Feeds:
Posts
Comments

Archive for June, 2017

Ayyappa Songs, Bhajans in Telugu అయ్యప్ప స్వామి భజనలు

శబరిమలై వెళ్ళడానికి ముఖ్యముగా మూడు (3) మార్గములున్నాయి.
1. ఎరుమేలి మార్గం : ఇది అతి ప్రాచీనమైన మార్గం. ఇక్కడ నుండి శబరిమలైలో అయ్యప్ప ఆలయమునకు డెబ్భై కిలోమీటర్లు నడువ వలసి ఉంటుంది. కేరళలో పునలూరు, కొట్టయాం స్టేషన్లకి ఎరుమేలి సుమారు ఏభై కిలోమీట్ల దూరములో వుంటుంది. ఎరుమేలి చేరడానికి ాక్సీలు, వ్యానులు, బస్సులు విరివిగా క్టొాయాంలో లభిస్తాయి. విజయవాడ, హైదరాబాద్‌ల నుండి ట్రైన్‌లో క్టొయాం డైరెక్టుగా వెళ్ళవచ్చును. ఎరుమేలి మార్గము గుండా అడవిలో నడచి ప్రయాణం చేస్తే హరిహరసుతుడైన మణికంఠుడు వీరవిహారం చేసినట్లు పురాణగాధలలో చెప్పబడిన పుణ్యస్థలములన్నీ దర్శించవచ్చు. పురాతనమైన స్నానఘ్టాలలో స్నానము చేయవచ్చును. మోహినీసుతుడైన అయ్యప్పస్వామి ఈ మార్గముగుండానే పులిపాలకొరకు వెళ్ళినట్లు చెప్పుతారు. అందుచేత లక్షలాది అయ్యప్పలు ఎరుమేలిలో పేటతుళ్ళై (నృత్యం) సలిపి, ధర్మశాస్త్ర దర్శనం చేసికొని ఈ మార్గముగుండానే ప్రయాణం సాగిస్తారు. ఈ మార్గము జనవరి మాసములో పన్నెండు రోజులు మాత్రమే (జనవరి 1వ తేది నుండి 12వ తేది వరకు) తెరచి వుంటుంది. మిగతా మాసములలో ఈ మార్గము మూసి ఉంటుంది.
2. వండి పెరియారు మార్గము : తేని, కంభం దోవగుండా వెడితే వండి పెరియారులో గల శబరిమలై యాత్రలోని మొది తావళానికి సులువుగా చేరవచ్చు. ఇక్కడ నుండి సుమారు నలభైయైదు కిలోమీటర్లు పైగా నడిస్తే శబరిమలైలో అయ్యప్ప స్వామి దేవాలయమునకు చేరవచ్చు. (ఇప్పుడు ీ ఎస్టేట్సు ఉండడం వలన సుమారు ఇరువైఐదు కిలో మీటర్లు దూరము ప్రైవ్‌ే జీపులు వచ్చుచున్నవి) ీ ఎస్ట్‌ే నుండి సుమారు ఇరవై కిలోమీటర్లు నడచిన శబరిమలై చేరవచ్చును. ఇది చాలా కష్టతరమైన మార్గం. ఈ మార్గం గుండా పయనిస్తే హరిహరసుతుడైన ధర్మశాస్త్రలీలలు, స్వామి విహరించిన స్థలాలు, స్నానఘ్టాలలో స్నానం చేయడానికి వీలు కలుగదు. అందుచేత అయ్యప్పలు కొందరు ఈ మార్గాన్ని తిరుగు ప్రయాణమునకు మాత్రం ఉపయోగిస్తారు.
3. పంబ : కొట్టయాం నుండి పంబ సుమారు 120 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. కొట్టయాం నుండి బస్సులు, వ్యానులు, ాక్సీలు విరివిగా లభిస్తాయి. అయ్యప్పలు తొందరగా ఇల్లు చేరాలనుకొనేవారు. అనారోగ్యము చేత దూరము నడువలేనివారు, బాగా వయసు మళ్ళిన ముదుసలులు పంబవరకు బస్సులో వచ్చి, పవిత్ర పంబా నదిలో స్నానము చేసి (సద్ది వండుకు తినేవారు వండుకుని తిని) నీలిమల ద్వారా శబరిమల చేరుతారు. కఠోరదీక్షను అవలంబించిన అయ్యప్పలు ఈ మార్గము గుండా వెళ్ళడానికి ఇష్టపడరు. (ఎరుమేలి మార్గము గుండా నడచి వచ్చినవారు కూడా పంబ మీదుగా శబరిమలై చేరాలి) అన్ని విధములా కష్టభూయిష్టమైన శ్రేష్ఠమైన ఎరుమేలి మార్గము గుండానే లక్షలాది అయ్యప్పలు ప్రయాణం సాగిస్తారు. శబరిమలై వెళ్ళే అయ్యప్పలు కనీసం ఒకసారియైనా ముఖ్యంగా కన్ని అయ్యప్పలు ఎరుమేలి మార్గము ద్వారా పయనించటం చాలా మంచింది. శ్రేష్ఠము పంబ మార్గము నుండి అయ్యప్పలు ఎప్పుడైనా యాత్ర సాగించ వచ్చును. పంబ నుండి శబరిమలై సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం వుంటుంది.

ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

Ayyappa Songs, Bhajans in Telugu అయ్యప్ప స్వామి భజనలు

Ayyappa Swamy History in Telugu

Ayyappa Mala Dikshna Niyamalu in Telugu

 

Advertisements

Read Full Post »

Shanthi Mantras

శాంతి మంత్రములు
1. ఓం సర్వేభవంతు సుఖినః – సర్వే సంతు నీరామయాః
సర్వే భద్రాణి పశ్యస్తు – మా కశ్చి ద్దుఃఖ భాగ్భవేత్‌
2. ఓం పూర్ణ మదః పూర్ణ మిదం – పూర్ణాత్‌ పూర్ణ ముదచ్యతే
పూర్ణస్య పూర్ణ మాదాయ – పూర్ణమేవా వశిష్యతే
3. ఓం అసతోమా సద్గమయ – తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ – ఓం శాంతి శాంతి శాంతిః
4. ఓం సహనావవతు, సహనౌ భునక్తు – సహవీర్యం కరవావహై,
తేజస్వినా వధీత మస్తు, మా విద్విషావహై – ఓం శాంతి శాంతి శాంతిః
5. కాయేనవాచా మనసేంద్రియైర్వా – బుద్ద్యాత్మనావా ప్రకృతేః స్వభావత్‌
కరోమి యద్యత్‌ సకలం పరస్మై – నారాయణేతి సమర్పయామి.
6. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు – సర్వేషాం శాంతిర్భవతు
సర్వేజనా సుఖినో భవంతు – సమస్త సన్మంగళానిసంతు
7. ఓం కార బిందు సంయుక్తం – నిత్యం ధ్యాయంతి యోగినః
కామదం మోక్షదం తస్మై – ఓంకారాయ నమోనమః

Read Full Post »

Shiridi Sai Baba Words

Shiridi Sai Baba Ekadasa Sutralu in Telugu

shiridi_sai_baba_words.jpg

ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

Read Full Post »

బిల్వాష్టకమ్‌

shiva_bilvaastakam

త్రిదళం త్రిగుణాకారం| త్రినేత్రం చ త్రియాయుధం|
త్రి జన్మ పాప సంహారం| ఏక బిల్వం శివార్పణం|| 1

త్రిశాఖైః బిల్వపతైశ్చ అచ్ఛిద్రైః కోమలైశ్శుభైః
తవ పూజాం కరిష్యామి| ఏకబిల్వం శివార్పణం|| 2

కోి కన్యా మహాదానం| బిలపర్వత కోటయః |
కాంచనం శైల దానేనా| ఏక బిల్వం శివార్పణం|| 3

కాశిక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం||
ప్రయాగే మాధవం దుృష్ట్వ| ఏక బిల్వం శివార్పణం|| 4
ఇందు వారే వ్రతం స్థిత్వా| నిరాహోరో మహేశ్వర|
నక్తం హౌష్యామి దేవేశ| ఏక బిల్వం శివార్పణం|| 5

రామలింగ ప్రతిష్ఠాచ| వైవాహిక కృతం తధా|
తాకాది చ సంతానం| ఏక బిల్వం శివార్పణం|| 6

అఖండ బిల్వ పత్రం చ| ఆయుతం శివ పూజనం|
కుృతం నామ సహస్రేణ| ఏక బిల్వం శివార్పణం|| 7

ఉమ యా సహదేవేశా| నంది వాహన మేవచ|
భస్మ లేపన సర్వాంగం| ఏక బిల్వం శివార్పణం|| 8
సాల గ్రామేషు విప్రాణాం| తాకం థ కూపయోః|
యజ్ఞకోి సహస్రశ్చ| ఏకబిల్వం శివార్పణం|| 9

దంతికోి సహస్రేషు| అశ్వమేధ శత క్రతౌ|
కోి కన్యా మహాదానం| ఏకబిల్వం శివార్పణం|| 10

బిల్వానాం దర్శనం పుణ్యం| స్పర్శనం పాప నాశనం|
అఘోర పాప సంహారం| ఏక బిల్వం శివార్పణం|| 11

సహస్ర వేద పాఠేషు| బ్రహ్మస్థాపన ముచ్యతే|
అనేక వ్రత కోినాం| ఏక బిల్వం శివార్పణం|| 12

అన్నదాన సహస్రేషు| సహస్రోప నయనం తధా|
అనేక జన్మ పాపాని| ఏక బిల్వం శివార్పణం|| 13

బిల్వాష్టక మిదం పుణ్యం| యః పఠేత్‌ శ్చివ సన్నిధౌ|
శివలోక మవాప్నోతి| ఏక బిల్వం శివార్పణం|| 14

ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

Related Posts:

Lingaastakam లింగాష్టకమ్‌

Read Full Post »

లింగాష్టకమ్‌

shiva_lingaastakam

బ్రహ్మ మురారి సురార్చిత లింగం | నిర్మల భాసిత శోభిత లింగం||
జన్మజ దుఃఖ వినాశక లింగం| తత్‌ ప్రణమామి సదాశివ లింగం||

దేవముని ప్రవరార్చిత లింగం | కామదహన కరుణాకర లింగం||
రావణ దర్ప వినాశక లింగం | తత్‌ ప్రణమామి సదాశివ లింగం||

సర్వసుగంధ సులేపిత లింగం | బుద్దివివద్ధన కారణ లింగం||
సిద్ధ సురాసుర వందిత లింగం | తత్‌ ప్రణమామి సదాశివ లింగం||

కనక మహామణి భూషిత లింగం | ఫణిపతివేష్టిత శోభిత లింగం||
దక్షసుయజ్ఞ వినాశన లింగం | తత్‌ ప్రణమామి సదాశివ లింగం||

కుంకుమ చందన లేపిత లింగం | పంకజ హార సుశోభిత లింగం||
సంచిత పాప వినాశన లింగం | తత్‌ ప్రణమామి సదాశివ లింగం||

దేవ గణార్చిత సేవిత లింగం | భావైర్భక్తి భిరేవచ లింగం||
దినకర కోి ప్రభాకర లింగం | తత్‌ ప్రణమామి సదాశివ లింగం||

అష్టదళోపరి వేష్ఠిత లింగం | సర్వ సముద్భవ కారణ లింగం||
అష్టదరిద్య వినాశన లింగం | తత్‌ ప్రణమామి సదాశివ లింగం||

సురగురు సురవర పూజిత లింగం| సురవనపుష్ప సదార్చిత లింగం||
పరమ పదం పరమాత్మక లింగం|| తత్‌ ప్రణమామి సదాశివ లింగం||

లింగాష్టక మిదం పుణ్యం యః పఠే శ్చివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే||

ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

Related Posts:

Bilvaastakam బిల్వాష్టకమ్‌

Read Full Post »

శ్రీ లక్ష్మీఅష్టోత్తర శతనామావళిః
ప్రతి నామమునకు ముందు ‘ఓం’ ను చివర నమః చేర్చవలయును.

ఓం ప్రకృత్యై నమః
వికృత్యై
విద్యాయై
సర్వభూతహిత ప్రదాయై
శ్రద్దాయై
విభూత్యై
సురభ్యై
పరమాత్మికాయై
వాచ్యై
పద్మాలయాయై
పద్మాయై
శుచ్యై
స్వాహాయై
స్వధాయై
సుధాయై
ధన్యాయై
హిరణ్మయై
లక్ష్మ్యై
నిత్యపుష్టాయై
విభావర్యై
అదిత్యై
దిత్యై
దీప్తాయై
వసుదాయై
వసుధారిణ్యై
కమలాయై
కాంతాయై
కామాక్ష్యై
క్రోధసంభవాయై
అనుగ్రహప్రదాయై
బుద్ద్యై
అనఘాయై
హరివల్లభాయై
అశోకాయై
అమృతాయై
దీప్తాయై
లోకశోకవినాశిన్యై
ధర్మనిలయాయై
కరుణాయై
లోకమాత్రే
పద్మప్రియాయై
పద్మహస్తాయై
పద్మాక్ష్యై
పద్మసుందర్యై
పద్మోద్భవాయై
పద్మముఖ్యై
పద్మనాభప్రీయాయై
రమాయై
పద్మమాలాధరాయై
దేవ్యై
పద్మిన్యై
పద్మగంధిన్యై
పుణ్యగంధిన్యై
సుప్రసన్నాయై
ప్రసాదాభిముఖ్యై
ప్రభాయై
చంద్రవదనాయై
చంద్రాయై
చంద్రసహోదర్యై
చతుర్భుజాయై
చంద్రరూపాయై
ఇందిరాయై
ఇందుశీతలాయై
ఆహ్లాదజనన్యై
పుష్ట్యై
శివాయై
శివకర్యై
సత్యై
విమలాయై
విశ్వజనన్యై
పుష్ట్యై
దారిద్య్రనాశిన్యై
ప్రీతిపుష్కరిణ్యై
శాంతాయై
శుక్లమాల్యాంబరాయై
శ్రియై
భాస్కర్యై
బిల్వనిలయామై
వరారోహాయై
యశస్విన్యై
వసుంధరాయై
ఉదారాంగాయై
హరిణ్యై
హేమమాలిన్యై
ధనధాన్యకర్యై
సిద్ద్యై
స్రైణసౌమ్యాయై
శుభప్రదాయై
నృపవేశ్మగతానందాయై
వరలక్ష్యై
వసుప్రదాయై
శుభాయై
హిరణ్యప్రాకారాయై
సముద్రతనయాయై
వరలక్ష్యై
వసుప్రదాయై
శుభాయై
హిరణ్యప్రాకారాయై
సముద్రతనయాయై
జయాయై
మంగళాదేవ్యై
విష్ణువక్షస్ధల స్ధితాయై
విష్ణుపత్న్యై
ప్రసన్నాక్ష్యై
నారాయణ సమాశ్రితాయై
దారిద్య్రధ్వంసిన్యై
దేవ్యై
సర్వోపద్రవవారిణ్యై
నవదుర్గాయై
మహాకాళ్యై
బ్రహ్మవిష్ణు శివాత్మికాయై
త్రికాలజ్ఞాన సంపన్నాయై
భువనేశ్వర్యై                            108.

ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

Read Full Post »

శ్రీ అయ్యప్ప స్వామి వారి చరిత్ర

Ayyappa Swamy అత్రి మహర్షికి అనసూయాదేవికి మూడు మూర్తుల ప్రసాదమే శ్రీ దత్తాత్రేయ మహర్షి. అలాగే ముగ్గురు వాణీ-భవానీ-శ్రీలకక్ష్ములు అంశతో జన్మమందిన లీలావతీదేవి దత్తాత్రేయునికి పట్టపురాణి అయింది. లీలావతి తన భర్త చెప్పిన అవతారాంతమందు ఆయా అంశలలో లయమవదుమను మాట పాించలేదు. తనకు మానవసుఖభోగ భోగ్యాలలో తనివి తీరలేదని, అందువలన అలా కొంతకాలము యిలా పట్టపురాణిగానే ఉండాలనీ, తన భర్తను లీలావతీ దేవి కోరింది. అందుకు దత్త్రాత్రేయుడు కోపోద్రేకముతో ‘నీవు మహిషివై జన్మింతువుగాక” అని శాపమిచ్చాడు. దాంతో లీలావతి దత్తాత్రేయుని జూచి ”నీవు గూడా మహిషమువై నాతే క్రీడింతువు గాక” అని ప్రతిశాపమిచ్చింది.

శాపంతో లీలావతీదేవి మహిషి రూపాన పూర్వ స్మృతిలేక దుర్మార్ఘ వృత్తితో లోకాలన్నింనీ బాధించుచుండెను. మహేంద్రాది దేవతలు ఆ బాధలకు తాళలేక త్రిమూర్తులతో ఆలోచించి వారి ముగ్గురు అంశలతో ఒక అందమైన మహిషాన్ని సృజించి పంపారు. మహిషి ఎంతో అందచందాలొలికే మహిషాన్ని జూచి పొంగిపోయింది. మహిషము మాత్రం తానెందుకు వచ్చిందో ఆ కార్యం సఫలమయిన వెంటనే తనతేజో రూపాన్ని దాల్చి అహంశలతో లీనమయింది. మహిషి మహేంద్రాదులు మాయపన్నాగం తెలిసికొని ఎంతో బాధపడింది. తుదకు బ్రహ్మదేవుని గూర్చి ఘోరమైన తపస్సుగావింప వాణీపతి ప్రత్యక్షమై కోరమన నాకు చావులేని వరమిమ్మని మహిషి బ్రహ్మను కోరింది.

తనకు ఆ వరం ఇవ్వడం సాధ్యముగాదని బ్రహ్మచెప్పాడు. మహిషి బాగా, ఆలోచించి ”బ్రహ్మదేవా! పోనీ అయోనిజుడా, యిద్దరు దివ్య పురుషులకు ఉద్బవించినవాడూ, ద్వాథాబ్దాలు (12 సం.) ఒక మానవాదిని యింట పెరిగిన వానిచేత మారకం కలిగిన అటువిం వారిచేతనే చంపమని మహిషి కోరింది. బ్రహ్మ ఆ వరాన్నే ఆమెకు ప్రసాదించాడు.

ఇక బ్రహ్మదేవుని వరబలగర్వంతో యెంతో మితిమీరిన మహిషి పదునాలుగు లోకాలూ బాధించడం ప్రారంభించింది. యీ బాధలు భరించలేని మహేంద్రాది దేవతలూ, త్రిమూర్తులు బాగా ఆలోచించారు. గాని అంథకు చిక్కలేదు. క్షీరసముద్రమదన సమయాన శ్రీ మహావిష్ణువు జగన్మోహినిగా రూపాన్ని ధరించాడు. అప్పుడు పరమశివుడు చలించగ వారిరువుకూ భైరవుడు జన్మిచడం, వికృత రూపాభయంకరుడైన భైరవుడు
విఘ్నేశ్వరుని సందర్శనము వలన యెంతో సౌందర్యముగల బాలుడయ్యాడు. మహిషిని చంపి శాపనివృత్తికిగాను ధర్మశాస్తను పసికందుగా చేసి అతని గళసీమలో దివ్యమణిమాల నుంచి ఆ పసిబాలుని ”పందళరాజ్య” సమీపాన విడిచారు. పందళరాజ చంద్రుడు వేటకై వెళ్ళగా ఏడుస్తున్న ఆ శిశువును జూచాడు. తానుసంతాన హీనముతో చింతింపగా భగవానుడే యీ పసిపాపను నాకిచ్చాడని పందళరాజా ఆనంద సాగరములో మునిగి తేలాడు. అతనినిగొని తన నగరికి వచ్చాడు. ఆ బాలునకు దివ్యపురుషుడైన అగస్థ్యమహర్షి ”మణిమాలచే లభించినవాడు కాబ్టి” మణికంఠుడని, నామకరణం చేసేను.

పందళ రాజ్యానికి సమీపమున ఘోరారణ్యం కలదు. అచ్చట బందిపోటు దొంగ ఆ రాజ్య ప్రజలను ఘోరాతి ఘోరంగా బాధిస్తున్నాడు. రాజుతో మొరపెట్ట రాజు తన సేనను పంపనుండగా మణికంటుడు తానేవెళ్ళి వాడిని హతమార్చిరాగలనని రాజుతో జెప్పాడు. మణికంఠుడు తల్లిదండ్రులెంత చెప్పినా వినక ఒంటరిగా ఆ అరణ్యానికి పోయాడు. మణికంఠుని జూచిన ఆ బందిపోటు దొంగవచ్చి అతని పాదాలపైబడి శరణువేడగా మణికంఠుడు అతని ఆశీర్వదించి ”ఓయీ! యీ రోజునుండియు నీవు నాకత్యంతాప్తమిత్రుడవు, అందువలన నాభక్తులగు వీరి ఘోరారణ్యమార్గాన నాదర్శనానికి వచ్చిన వారికి అత్యంత సహకారంతో వారలను రక్షించు భద్రత చేపట్టుమని ఆ దొంగకు మణికంఠుడు వరమిచ్చాడు.

పందళరాజు మంత్రి మణికంటుని దివ్యప్రతిభా కీర్తులను జూచి ఓర్వలేక మహారాణి సహాయంతో విషప్రయోగం చేసి విఫలమయ్యాడు. మహారాజు మణికంటునికి సామాజ్య్ర ప్టాభిషేకమొనరింప నిర్ణయించాడు. మహామంత్రికి యే మాత్రమూ యిష్టములేదు. అందువలన ఎలాగో మణికంఠుని చంపాలి. అందుకు ఒక పథకం పన్నాడు. శ్రీరాణీగారి ప్రోత్సాహంతో ఆమెకు శిరోవేదన కలిగినట్లూ, దానిని మాన్పుటకు ఏ మందులూ పనిచేయవనీ, పెద్దపులి పాలతో తయారుగావింపబడిన మందుచేతనే తలనొప్పి తగ్గుతుందనీ మణికంఠునికి మహామంత్రి మహారాణీ గురుముఖంగా చెప్పించారు. త్రిలోక విజేతైన మణికంఠుడు పరమానందముతో ”యింతకన్నా మా తల్లికి తగిన సేవ యేముండునని” ఒప్పుకొన్నాడు.

మణికంఠుడు అరణ్యానికి వెళ్లాఢు. మహారాజుకు మణికంఠుడన్న పంచప్రాణాలకన్నా మిన్న అందువలన రాజు అతని పూజకు వలయ సామాగ్రి ఒకవైపునా, రెండవ వైపునా మధుర పదార్ధలతనికి తినుటకు ”యిరుముడి” క్టి అతని శిరముపై ఉంచాడు.

మణికంఠుడు అరణ్యంలో ప్రవేశించాడు. అతని కొరకు ఆ ఘోరాణ్యంలో ఎదురు తెన్నులు చూచుచున్న బ్రహ్మ మహేంద్రాది దేవతలందరూ శ్రీ మణికంఠుని కలసి అతని అవతార విషయమునూ, మహిషి వలన సర్వలోకాలకూ కలుగుచున్న ఘోరమైన బాధలను వివరించారు. అప్పుడు మణికంఠుడు ప్రసన్న భావముతో వారి కష్టాలు తీరుస్తానని మా యిచ్చాడు. దేవలోకం చేరి మహేంద్రుని చింతామణీ పీఠాన్ని ఆక్రమించి మహిషితో యుద్దం చేయగా దాని కంఠం నుంచి స్రవించిన ప్రతి రక్తబిందువూ ఒక మహిషిగా అవతరించుట చూచి దాని కుత్తుక నులిమి మణికంఠుడు మహిషిని చంపాడు, దాని కళేబరాన్ని విసరవేయగా, అది భూమిపై బడగా ఆ స్ధలం ”అళుదామేడు” గా పెరుగజొచ్చెను. మణికంఠుడు దానిపై ఒక పెద్ద బండను పడవేసి పెరుగకుండా చేసెను. ఆ మహిషి కన్నీి ధారయే ”అళుదానది” గా ప్రవహింప సాగింది.

మహిషి శాపము పోగా లీలావతిదేవిగా రూపాన్ని దాల్చింది. ఆమె తనను దేవేరిగా స్వీకరింపమని మణికంఠుని ప్రార్ధించింది. మణికంఠుడప్పుడు లీలావతి జూతి ”ఓ కాంతారత్నమా! ప్రస్తుతము నా అవతారము బ్రహ్మచర్య దీక్షాయుత ధర్మశాస్త అవతరాం, నా దర్శనానికి యీ కొండకు ఎప్పుడు కన్నె సాములు (నూతన భక్తులు) రారో ఆ దినం తప్పక నీవు కోరిన కోర్కె నెరవేర్చగలను. అంతేకాదు యీ కొండకు నీ దర్శనానికి వచ్చే భక్తులు మహిషి చర్మమును అనగా దానికి బదులు యేదైనా ధరించాలి. నీవు కూడా నాతో సరిసమానంగా భక్తుల అర్చనలు అందుకోగలవు” అని మహిషికి వరమిచ్చాడు. శ్రీ రామావతరామున యిచ్చినమాట ప్రకారంగా శబరికి మహత్తర మోక్షాన్ని ప్రసాదించాడు మణికంఠుడు. పులిపై స్వారిచేయుచూ మణికంఠుడు వచ్చుచుండుట ప్రజలందరూ, భయం, ఆశ్చర్యంతో మహారాజు దగ్గరకేగి పరుగు పరుగున మణికంఠుని రాకను విన్నవించారు. మహారాణీ – మహామంత్రీ తాముగా తెలియక గావించిన తప్పులు మన్నింపమని మణికంఠుని వేడుకొన్నారు. మహారాజానందనవనంలో అయింది. యికనేను తపోదీక్ష వహించాలని రాజదంపతులను ప్రాధేయముతో కోరాడు.

కాని మహారాజు మాత్రం ఒప్పుకోలేదు. అప్పుడు మణికంఠుడు మహారాజును చూచి ”తనను దర్శించే భక్తులకు బ్రహ్మచర్య దీక్షతో సమున్నత నియమవ్రతాలను తెల్పి పూర్వం పరశురామునిచే నిర్మింపబడిన ఈ గిరిపై ఆలయము తనకు నిర్మింపమనీ ప్రతి సంవత్సర మకర సంక్రమణ సమయమున ”దివ్యజ్యోతి” రూపంలో దర్శనమీయగలననీ చెప్పి తపోభూమికి మణికంఠుడేగెను.
”స్వామియే శరణం అయ్యప్ప”

ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

అయ్యప్ప స్వామి భజనలు

Read Full Post »