Feeds:
Posts
Comments

Archive for the ‘Personal’ Category

libra sign - Tula Rasi Details in Telugu

తుల రాశి లక్షణాలు

తుల రాశి – స్వరూపం :
అందరితో కలుపుపోయే తత్వంగలవారు. పదిమందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచిచెడులను భేరీజువేసుకుని అమలు చేస్తారు.

తుల రాశి  – వ్యాపారం :
వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించటానికి యత్నాలు చేస్తూ ఉంటారు. కాని పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటంవల్ల వీరికి బాగా లాభిస్తుంది. తాతల నాటి ఆస్తులను నిలబెట్టటానికి వీరు కృషి చేస్తారు.

తుల రాశి  –  ‍ఆర్థిక స్థితి :
వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాణం ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలను ఇవ్వటమే కాకుండా ఆర్ధిక సహాయాన్ని సైతం చేస్తారు.

తుల రాశి  – ‍ స్వభావం
వీరి జీవితగమనాన్ని బట్టే వీరి స్వభావాన్ని అంచనా వేయవచ్చు. వీరు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తారు, ఈ చురుకు స్వభావంవల్ల ఇతరులు దృష్టి వీరిపై పడుతుంది. పెద్దలతో అనుబంధాన్ని కొనసాగిస్తారు.

తుల రాశి  – ‍ ‍ వృత్తి, జీవిత గమనం :
ఈ రాశివారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలలో రాణిస్తారు. వీటితోపాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నతస్థాయికి వెళ్లగలరు.

తుల రాశి  – అదృష్ట రంగు :
తులా రాశివారికి కలిసివచ్చే రంగు పసుపు. ఆరంగు కలిగిన వస్త్రాలను ధరించటం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది. ఈ రంగు లానే వీరి జీవితం పదికాలాలపాటు పచ్చగా సాగుతుంది.

తుల రాశి  – ప్రేమ సంబంధాలు :
తులారాశివారిని ప్రేమించే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇందుకు కారణం వారి విశాల భావాలే. సాంప్రదాయ బద్దమైన వీరి ఆలోచనలపట్ల అందరూ ఆకర్షితులవుతారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరగదు.

తుల రాశి  – స్నేహం
ప్రేమంటే వ్యతిరేకమైనా స్నేహానికి ఎక్కడలేని ప్రాధాన్యాన్ని ఇస్తారు. స్నేహితులతో కలిసి తిరగడంమంటే బహుప్రీతి. స్నేహంకోసం ఎంత ఖర్చునైనా పెడతారు. స్నేహితులకు ఆపదల్లో వీరు దేవుడుగా కనిపిస్తారు.

తుల రాశి  – అలవాట్లు :
వీరు సాంస్కృతిక వ్యవహారాలపై మక్కువను ప్రదర్శిస్తారు. అలాగే విదేశీ విహారం, విహార యాత్రలు వంటి వాటిపైనా ప్రత్యేక ఆసక్తిన కలిగి ఉంటారు.

తుల రాశి – దాంపత్య జీవితం :
తులారాశికి చెందినవారిలో ఎక్కువమంది ప్రేమ వివాహం అవుతుంది. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు.

తుల రాశి – బలహీనతలు :
తులారాశివారిలో ప్రధాన బలహీనత చపలచిత్త మనస్తత్వం. అదేవిధంగా సందిగ్ధంలో గడపటం. అతిరాజీ స్వభావంతోపాటు పోట్లాట స్వభావం వీరికి పెద్ద సమస్యలను సృష్టిస్తాయి.

తుల రాశి –  అదృష్ట రత్నం :
వీరు పగడం, గోమేధికం, పుష్య రాగం రాళ్లలో ఏదైనా ఒకరాయిని ధరించాలి. వీటిని ధరించటంవల్ల అనుకున్న పనులు సత్వరం జరుగుతాయి. సత్ఫలితాలు చేకూరతాయి.

తుల రాశి –  వ్యక్తిత్వం
అందరితో కలుపుపోయే తత్వంగలవారు. పదిమందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచిచెడులను భేరీజువేసుకుని అమలు చేస్తారు.

తుల రాశి –  విద్య
తులా రాశికి చెందినవారు విద్యావిషయాలపై అత్యంత ఇష్టతతో ఉంటారు. వీరు సాంకేతిక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు. తల్లిదండ్రులు కన్నకలలను నిజం చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

తుల రాశి – ఆరోగ్యం :
ఆరోగ్య విషయాదుల్లో వీరు శ్రద్ద చూపించరు. ఫలితంగా చిన్నచిన్న జ్వరాలు వంటివి కూడా వీరికి పెద్ద సమస్యలకు దారితీసి ఇబ్బందులు పెడతాయి. దీనికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా కొన్ని వెంటాడుతాయి.

తుల రాశి – ఇల్లు-కుటుంబం :
కుటుంబ సభ్యులతో కలుపుగోలు స్వభావం కలిగి ఉంటారు. దీనివల్ల వారినుంచి వీరికి అవసరమైన మద్దతు లభిస్తుంది. ఇల్లాలు అంటే వీరికి ఇష్టం. ఆమె చెప్పినమాటను జవదాటరు. కొన్ని సందర్భాల్లో ఇది సమస్యగా మారే అవకాశాలు లేకపోలేదు.

తుల రాశి – కలిసివచ్చే రోజు :
వీరికి మంగళ, బుధ, శుక్ర వారాలు కలిసి వచ్చే రోజులు. మిగిలిన రోజులలో నూతన పనులు తలపెట్టకపోవడం మంచిది.

తుల రాశి – అదృష్ట సంఖ్య :
తులారాశికి చెందినవారి అదృష్ట సంఖ్య 6. అదేవిధంగా15, 24, 33, 42, 51, 60, 69… కూడా అదృష్ట సంఖ్యలే. అలాగే 4, 5, 8 అంకెలు కూడా శుభాన్ని తెచ్చిపెడతాయి. అయితే 1,2 అంకెలు అశుభ సంఖ్యలు.

Advertisements

Read Full Post »