక్తి అంటారు. పంచభూతములు ప్రాణశక్తితో కూడి ఉంటాయి. ప్రాణశక్తి పంచభూతములందు ఇమిడి వుంటుంది.
    విశ్వంలో ఏ విధంగానయితే పంచభూతాలు ఉన్నాయో మన శరీరములో గూడా అవే పంచభూతములున్నాయి. ఎముకలు, కండరములు భూమితత్వములో వుంటాయి. 70 శాతము వరకు నీరు వుంటుంది. శరీరము ఎల్లప్పుడూ నిర్ణీతమైన ఉష్టోగ్రతలో వుంటుంది, లోపల భాగమంతా వాయువు ఉంటుంది. అవయములు ఉండుటకు అవకాశానిచ్చే ఆకాశము వుంటుంది. ఈ పంఛభూతములను నడిపించే ప్రాణశక్తి మనలో కూడా వుంది. ఎందుకంటే ప్రాణము లేకుండా పంచభూతములకు కదలిక లేదు. ప్రాణాయామమంటే పంచభూతములను నడిపించే ప్రాణశక్తిని నియంత్రించుకొనడమే. ఈ రహస్యములను మనం కనుగొనగలితే విశ్వములో ప్రాణశక్తి కదలికలు గూడా మనకు తెలుస్తాయి. కేవలం ఆక్సిజనును తీసుకుని, కార్బన్‌యాక్సైడ్‌ను వదలినయెడల అది ్పఆణాయామము కాదు. ప్రాణశక్తిని గ్రహించి దాని ద్వారా శరీర అవయములను సక్రమైన రీతిలో పనిచేయించమే ప్రాణాయామమవుతుంది.
    మనము మామూలుగా గాలిని తీసుకొని వదులుతూ వుంటాము. ఇది యాంత్రికంగా ఆ ప్రయత్నముగా జరుగుతూ వుంటుంది. కాని మనము ప్రాణాయామములో క్రమబద్ధంగా నియమ నిష్టలతో గాలిని తీసుకొని వదులుతూ వుంటాము. ఇవి ఒకరకమైన నియంత్రిత చర్య అవుతుంది. మన శ్వాసకు, మనసుకు మధ్య ప్రత్యక్ష సంబంధము వుంటుంది. శ్వాస గజిబిజిగా, అక్రమంగా, వేగంగా జరుగుతుందంటే మనసు కూడా అలజడిగా, గందరగోళంగా వుంటుంది. శ్వాస క్రమబద్ధంగా లోతుగా, సుదీర్ఘంగా వుంటే మనసు కూడా ప్రశాంతంగా వుంటుంది. శ్వాస క్రమబ్ధంగా లోతుగా, సుదీర్ఘంగా వుంటే మనసు కూడా ప్రశాంతంగా వుంటుంది. కాబట్టి ఐలిబీజీలిశి ళితీ ళితిజీ నీలిబిజిశినీ జిరిలిరీ రిదీ ళితిజీ లీజీలిబిశినీ. మామూలు పరిస్థితులలో మన రెండు ముక్కు రంధ్రములు సమానంగా వుండవు. ఒకటి ఎక్కువగా పనిచేస్తే రెండవది తక్కువగా పనిచేస్తుంది. మనం ఆవేసంగా అలజడిగా వున్నపుడు కుడి ముక్కురంధ్రము పనిచేస్తుంది. అప్పుడు మన శరీర ఉష్ణాగ్రత మామూలు స్ధాయికంటే కొంచెము ఎక్కువగా వుంటుంది. మనం సోమరితనం బద్ధకంగా వున్నపుడు ఎడమ మక్కురంధము పనిచేస్తుంది.  అపుడు శరీర ఉష్ణోగ్రత మామూలు స్ధాయికంటే కొంచెం తక్కువగా వుంటుంది. ఇటువంటి విధానం రోజంతా కొనసాగుతుంది. అయితే సంధ్యా సమయంలో మాత్రం రెండు ముక్కు రంధ్రములు సమానంగా పనిచేస్తాయి. అంటే ఆ సమయంలో మనసు సమత్వంలో ఉందన్నమాట. అందువలననే ఆ సమయంలో సంధ్యావందనం, అగ్నిహోత్రం, జపం పారాయణం చేస్తూ వుంటారు. అయితే మనం క్రమం తప్పకుండా రెండు సంవత్సరములు ప్రాణాయామం చేయగలిగితే రెండు శ్వాసరంధ్రములు 24 గంటలు సమానంగా పనిచేస్తాయి. అంటే మనసు సంపూర్ణంగా సమత్వంలో ఉంటుందన్నమాట. ఉష్ణోగ్రతలో వ్యత్యాసమును ప్రదర్శిస్తున్నాయి కాబట్టి కుడి ముక్కు రంధ్రమును సూర్యనాడి అని, ఎడమ ముక్కు రంధ్రమును చంద్రనాడి అన్నారు.
    సాధారణ పరిస్థితిలలో మనం మన ఊపిరితిత్తుల సామర్ధ్యంలో కేవలం 30 నుండి 35 శాతం మాత్రమే వాడతాము. సైన్సు పరంగా చెప్పాలంటే రెండు ఊపిరి తిత్తులందు దాదాపు 6వేల విలాలనే గాలితిత్తులుంటే వానిలో 2వ వరకు మాత్రమే మంచి గాలితో నింపబడతాయి. అందువలననే చెడురక్తం మెదడుకు గూడా ప్రవహించి ఆలోచనావిధానంలోనే మార్ప వస్తుంది. మనం ప్రాణాయామం చేసే సమయమున ఊపిరితిత్తుల సామర్ధ్యమును నూటికి నూరు శాతం ఉపోయగిస్తాము. కావున శరీరమందలి అన్ని బాగములు చైన్యవంతమవుతాయి. అదనపు బరువు అనవరసరపు క్రొవ్వు శరీరంలో వుండదు.
    ఆసక్తికరమైన విషయమేమిటంటే సృష్టిలో ఏ జంతువైతే తక్కువ శ్వాసలు తీసుకుంటుందో ఆ జంతువు ఎక్కువ కాలం బ్రతుకుంది. ఉదాహరణకు కుక్కలు నిమిషమునకు 50-80 సార్లు శ్వాసిస్యాతి. 11సం||లు మాత్రమే బ్రతుకుతాయి. గుర్రములు నిమిషానికి 30 సార్లు శ్వాసిస్తాయి 30 సంవత్సరాలు బ్రతుకుతాయి. ఏనుగులు ప్రతి నిమిషానికి 15-20 శ్వాసలు తీసుకుంటూ – 100 సంవత్సరాలు జీవిస్తాయి. అదే విధంగా మనుషులు ప్రతి నిమిషానికి 12-25 శ్వాసలు తీసుకోవాలి – 120 సంవత్సరాలు జీవన ప్రమాణం కలిగ& వుండాలి. ఇది ఆదర్శవంతమైన జీవితం కలిగినవారికే సాధ్యపడుతుంది. తాబేళ్ళు నిమిషానికి 5-10 శ్వాసలు తీసుకుంటాయి. – 500 సంవత్సరాలు బ్రతుకుతాయి.
    మనం క్రమం తప్పకుండా ప్రాణామాయము చేయడము ద్వారా మన శ్వాసల యొక్క సంఖ్య క్రమేపీ తగ్గుతుంది. అందువలన ఆయుస్సు పెరుగుతుంది. నీకు నీవే బ్రహ్మవవుతావు. ప్రస్తుతం మనకున్న జీవితకాలం పెరుగుతుంది. అనుమానపడవలసిన పని లేదు.
    ప్రాణాయామము నందు పూరక, కుంభక, రేచక, శూన్యక అనే నాలుగు థలుంటాయి. కుంభకంలో వుండడం ద్వారా నాడులు ఉత్తేజితమై జ్ఞాపక శక్తి పెరుగుతుంది. శూన్యకలో వుండడం ద్వారా ఆహంకారం తగ్గుతుంది. శరీరమునకు మనసుకు మధ్య సమన్వయం ఏర్పడుతుంది.
    జబ్బు అనేది శరీరమందలి ప్రాణశక్తి మోతాదులో సంభవించే మార్పు మాత్రమే. ఒక అవయవమునకు ప్రాణశక్తి అందనట్లయితే ఆ అవయవము క్రమేపీ పనిచేయడం తగ్గిపోయి కొంత కాలానికి జబ్బుకు గురవుతుంది. ఒకవేళ ఒక అవయవమునకు ఉధృతముగా ప్రాణశక్తి అందిగా అది క్రమేపీ, అధిక శ్రమ వలన రుగ్మతకు గురవుతుంది. క్రమం తప్పకుండా ప్రాణాయామం చేడం ద్వారా అధికంగా ప్రాణశక్తి వున్న ప్రదేశంనందున్న ప్రాణశక్తి గ్రహించబడి ప్రాణశక్తి లేని ప్రదేశములకు అందించబడి శరీరము ప్రాణశక్తితో సమత్వమును పొందుతుంది. అందువలన జబ్బువుండే ప్రసక్తే లేదు. ప్రాణాయామము క్రమం తప్పకుండా చేస్తూ వుంటే శరీరంలో అనేకమైన మార్పులు వచ్చి కొన్ని శబ్దాలు వస్తాయి. శరీరం దూదిపింజలాగా తేలికగా వుంటుంది. లేదా ఒక టన్నువరకు బరువు పెరుగుతుంది. ఇటువంటి విధానమును ”లెవిటేషన్‌” అంటారు.
    మానవుని దేహములో అచేతనంగా వున్న నాడులను కొన్నింటిని చైతన్యవంతం చేయగలిగితే అతీతమైన శక్తులు వస్తాయి. వానిలో రెండు అతి ముఖ్యమైనవి. అవి 1) ఇడ, 2) పింగళ. ఇవి వెన్ను భాగము నందలి ఎడమ, కుడి నాడులు. వీని ఆధార భాగమున యోగ శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. దీనిని కుండలినీ శక్తి అంటారు. రెండు నాడుల మధ్యలో వున్న ద్రవమును ”జీవామృతము” అంటారు. ఇది పైకి ప్రవహించేకొలది మూలాధారమునుండి సహస్రారము వరకు శక్తి ప్రవహిస్తూ వుంటుంది. అలా జరుగుతూ వుండే కొలది మనిషి యొక్క ఆలోచనా విధానములో మార్పు వస్తుంది.
    మనం కొంది యోగుల కధలను వింటూ వుంటూ వుంటాము. వారు ఎవరినయినా తాగితే రుగ్మతులు పోతాయని, గ్రుడ్డివానికి చూపు వచ్చిందని, చనిపోయినవారిని బ్రతికించాడని, లేక వారి సమక్షములో జీవిస్తేనే రుగ్మతలు తగ్గిపోతాయని, ఇటువంటివన్నీ శ్వాస ప్రక్రియలే. వీరియందు పుష్కలంఘా ప్రాణశక్తి వుంటుంది. వీరు ప్రాణ శక్తిని మరొకరికి అందించడం ద్వారా రుగ్మతలను నివారించగలుగుతారు.
    క్రమం తప్పకుండా ప్రాణాయామము చేయడం ద్వారా శ్వాసవేగం తగ్గుతుంది. మనిషి యొక్క మానసిక స్ధితిలో మార్పు వస్తుంది. అటువంటి వారు సమాధి అభ్యాసమును కొనసాగించడం ద్వారా ఆత్మానుభూతి కలుగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే పరాకాష్ట థకు వెళ్ళగలిగితే శ్వాస ఆగిపోతుంది. ఆలోచనారహిత స్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా సజీవంగా శరీరమును ఎంత కాలమైనా వుంచవచ్చు.
    చివరగా తెలుసుకోవలసిన నగ్న సత్యమేమిటంటే మనిషి తనను తాను జయించగలిగితే విశ్వాన్ని జయించినట్లే. దానికి ఆధారము శ్వాసలో వున్నది. అజ్ఞాని బాహ్యప్రపంచమును జయించాలనుకుంటే, జ్ఞాని తనను తాను జయించాలనుకుంటాడు. దీనికి ప్రాణాయామము ఎంతో అవసరము.
    శ్వాస అనే మన మనసుకి అద్ధం వంటిది. శ్వాసలో కలిగే మార్పు మన జీవితంలో, వ్యక్తిత్వంలో విప్లవాత్మక మార్ప తెస్తుంది. శ్వాసలోతుగా జరిగే కొలది ప్రవర్తన కూడా మారుతుంది. కృతిమత్వంగా తొలగిపోయి ప్రతి కోణమునుండి మన జీవన విధానం మారుతుంది.
ప్రాణాయామం సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

1.     ప్రాణాయమం వజ్రాసనంలో మాత్రమే చేయవలెను. వేరే ఆసనములో చేయునపుడు వెన్నెముక నిటరుగా ఉంచవలెను.
2.    శరీరంలో ఎటువంటి బిగింపు లేకుండా ఆరామముగా, విశ్రాంఇగా చేయవలెను. ముఖం చిరునవ్వుతో ఉంచవలెను.
3.    అనుకూలంఆ ఉండే వదులైన దుస్తులు వాడవలెను.
4.    కళ్ళు, నోరు పూర్తిగా మూసుకొని ఉండాలి.
5.    ఖాళీ కడుపుతో ఉండాలి. విందు భోజనం చేసినట్లయితే 4 ంటలు, మామూలు భోజనమైతే 3 గంటలు, టిఫిన్‌చేసినట్లయిఏ రెండు గంఠలు, పండ్లరసాలు పుచ్చుకుంటే ఒక గంఠ, మంచి నీరు త్రాగితే అరగంట వ్యవధి ఉండాలి.
6.    శూన్యకంతో ప్రారంభించి శూన్యకంతో ఆపివేయాలి.
7.    పూరక, కుంభక, రేచకములు పాటిస్తూ చేయాలి. అది 4 2, 5 2 నిష్పత్తిలో ఉండాలి. 
8.    శరీరంలో సంకోచక వ్యాకోచములు ఎక్కడ జరుగుతున్నాయో గమనిస్తూ చేయాలి. గమనన్ని పూర్తిగా శ్వాసపై ఉంచాలి.
9.     గాలిని తీసుకొనేటప్పుడుగాని, వదిలేప్పుడూని నిదానంగా, పూర్తిగా సాఫీగా జర్క్స్‌ లేకుండా ఉండాల. బలవంతంగా ఒత్తిడిగా చేయరాదు.
10. గాలిని బటయకు వదిలేప్పుడు గొంతు ద్వారా శబ్దం చేస్తూ ముక్కు ద్వారా వదలాలి.
11.    సంధ్యాసమయం ప్రాణాయామానికి అత్యంత అనుకూలమైనది.
12.    ప్రాణాయామం ఎటువంటి వ్యాయామం కాఉ. అది విశ్రాంతినిచ్చే ప్రక్రియ. ముగిసిన తర్వాత విశ్రాంతి పొందడాన్ని గమనించాల.
13.    వేడి కలగించే, ప్రాణశక్తిని హరించే ఆహారపదార్ధాన్ని వానిప్పుడు ప్రాణాయామాన్ని చేయరాదు. అపక్వాహారాన్ని తీసుకొంటూ ప్రాణాయాము చేయడం అత్యంత ఉత్తమం.
14.    వేసవి కాలమందు సర్యోదయానికి ముందు, సూర్యస్తమయం తర్వాత మత్రమే చేయవలెను.
15.    అతిగా అలసిపోయినప్పుడు, వ్యాయామం తరువా వెంటనే ప్రాణాయమం చేయరాదు. కొద్దిగా స్థిమిపడిన తర్వాతన ప్రారంభింఛాలి. శవాసనంలో నిమిషాలుండి ఆ తర్వాత ప్రారంభిస్తే మంచిది.
16.    గర్భిణీ స్రీలు,5 వ నెల తర్వాత ప్రాణాయామం ఒత్తిడిగ చేయరాదు.
17.     ప్రాణాయామానికి ముందు అలజడిగా ఉండి, ప్రాణాయామం   తరువాత విశ్రాంతి పొందితే చేసే విధానం సక్రమమేనని గ్రహించలి.
18.    గాలి తీసుకొనేటప్పుడు పొట్ట ముందుకు రావాలి. వదిలేప్పుడువెననకు పోవాలి.
19.    ప్రాణాయామానికి ముందు కొద్దిపాటి వ్యాయామం లేదా ఆకుప్రెజర్‌ చేసుకోవడం మంచిది.
20.    ఉల్లి, వెల్లుల్లి, మిర్చి, ఇంగువ, కాఫీ, టీ, ధూమపానం, మసాలా, మద్యం వంటిని  తీసుకున్నప్పుడు ప్రాణాయామం చేయరాదు.
21.    ప్రత్యేకమైన రుగ్మతలో బాదపడేవారు దానికి సంబంధించిన ముద్రను వాడి మనసును దానిపై కేంద్రీకిరంచి, అదనంఆ ప్రాణాయామం మామ్రే చేయలి. శీతలిని, శీఆ్కరిణి శరీరాన్ని చల్లబరుస్తుంది.    
22.    జ్వరం వచ్చినపుడు, శరీరం వేడిగా ఉన్నప్పుడు సుఖ ప్రాణాయామం మాత్రమే చేయాలి. శీతలిని, శీఆ్కరిణి శరీరాన్ని చల్లబరుస్తుంది.
23.    క్రమం తప్పకుండా ప్రాణాయమం చేస్తున్నప్పుడు అత్యవసరమైతే తప్ప యాంటీ బయోటిక్స్‌ వాడరాదు.
24.    ఋతుక్రమంలో ఉన్నప్పుడు కూడా ప్రాణాయామం తక్కువ ఒత్తిడితో చేయాలి.
25.    ప్రాణాయామం వలన ఎటువంటి వ్యతిరేఖ పలిముసంబంవింఛినా గురువులను సంప్రదించవలెను.        
> ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

Read Full Post »

Yoga Health Remedies in Telugu, Yoga Kitchen Tips in Telugu
రోగాలను తగ్గించుచిట్కాలు

అజీర్ణము :
ా    కరక్కాయ చూర్ణము, సైంధవ లవణము సమభాగములగా కలుపుకొని పూటకు పావుతులం (3గ్రా||) ఉదయం, సాయంత్రం, భోజనం తరువాత తీసికొంటే అన్ని రకాల అజీర్ణ రోగాలు పోతాయి.    
ా    పచ్చి అరటికాయ ముక్కలు కోసి ఎండించి పొడిచేసి 1 నుండి 2 గ్రాముల పొడిని కొద్ధిగా ఉప్పు కలిపి సేవింఛిన అజీర్ణము, పులిత్రేన్పులు గల అగ్ని మాంద్యము హరించును.
ా    మొలలు
ా    ఆవు వెన్న మరియు నువ్వులు సమానంగా కలిపి ప్రతి రోజు రెండు పూటలా ఒక వారం పాటు తింటే మూల వ్యాది పోతుంది.
ా    ఆవు నెయ్యిని ఒక టీ స్పూను, ఒక గ్లాసు ఆవుపాలలో కలిపి ప్రతి రోజూ త్రాగుతుంటే మొలలు ఊడిపోతాయి.
ఉబ్బసము (ఆస్త్మా) :
ా    కుంకుడు గింజలోని పప్పు ప్రతిరోజూ తినుచుండిన ఉబ్బస వ్యాధి నిరోధించబడుతుంది.
ా    పరిశుద్ధమైన వేపనూనె 5 నుండి 10 చక్కులు తమలపాకుల వేసుకొని రోజు ఒకటి నుండి రెండు మారులు తినుచుండిన వారం రోజుల్లో ఉబ్బసం తగ్గిపోతుంది.
కడుపుబ్బరం :
ఒక గ్రాము సైంధవ లవణము, 5 గ్రాముల అల్లము కలిపి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం సేవిస్తే కడుపుబ్బరము శమించును.
కాలిన గాయములు :
నేరేడు ఆకులను మద్దగా నూరి 100 ర్గఆముల ముద్దను, 500 గ్రాముల ఆవాల నూనెలో వేయించి ఈ తైలమును కాలిన పుండ్లపై పూస్తుంటే అవి సులభంగా మానిపోతాయి.
కీళ్ళ నొప్పులు మరియు కీళ్ళ వాతము :
ా    నువ్వుల నూనె & నిమ్మరసం సమబాగములు కలిపి కీళ్ళపై మర్ధన చేయాలి.    
ా    వావిలి వేరు చూర్ణము ఒక ్గఆము, నువ్వుల నూనె రెండు గ్రాములు కలుపుకొని రోజుకు రెండు సార్ల తినుచుండిన కీళ్ళవాతము, నడుము నొప్పి తగ్గిపోవును.
ా    గొంతు బొంగురు మరియు గొంతు నొప్పి
ా    ఒకటి రెండు టీ స్పూనులు మంచి తేనెను గోరు వెచ్చని నీళ్ళలో కలుపుకొని రోజుకు మూడు, నాలుగు మారులు త్రాగుచుండిన గొంతు బొంగురు పోవుట, నొప్పి, గొంతు పూత హరించిపోవును.
ా    చలువ మిరియాలు నోట్లో వేసుకొని నములుతూ ఆ రసమును మింగుచుండిన బొంగురు  గొంతు పూత వ్యాధి హరించును.
ా    వావిలి చెట్టు వేరు చూర్ణము ఒక గ్రాము మాత్ర నువ్వుల నూనెలో కలిపి ప్రతి దినము సేవించుచున్నచో బొంగురు గంతు నశించుయేకాక కోకిల వంటి ధ్వని కలుగును
> ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

Read Full Post »

Older Posts »