Feeds:
Posts
Comments

Archive for April, 2013

History of Pochampally Hand-loom Designs, Nalgonda District.  

గ్రామీణ పర్యాటక కేంద్రం పోచంపల్లి
ఆచార్య వినోభాబావే 1951 ఏప్రిల్ 18న చేపట్టిన భూదానోద్యమంతో పోచంపల్లి భూదాన్‌పోచంపల్లిగా గెజిట్‌లోకి చేరింది. ప్రపంచంలో భూమి కోసం యుద్ధా లు, మారణహోమాలు జరిగినా.. ఒక్క బొట్టు రక్తం నేటరాలకుండా ఇక్కడ శ్రీకారం చుట్టిన భూదానోద్యమం దేశవ్యాప్తంగా సాగింది. ప్రపంచం ఆశ్చర్యపడేలా ఇక్కడి నేత కార్మికులు అగ్గిపెట్టెలో పట్టే చేనేత చీరను నేసి పోచంపల్లి ఖ్యాతిని మరోమారు ఇనుమడింపజేశారు. ప్రభు త్వం గ్రామీణ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.3.5కోట్లతో వినోబాబావే మందిర సమీపంలో గ్రా మీణ పర్యాటక కేంద్రాన్ని నెలకొల్పగా.. ఇటీవల రూ.6 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మించారు. తెలుగు సినిమాల షూటింగ్‌లకు కేంద్రంగా మారింది. హైదరాబాద్-సూర్యాపేట రహదారిపై కొత్తగూడెం స్టేజీ నుంచి భూదాన్‌పోచంపల్లి వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి బస్సులు ఉండగా.. చౌటుప్పల్ నుంచి రవాణా సౌకర్యాలున్నాయి. నల్లగొండకు 70 కి.మీ. దూరంలో ఉంది.

> ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.
 

Advertisements

Read Full Post »

History of Kolanupaka Jain Temple, Near Aler, Nalgonda District.

జైనుల పవిత్ర క్షేత్రం కొలనుపాక
రాష్ట్ర రాజధానికి 70కి.మీ.దూరంలో.. నల్లగొండకు 90 కి.మీ. ఆలేరు మండలం కొలనుపాకలో శైవ, వైష్ణవ, జైన మతాలకు చెందిన ప్రఖ్యాత సోమేశ్వర, వీరనారాయణస్వామి, జైన దేవాలయాలు, వివిధ కులాలకు చెందిన 21 మఠాలు ఉన్నాయి. 11, 12వ శతాబ్దంలో సోమేశ్వరాలయాన్ని కాకతీయులు నిర్మించారు. కోటిలింగాల గుడిగా పేరొందింది. దేశ నలుమూలల నుంచి పర్యాటకుల తాకిడి ఉంది. జైన, శైవ దేవాలయాలను కలుపుతూ రూ.75 లక్షలతో హెరి రోడ్డు నిర్మించారు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటుచేస్తే ఆలయ ప్రాంతాల్లో మరింత శోభ కలుగుతుంది. సోమేశ్వర ఆలయం, చుట్టూ మఠాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.75 లక్షలు మంజూరు చేయగా.. పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. చుట్టూ 3 కి.మీ. పరిధిలో వివిధ దేవాలయాలున్నాయి.

> ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

Read Full Post »

History of Bhuvanagiri Khilla at Bhuvanagiri, Nalgonda District. 

భువనగిరి ఖిల్లా..
రాష్ట్ర రాజధానికి 45 కి.మీ. దూరంలో.. నల్లగొండకు 65 కి.మీ. దూరంలో ఉన్న భువనగిరి ఖిల్లాకు ఎంతో చరిత్ర ఉంది. 12వ శతాబ్దంలో చాలుక్య వంశానికి చెందిన త్రిభువనమల్లా విక్రమాదిత్యుడు నిర్మించాడు. ఆయన పేరు మీదుగానే భువనగిరి ఏర్పడింది. కొండమీద 3వేల మెట్లు, 11 నీటి కొలనులున్నాయి. ఖిల్లాను చాలామంది రాజులు రాజధానిగా చేసుకొని పాలన సాగించారు. ఖిల్లా గోల్కొండను పోలి ఉంటుంది. కొలను, ఏకశిలలు, ఫిరంగులు, దైవ శిల్పా లు చెక్కారు. ఖిల్లా అభివృద్ధికి గతంలో రూ.కోటి నిధులు మంజూరయ్యాయి. ఖిల్లాపైకి రోప్‌వే, పైన హోటళ్లు, తోటలు అభివృద్ధి చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మాస్టర్‌ప్లాన్‌లో భువనగిరి ప్రాంతం కూడా చేరడంతో అన్ని రంగాల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందనుంది.

> ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

Read Full Post »

History of Nagulapadu Situated Near Surypaet, Penapahad Mandal, Nalgonda Dist.
నాగులపహాడ్ క(శి)ళా సంపద
మూసీనది ఒడ్డున, ఆమనగల్ కేంద్రంగా పాలించిన కాకతీయ సామంతులు కోటిడ్డి నామిడ్డి క్రీ.శ 1256 సంవత్సరంలో పెన్‌పహాడ్ మండల పరిధిలోని నారాయణగూడెం శివారులోని నాగులపహాడ్ దేవాలయాన్ని నిర్మించారు. అత్యుద్భుత శిల్పకళా నైపుణ్యాలతో రెండుదేవాలయాలు నిర్మించారు. కాటిడ్డి నామిడ్డి, ఐతిడ్డి తల్లి ఐతాంబికకు పుణ్యం చేకూర్చుకోవడానికి ఈ దేవాలయం నిర్మించినట్లు త్రికు ఆలయంలోని శాసనంలో లిఖించారు. రామాయణం, మహాభారతం తెలిపే కథలు చిత్రాలుగా శిల్పాలు, కాకతీయల శిల్పకల ఉట్టిపడేలా ఈ దేవాలయాలను ని ర్మించారు. సూర్యాపేట నుంచి 20 కి.మీ. దూరం ఉండగా.. నల్లగొండ నుంచి 70 కి.మీ. వస్తోంది. మిర్యాలగూడ వెళ్లే మార్గంలో ఉండగా.. ప్రైవేటు వాహనాల్లో వెళ్లాల్సి ఉంది.

> ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

Read Full Post »

History of Undrugonda Temple Near Suryapet, Nalgonda District. 

ఉండ్రుగొండ దేవాలయం
విజయవాడ-హైదరాబాద్ ప్రధాన రహదారిపై 3కి.మీ. దూరంలోని ఉండ్రుగొండ దేవాలయం క్రీ.శ 8,9 శతాబ్దాల్లో విష్ణుకుండినుల కాలంలో నిర్మించబడింది. ఇక్కడి శ్రీలక్ష్మీనరసింహ్మస్వామి 1200 ఏళ్ల పూర్వం నుంచి పూజలందుకోగా.. రాణిరువూదమ, శ్రీకృష్ణదేవరాయలు, గోల్కొండ నవాబులు ఖుతుబ్‌షా, అసబ్‌జాహీలు సేవించి తరించారని చర్రితకారులు చెబుతారు. 1372 ఎకరాల్లో విస్తరించిన ఎనిమిది కొండలను కలుపుతూ ప్రాకారాలు నిర్మించారు. ఎనిమిది గుట్టలను కలుపుతూ 14కి.మీ. దుర్గా ప్రాకారాలున్నాయి. ఏటా శ్రీలక్ష్మీనర్సింహ్మస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా వారం రోజుల పాటు నిర్వహిస్తారు. సూర్యాపేటకు 8కి.మీ. దూరంలో ఉండగా.. కొండ వరకు రోడ్డు నిర్మించారు. ప్రైవేటు వాహనాల్లో వెళ్లాల్సి ఉంటుంది. 

> ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

Read Full Post »

History of Phanigiri Buddhist Tourism Place Located at Phanigiri Near Tirumalagiri, Suryapet in Nalgonda District, Andhra Pradesh.

ప్రపంచ ప్రసిద్ధికెక్కిన ఫణిగిరి
తిరుమలగిరి నుంచి 8కి.మీ. దూరంలోని ఫణిగిరి బౌద్ధక్షేత్రానికి టిబెట్, చైనా, జపాన్, జర్మనీ తదితర దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. బుద్ధుడిపై పరిశోధనలు చేసే వివిధ వర్సిటీల విద్యార్థులు వస్తుంటారు. నిజాం కాలం(1944)లోనే తవ్వకాలు జరపాలని నిర్ణయించినప్పటికీ, 1970లో తవ్వకాలు మొదలవ గా.. 2011 మార్చిలో చేపట్టిన తవ్వకాల్లో 400 సంవత్సరాల చ రిత్ర ఉన్న ఆరు బౌద్ధ ఆరామాలు బయటపడ్డాయి. తవ్వకాల్లో 42 నాణేలు, 7వ రోమన్ చక్రవర్తి కాలంనాటి 7.3 గ్రాముల బరువు గల నా ణెం బయటపడింది. జయపురి (నాగార్జునకొండ)ని పాలించిన ఇక్షాకుల రాజు యహువుల శాంతమని పాలనకు చెందిన శాసనం లభించింది. క్రీ.శ.2వ శతాబ్దం నాటి బుద్ధుడి జాతక కథలు, చైతన్య రాతి స్తంభాలు, పాలరాతి విశ్రాంతి మందిరాలు, విగ్రహాలు, బ్రహ్మలిపిలో శిలాఫలకాలు, బౌద్ధ భిక్షువుల సమాధులు బయటపడ్డాయి. ఈ ప్రాచీన వారసత్వ సంపదను స్వీకరించి ఫణిగిరిలో ఒక గదిలో భద్రపరిచారు. 2011-12 సంత్సరంలో పురావస్తు శాఖ రూ.76 లక్షలతో గుట్టపై బౌద్ధక్షేత్రం చుట్టూ ముళ్ల కంచెను ఏర్పాటుచేశారు. ఫణిగిరి కొండపై మ్యూజియం ఏర్పాటుచేసి కొండకు భద్రత, రోడ్డు, బస్సు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఫణిగిరికి నల్లగొండ నుంచి నార్కట్‌పల్లి, ఆమ్మనబోలు మీదుగా వెళ్తే 75 కి.మీ., సూర్యాపేట మీదుగా వెళ్తే 80 కి.మీ. దూరం ఉంటుంది. సూర్యాపేట నుంచి జనగాం వెళ్లే బస్సుల్లో తిరుమలగిరి వెళ్లి.. ఫణిగిరి చేరుకోవచ్చు.

> ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

Read Full Post »

History of Pillalamarri Near Suryapet, Nalgonda District.

కాకతీయుల కళాదర్పణం పిల్లలమర్రి
హైదరాబాద్-విజయవాడ ప్రధాన రహదారిపై సూర్యాపేట మండలం పిల్లలమర్రి స్టేజీ నుంచి 3కి.మీ దూరంలో పిల్లలమర్రి దేవాలయాలున్నాయి. నల్లగొండ నుంచి 50కి.మీ. దూరంలో ఈ గ్రామం ఉంది. 9 శతాబ్దాల క్రితం కాకతీయులు నిర్మించిన అద్భుత శిల్ప కళా సంపద ఈ దేవాలయం. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా.. ఉత్తర, దక్షిణ ప్రాంతాల శిల్పకళ సంస్కృతుల సమ్మేళనంతో కొత్త తరహా శిల్పకళను ఇక్కడ ప్రవేశపెట్టిన ఘనత కాకతీయులకే దక్కుతుంది. నల్లని శిలలపై నగిషీ పనులు, పద్మాలు, నృత్య భంగిమలు, వాయిద్యకారులు, సుందరీమణులు, ద్వార బంధాలు, శిలాతోరణాలపై భాగవతచ రామాయణ సన్నివేశాలు చూపరులను కట్టిపడేస్తాయి. రజాకార్ల కాలంలో దాడులు జరిగినా ఈ దేవాలయం చెక్కుచెదరలేదు. 2010-11లో రూ.75 లక్షలతో ఆలయాన్నిఅభివృద్ధి చేశారు. నల్లగొండ నుంచి సూర్యాపేట వెళ్లి.. ప్రైవేటు వాహనాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు.

> ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.
 

Read Full Post »

« Newer Posts - Older Posts »