Feeds:
Posts
Comments

Archive for July, 2017

navaghraha slokas

నవగ్రహములు
ఆరోగ్యము కొరకు, కార్యసిద్ధికి, సుఖసంతోషములకు, దారిద్య్ర బాధలు తొలగుట కొరకు                                నవగ్రహములను పూజించుట చాలా ఉత్తమం.
1. సూర్య          శ్లో|| ద్విభుజం పద్యహస్తంచ వరదం మకుాన్వితమ్‌
ద్యాయేద్ధి వాకరం దేవం సర్వాభీష్టఫలప్రదమ్‌
2. చంద్రుడు      శ్లో|| గధాదర ధరం దేవమ్‌ శ్వేత వర్ణనిశాకమ్‌
                               థ్యామేదమృత సంభూతమ్‌ సర్వకాయ ఫలప్రదమ్‌
3. కుజుడు        శ్లో|| రక్తమాల్యాంబరధం హేమ రూపం చతుర్భుజం
                              శక్తి శూలం గదా పద్మం ధారాయంతం కరాంబుజై
4. బుధుడు      శ్లో|| సింహరూఢం చతుర్భుజం ఖడ్గచర్మ గదాధరం
                              సోమపుత్రుం మహాసేమ్యం ధ్యాయేత్పరార్ధ సిద్ధిదం
5. గురుడు       శ్లో|| వరాక్ష మాలాదండం కమండలధరం విభుం
                              పుష్యరాగాంకితం పీతం వరదం భావమే గురుం
6. శుక్రుడు      శ్లో|| జిలం చాక్ష సూత్రం చ వరదండ కమండం
                             శ్వేత వస్త్రాంచ శుక్రం ధ్యాయేద్ధానవ పూజితం
7. శని            శ్లో|| నీలాంబరో నీలవపుః కిరీి గృధస్థిత స్థాపరోధను
                             చతుర్భుజం సూర్య సుతః ప్రన్నః దదాతమ్యం వరవ
8. రాహువు    శ్లో|| కరాళవదనం, ఖడ్గం చర్మశూల వరాన్వితం
                             నీల సింహాసనాస్ధం చద్యాయే దాహం ప్రశాంతయే
9. కేతువు      శ్లో|| ధూమ్రవర్ణం ద్విబాహంచ కేతుంచ వికృతాననం
                            ధ్వజానన గతం నిత్యం థ్యాయేత్సర్వ ఫలాప్తయే.

ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

Advertisements

Read Full Post »

శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళిః

durga_astotharam
ప్రతి నామమునకు ముందు ‘ఓం’ ను చివర నమః చేర్చవలయును.
ఓం దుర్గాయై నమః
శివాయై
మహ్యాలక్ష్మ్యై
మహాగౌర్యై
చండికాయై
సర్వజ్ఞాయై
సర్వలోకేశ్యై
సర్వకర్మఫలప్రదాయై
సర్వతీర్ధమమాయై
పుణ్యాయై
దేవయోనయే
ఆయోనిజాయై
భూమిజాయై
నిర్గుణాయై
ఆధారశక్త్యై
అనీశ్వర్యై
నిర్గుణాయై
నిరహంకారాయై
సర్వగర్వవిమర్దిన్యై
సర్వలోకప్రియాయై
వాణ్యై
సర్వవిద్యాధిదేవతాయై
పార్వత్యై
దేవమాత్రై
వనీశ్యై
వింధ్వవాసిన్యై
తేజోవత్యై
మహామాత్రే
కోిసూర్యసమప్రభాయై
దేవతాయై
వహ్నిరూపాయై
సతేజసే
వర్ణరూపిణ్యై
గుణాశ్రయాయై
గుణమధ్యాయై
గుణత్రయవివర్జితాయై
కర్మజ్ఞానప్రదాయై
కాంతాయై
సర్వసంహారకారిణ్యై
ధర్మజ్ఞానాయై
ధర్మనిష్ఠాయై
సర్వకర్మవివర్జితాయై
కామాక్ష్యై
కామాసంహంత్య్రై
కామక్రోధ వివర్జితాయై
శాంకర్యై
శాంభవ్యై
శాంతయై
చంద్రసూర్యాగ్నిలోచనాయై
సుజయాయై
జయాయై
భూమిష్టాయై
జాహ్నవ్యై
జనపూజితాయై
శాస్త్రాయై
శాస్త్రమయాయై
నిత్యాయై
శుభాయై
చంద్రార్ధమస్తకాయై
భారత్యై
భ్రామర్యై
కల్పాయై
కరాళ్యై
కృష్ణపింగళాయై
బ్రాహ్మై
నారాయణ్యై
రౌద్య్రై
చంద్రమృతపరిసృతాయై
జ్యేష్టాయై
ఇందిరాయై
మహామాయాయై
జగత్సృష్ట్యధికారిణ్యై
బ్రహ్మండకోి సంస్థానాయ్యై
కామిన్యై
కమలాలయాయై
కాత్యాయన్యై
కలాతీతాయై
కాలసంహారకారిణ్యై
యోగనిష్టాయై
యోగిగమ్యాయై
తపస్విన్యై
జ్ఞానరూపాయై
నిరాకారాయై
భక్తాభీష్టఫలప్రదాయై
భూతాత్మికాయై
భూతమాత్రే
భూతేశాయై
భూతధారిణ్యై
స్వధానారీమధ్యగతాయై
షడాధారాధివర్ధిన్యై
మోహితాయై
శుభాయై
శుభ్రాయై
సూక్ష్మాయై
మాత్రాయై
నిరాలసాయై
నిమగ్నాయై
నీలసంకాశాయై
నిత్యానందాయై
హారాయై
పరాయై
సర్వజ్ఞానప్రదాయై
ఆనందాయై
సత్యాయై
దుర్గభరూపిణ్యై
సరస్వత్యై
సర్వగతాయై
సర్వాభీష్ట
ప్రదాయిన్యై నమః  108.

ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

Lakshmi Astora Sathanamavali in Telugu

 

 

Read Full Post »

శ్రీ మద్భగవద్గీతా
షష్ఠో- ధ్యాయః ఆత్మసంయమయోగః
ధ్యానయోగము / అభ్యాసయోగము / ఆత్మసంయమ యోగము / ఆత్మయోగము

శ్రీ భగవానువాచః :

శ్లో||    అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మకరోతి యః |
స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిః న చా క్రియః ||        1

సన్న్యాసము, యదార్ధ యోగము యివి ధ్యానము మీద ఆధారపడి వుంటాయి.
చిత్తము శుద్దిని బొందినను, ధ్యానము లేకున్నచో, కేవలము సన్న్యాసము చేతనే, ముక్తి లభింపదు. కావున ధ్యానయోగము బోధింపబడుచున్నది.
సాధారాణ తాత్పర్యము :
(శ్రీ భగవాన్‌) శ్రీకృషుడు (ఉవాచ) ఇట్లు పలికెను. (కర్మఫలమ్‌) కర్మఫలమును (అనాశ్రితః) ఆశింపనివాడై / అపేక్షింపనివాడై (కార్యం కర్మం) ఆవశ్యకర్తవ్యములుగ విధింపబడిన నిత్య, నైమిత్తిక కర్మలను (యః) ఎవడు (కరోతి) ఒనర్చునో / ధ్యాన యోగాంగముగ ఆచరించునో (సః) అతడే (సన్న్యాసీ) సన్న్యాసియును, (యోగీచ) మరియు యోగియును అగుచున్నాడు (ననిరగ్నిః) అంతేగాని అగ్ని సాధ్యములగు ”ఇష్టా నామక యజ్ఞయాగాది వైదిక కర్మలను త్యంజిచువాడును, (నచ అక్రియః) అలాగే అగ్న్యపేక్ష లేని ”పూర్త” నామక తటాక నిర్మాణాది వైదిక కర్మలను త్యజించువాడు, ”దత్త”నామక తపోదానాది వైదిక కర్మలను త్యజించువాడును కాదు. అట్టివాడు సన్న్యాసియును గాదు. యోగియును కాదు.
రహస్యార్ధము :
కార్యమ్‌      : బాధ్యతాయుత చర్యలు
కర్మ      : ధ్యాన సంబంధ చర్యలు
నిరగ్ని :
సర్వసంగపరిత్యాగియైన సన్న్యాసి విషయంలో నిజమైన భక్తుడు తన వ్యక్తి వాంఛలను, కామ/మోహ ప్రకోపములను, యిష్టాయిష్టములను, సుఖ దుఃఖములను ”సర్వసంగపరిత్యాగము” అనే యజ్ఞాగ్ని జ్వాలలో ఆహుతి చేస్తాడు. ”నిరగ్ని” అంటే అలాటి అగ్ని సంస్కారం లేకుండ అని.
యోగి విషయంలో :
నిజమైన యోగి తన కోరికలను ”ధ్యాన-ప్రేరిత జ్ఞానము” అనే ఆంతరంగిక యజ్ఞాగ్ని జ్యాలలలో ఆహుతిచేసి అతని ”ఎకాగ్రతా జ్వాల” ను పరమాత్మ యొక్క ”ద్వివ్య జ్వాల”లో ఏకం చేస్తాడు. ”నిరగ్ని” అంటే అలాటి అగ్ని సంస్కారం లేకుండా.
సన్న్యాసి – యోగి :
పారవశ్యముతో కూడిన ధ్యానము అనే ఆంతరంగిక అగ్ని సంస్కారము ద్వారా ”ఆత్మాగ్ని” కణాన్ని ”విశ్వజ్యోతి” లో కలిపేసి భగవంతుని ప్రీతి కొరకు దివ్యనాటకములో ప్రతిదినము తన పాత్రను నిర్వర్తించే భక్తుడే పరమాత్మలో ఐక్యమైన యోగి. ఆ భక్తుడే తన వ్యక్తిగతమైన కోరికలను విడనాడి సదసద్వివేకముతో తన బాధ్యతాయుత చర్యలను  నిర్వర్తిస్తాడు. కావున అతడు సన్న్యాసి కూడ.
”సన్న్యాసము” అనే పదాన్ని ”సంగ పరిత్యాగము” లేక ”ఆశ్రమవాసము” అని రెండు అర్ధాలతో ఉపయోగిస్తారు. యోగుల యొక్క మరియు సన్న్యాసుల యొక్క మార్గము అడవులలోకి పారిపోవటం కాదని, తమ బాధ్యతాయుత భౌతిక కర్మలను, ఆధ్యాత్మిక కర్మలను అపేక్షా రహితంగా నిర్వర్తించే జీవితము అని యీ శ్లోకములలో బోధింపబడింది.
ఈ శ్లోకములో ”కార్యము” అంటే మనిషికి బాధ్యత అయిన ప్రతి పని కార్యమే. ప్రతి మనిషి తన భౌతిక జీవితము, శరీరము మనసు హృదయ శ్రేష్ఠత, ఆత్మధర్మము వీటన్నిటినీ ఏకలయలో/ సమస్పందనలో నిలిపే పనులే చేయాలి. అయిటే యిక్కడొక సందేహం వస్తుంది. భగవంతుడు తనకు నిర్దేశించిన విధులేవియని ఒక వ్యక్తి ఎలా కనిపెట్టగలడు? దీనికి సమాధానం తన గురువును ప్రశ్నించి రాబట్టుకోవచ్చు. ఒక వేళ ఏకారణము చేతనయినా సమాధానమివ్వడానికి గురువు నిరాకరిస్తే విద్యార్ధి ప్రగాఢ ధ్యానంలో భగవంతుడినే అడుగవచ్చు. అప్పుడు విద్యార్ధి యొక్క అంతర్‌ జ్ఞానాన్ని మేల్కొలిపి దాని ద్వారా భగవంతుడు సమాధానము యిప్పిస్తాడు.
ఈ శ్లోకములో ”కర్మ” అంటే బాధ్యతాయుత చర్యగా భావించి ధ్యానం చేయడమే. ధ్యానానికి సంబంధించిన చర్యలన్నీ కర్మలే. వైజ్ఞానికంగా కర్మ భూమి నుండి ద్యాసను ఉపసంహరించి అంతరాత్మపై లగ్నము చేయడానికి ఉపయోగించే సాంకేతిక యోగ ప్రకియలన్నీ కర్మలే. అట్టి ధ్యాసకే భగవదనుసంధాన్ని అనుభవించే సామర్ధ్యము ఉంటుంది. భగవదను సంధానము కొరకు యీ ప్రక్రియలను ఆచరించే భక్తుడే యోగి.
ఏ చెట్టు క్రిందో సోమరిగా కూర్చుని వేదాంత పరిశీలన జరుపుతూ, యింద్రియ స్వస్ధత చేకూర్చే ప్రకృతి అందాలను శ్లాఘిస్తూ కాలక్షేపం చేసేవాడు ”కపటయోగి”. మతసంబంధమైన బద్దకపు పరివ్రాజకులు/బికక్షుకులు కాశీ వంటి పుణ్యక్షేత్రాలలో వేల సంఖ్యలో కనపడే వీరు ”యోగులు” కాదు. బాధ్యతాయుతమైన కర్మలను, సేవాపరమైన కర్మలను పరిత్యజించడం వలన, పవిత్రత ఉత్పత్తి కాదు సరికదా ”పనికి మాలినతనం” ఉత్పన్నమవుతుంది.
భగవంతుని పొందడానికి చేసే ధ్యానకర్మలు ఫలాపేక్షతో చేసినవిగా పరిగణింపబడవు. అందువలన కర్మబంధము ఏర్పడదు. భక్తుడు కేవలం భగవంతుని కొరకే భగవంతుని చేరాలనే దృష్టితోనే చేస్తాడు. ఫలాపేక్ష భక్తునికి లేకపోయినా మోక్షమనే ఫలాన్ని భగవంతుడే అందిస్తాడు. ”యోగి-సన్న్యాసి” అయిన వానికి భగవంతుని పట్ల ఎంత ప్రేమ ఉంటుందో అంతే ప్రేమ భగవంతునిచే నిర్ధేశింపబడిన భౌతిక కర్మల పట్ల కూడ ఉంటుంది. ఆయన తన భౌతిక కర్మలను, (ఆధ్యాత్మిక) ధ్యాన కర్మలను కేవలం ఆనందంతోను, నిరపేక్షతోను తాను ప్రేమించే భగవంతుని కొరకే చేస్తాడు.

శ్లో||    యం సన్న్యాస మితి ప్రాహుః యోగం తం విద్ధిపాణ్డవ||
న హ్య సన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన||            2

సాధారణార్ధ తాత్పర్యములు :
(పాండవ) అర్జునా, (యం) ఎద్దానిని పెద్దలు (సన్న్యాసమౌ ఇతి) సన్న్యాసమని (ప్రాహుః) చెప్పిరో (తం) దానిని (యోగమ్‌) నిష్కామ కర్మానుష్ఠాన యోగముగ (విద్ది) గ్రహింపుము (హి) ఏలయన (అసన్న్యస్త -సంకల్పః) కర్మ నిష్ఠయందుగాని, లేక జ్ఞాననిష్ఠ యందు గాని ఫలసంకల్ప త్యాగి కాని వాడు (కశ్చన) ఎవ్వడును (యోగీ) యోగి (నభవతి) కాజాలడు.
కర్మనిష్ఠయందు గాని, జ్ఞాన నిష్ఠయందు గాని ఫలసంకల్ప త్యాగము వలన సన్న్యాసియును మరియు యోగియును అగుచున్నాడు. ఫలత్యాగము వలన సన్న్యాసి, సంకల్ప త్యాగము వలన చిత్తవిక్షేపము లేని వాడై యోగియగుచున్నాడు
అట్లగుచోయావజ్జీవితము కర్మయొనర్పవలసిందేనా అని సందేహము కలుగుతుంది. దానికి సమాధానము తదుపరి శ్లోకములో చెప్పబడింది.
రహస్యార్ధము :
సర్వసంగపరిత్యాగి ఐన ”సన్న్యాసి” పరమాత్మ దర్శనం కోసం ముఖ్యంగా అన్ని భౌతిక, మానసిక అవరోధాలను (ప్రాపంచిక బంధాలు, స్వార్ధభరిత వాంఛలు) వదిలించకోవడం పై దృష్ఠి నిలుపుతాడు. అదే యోగి అయితే ఆత్మ దర్శనం కొరకు ఏదేని వైజ్ఞానిక ప్రక్రియను అనుసరిస్తాడు. యోగి పరమాత్మ  యొక్క పరమానందాన్ని రుచి చూడటం వల్ల కేవలం దానిని మాత్రమే అనుభవించేందుకు అంతకంటే తక్కువస్ధాయి సంతోషాలను అప్రయత్నంగానే వదిలేస్తాడు. సన్న్యాసి భగవంతునితో ఐక్యత కొరకు తనను తాను సిద్ధం చేసుకోవడానికి విచక్షణ ద్వారా అన్ని భౌతిక వాంఛలను అక్రమ చర్యలను పరిత్యజిస్తాడు.    రెండు మార్గాలూ ఒకే గమ్యానికి చేరుస్తాయి. కాని సన్న్యాసికైనా యోగికైనా అట్టి గమ్యసాధనకు బాహ్యచర్యలపై ఆధిపత్యం సాధించడమేగాక ఆంతరంగిక మనో విజయంకూడ అవుసరం.
ఈ శ్లోకములో ”సంకల్ప” లేక స్వార్ధపూరిత ఉద్దేశము/భావము అనే పదము అనుకున్న ఫలితాన్ని సాధించడానికి అహంకార ప్రేరిత మనస్సు రచించే ఆంతరంగిక పథకము అనే అర్ధంతో వాడబడింది.  సన్న్యాసులైనా యోగులైనా బాహ్యంగా ఆత్మనియంత్రణ, ధ్యాన ప్రశాంతత సాధించినా నిరంతరము చేతనలో హెచ్చుతగ్గులు కలుగజేసే శారీరక అవసరాలు, స్పందనలు అంతరంగములో అహంకారపూరిత చర్యలను ప్రోత్సహించవచ్చు. ఈ విధముగా ”యోగము’ అనగా సంపూర్ణ చేతనా సమతౌల్యతకు ఆటంకం కలుగుతుంది. వ్యక్తిగత చైతన్యము మొత్తము ”చిత్తము”లో అనగా ”స్పష్ట్యాది పరేంగిత జ్ఞానము” లోని వృత్తులను (పరివర్తనాశీలమైన ఆలోచనా, వాంఛా, ఉద్రేక కెరటాలను) కరిగించడమే ”యోగము” అని పతంజలి యోగ సూత్రములు నిర్వచిస్తున్నాయి. (యోగోచిత్తవృత్తి నిరోధః) మనస్సుకు యింద్రియములతో సంపర్కము వల్ల ఉత్పన్నమైన యిష్టాయిష్టముల నుండి ”చిత్తవృత్తులు” ఏర్పడుచున్నాయి.
వాంచాసంబంధమైన ఆలోచనలను త్యజించి ”ఆలోచనారహిత” స్థితిని సాధించడమే ”యోగము” అని వేదము లో నిర్వచింపబడినది. ఈ నిర్వచనములు సన్న్యాసికి, యోగికి కూడ సరిగ్గా సరిపోతాయి. నిజమైన సన్న్యాసము అంటే ఆలోచనలను, కోరికలను యిష్టానుసారము బయటకు త్రోసివేయగల సామర్ధ్యము. ”ఉత్తమయోగపారవశ్యము” అనేది ”ఆలోచనారహిత” స్థితి. అదొక దివ్యసమతౌల్యస్థితి. అట్టి స్థితిని పొందడం వలన యోగి ”కంపనరహిత ఉనికి” యందు ప్రవేశించాడని ఋజువు చేస్తుంది.
ఈ కంపన రహిత ఉనికియే దృగ్విషయ గోచరమైన సృష్టికి ఆవలనున్న ”చిదానంద దివ్య శూన్యత”  (ఈరిఖీరిదీలి ఙళిరిఖి). ”సమాధి” స్థితికి చేరుకున్న భక్తుడు మాత్రమే అహంకారము కొరకు పనిచేయడు కావున నిజమైన యోగి కాగలడు. ఒక నిజమైన యోగి అందమైన గుఱ్ఱాన్ని మెచ్చుకోవచ్చు. కాని ఎవరైతే దానిని తన స్వంతం చేసుకోవాలని కోరతారో అతను అహంకార ప్రేరిత వాంఛాబద్ధుడై ”సంకల్పబందీ” అవుతున్నాడు. ఎట్టి భౌతిక పరిస్థితిలోనైనా యిష్టాయిష్టాలలో చొరబడకుండా ఎవరు ఉండగలరో అతడు మాత్రమే ”యోగి” ఒక యోగి ఆంతరంగిక చర్యలు నిర్వర్తించేటపుడు గాని, బాహ్యచర్యలు నిర్వర్తించేటపుడు గాని తన వ్యక్తిగత కోరికలకు సంపూర్ణంగా దూరంగా ఉండగలిగినపుడు అతడే సన్న్యాసంలోనూ విజేత అవుతాడు. అలాగే ఒక సన్న్యాసి అన్ని బాహ్యచర్యలను, ఆంతరంగిక చర్యలను సంకల్ప బలముతో పరిత్యజించి, తన చైతన్యాన్ని భగవదను సంధానములో నిమజ్జనం చేయగలిగితే అతడే యోగము ద్వారా చిత్త వృత్తులను చిత్తములో కరిగించడం ద్వారా భగవంతునితో పారవశ్యస్థితిలో అలాగే ఉండగల యోగి కూడ అవుతున్నాడు.
సంపూర్ణ సర్వసంగ పరిత్యాగియైన సన్న్యాసి, సిద్ధి పొందిన యోగి యిద్దరూ ఒకటే. ఇద్దరూ ”యోగము”ను అనగా పరమాత్మతో ఐక్యతను సాధించిన వారే, కాకపోతే వారనుసరించిన మార్గములు వేర్వేరు.

Read Full Post »

Mahabharata Historical Concepts

mahabaratha_concept

ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

 

 

 

Read Full Post »