Feeds:
Posts
Comments
About Karthika Masam in Telugu History 
ప్రతి సంవత్సరం 
కార్తీక శుద్ధ పాఢ్యమి నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు 
కార్తీక మాసోత్సవములు మహావైభవము

శ్లో|| తులారాశిం గతే సూర్యే గంగా తైల్రోక్యపావనీ |
        సర్వత  దవ్ర రూపేణసంపూర్ణా సాభవేత్సదా ||
    తులా రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు జగత్‌ పావని యైన గంగ అన్నినదుల్లోనూ, బావుల్లోనూ, ఇతర జలప్రదేశములోనూ అది వసించి ఉంటుందని శృతి ప్రమాణము. కనుక ఈ తులా సంక్రమణకాలంలో (కార్తీక మాసంలో) స్నానం అత్యంత ఫల ప్రదమని భాగవతోత్తములు వివరించారు. ఈ సంక్రమణకాలంలో చేసే స్నాన, జప, ధ్యాన, అర్చనలు అన్నీ కూడా అక్షయములని పురాణం చెబుతున్నది.
    శివుడు మంగళప్రదుడు, కళ్యాణమూర్తి, ”అభిషేకప్రియోశివ” ”అలంకార ప్రియోవిష్ణు” ”బహుయోచనో బ్రహ్మ” అభిషేక ప్రియుడు పరమేశ్వరుడు, జగత్‌ కళ్యాణకర్త, సత్‌భక్తి, సత్‌ విశ్వాసము, సత్‌ వివేకముతో పూజిస్తే అడిగిన వరాలన్నీ ఇచ్చే భోళాశంకరుడు.
    ”మాఘేవ, మాధవే మాసే కార్తీకేవ శుభేదినే” కార్తీక మాసం హరుడితో బాటు హరికి కూడా అత్యంత ప్రియమైన మాసం – కార్తీకమాసం.

Yoga Guru Sotram – Guru Pradhan
who learning yoga that persons before start with this yoga prayer.

Guru Sotram
1. Guru Bramha Guru Vishnu Guru Devo Maheshwara 
    Guru Sakshath Prabramha Tasmai Sri Gurave Namaha 
2. Akanda Mandalakaram Vyapthayena Characharam 
   Thathpadarshithamyena Tasmai Sri Gurave Namaha
3. Om Sadashiva Samarambham Sankaracharya Madhyamam 
    Asmadacharya Paryantham Vandhe Guru Paramparam 
 
Telugu Language Read: 
గురుస్తోత్రమ్‌
1.     గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర ః
    గురుస్సాక్షాత్‌ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః
2.    ఆఖండ మండలాకారం – వ్యాప్తంయేన చరాచరం
    తత్పదం దర్శితం యేన – తస్మై శ్రీ గురవ నమః
3.    ఓం సదాశివ సమారంభాం – శంకరాచార్య మధ్యమాం
    ఆస్మదాచార్య పర్యంతాం – వందే గురుపరంపరాం

తాత్పర్యము :
1.     గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురుదేవుడే మహేశ్వరుడు, గురువే సాక్షాత్తు పరబ్రహ్మము. అటువంటి శ్రీ గురుదేవునికి నా ననమస్కృతులు.
2.     అనంతమైన ఆకాశస్వరూపమై, సర్వచరాచరములయదు వ్యాపింఛిన స్వరోప పాదములను దర్శింప చేయునటువంటి శ్రీ గురుదేవునికి నమస్కరించుచున్నాను.

Narasimha Swamy Temple Sundilla Village 
Kamanpur Mandal Karimnagar District.

శాంతమూర్తిగా వెలసిన సుందిళ్ల యోగ నరసింహస్వామి!
నృసింహస్వామి అనేక ప్రాంతాల్లో ఉగ్రమూర్తి. కానీ, కరీంనగర్ జిల్లా సుందిళ్ల గ్రామంలో శాంతమూర్తి. మిగతా ప్రదేశాలలో కొండలు, గుట్టల్లో వెలిస్తే ఇక్కడ మాత్రం అందమైన కోవెలలో కొలువైనాడు.

పూర్వం హిరణ్యకశిపుని చంపి, ప్రహ్లాదుని రక్షించిన తర్వాత నృసింహస్వామి అవతార ధర్మం పూర్తవుతుంది. అదే ఉగ్రరూపంతో అనేక చోట్ల భక్తుల కోసం స్థిరపడడం మనకు తెలుసు. కానీ, సుందిళ్ల స్వామిది వేరే కథ. భయంకరమైన ఆ ఉగ్రరూపంతో ఉన్న నరసింహస్వామి ఇక్కడి పవిత్ర గోదావరి నదిలో తన గోళ్ళు, కాళ్ళు కడుక్కున్నాడట. గోదావరి నీరు ముఖంపై పడగానే, వాటిని ఆయన దోసిలితో తాకగానే శాంతమూర్తిగా మారాడంటారు భక్తులు.

పచ్చని ప్రకృతిగల ఈ నిశ్శబ్ద ప్రాంతాన్ని నృసింహస్వామి తన తపస్సుకు అనుకూలమైన స్థలంగా భావించాడు. శాంతమూర్తిగా మారిన తర్వాత ఇక్కడే యోగమువూదలో కూర్చున్నాడు. అప్పుడు స్వామి ఒళ్లంతా పుట్టలు పెట్టాయి. ఇంతటి మహిమాన్విత స్థితిలో నరసింహస్వామి వెలసిన చోటు మరెక్కడో లేదు. కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలంలోని సుందిళ్ళ గ్రామంలో ఉంది.

స్థల పురాణం : సుందిళ్ల ఆలయ పౌరాణిక కథ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఒక బ్రాహ్మణుడు జనగామలో నివసిస్తూ చేరువలోనే ఉన్న సుందిళ్ళలోని తన పొలాలకు వచ్చేవాడు. అసలే అది అడవి ప్రాంతం. అందులో ఆ వృద్ధుడు తన పదేళ్ళ మనుమని వెంట బెట్టుకొని అక్కడికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. ఒకనాడు మనమడెందుకో రాలేకపోయాడు. ఒక్క బ్రాహ్మణుడే పొలంలో తిరిగి అలసిపోయి దారితప్పుతాడు. అంతలోనే చీకటి పడుతుంది. దాంతో తన ఊరికి ఎటువైపు వెళ్ళాలో తెలియక ాహా భగవంతుడా! ఏమిటి చేయడం. దారి తెలియక తిరుగుతున్న నాకు నీవే దిక్కని్ణ భక్తితో భగవంతుని స్మరించుకున్నాడు.

తలచిందే తడువుగా ఒక బాలకుడు, తన మనుమని వయస్సువాడే పహ్లాదుడు) అతని దగ్గరకు వస్తాడు. ాాతాతా! దారి తప్పావా! సరైన త్రోవ నేను చూపిస్తాను రా!్ణ్ణ అని తీసుకొని పోతాడు. ాాఈ రాత్రి ఈ మంటపంలో పడుకో. ఇదిగో… స్వామి ప్రసాదం. కొబ్బరి, బెల్లమున్నది తిను్ణ్ణమని ఇచ్చి పడుకున్నాడు. ాాసరే్ణ్ణ అని బ్రాహ్మణుడు ప్రసాదం తినేసి, అలసిపోవడంతో భుజంపైన వేసుకొన్న పంచె పరచుకొని పడుకున్నాడు.

అaతీaంఱఎష్ట్రaంషaఎవ01అర్ధరాత్రి అతని కలలో విష్ణుమూర్తి నృసింహ రూపంలో దర్శనమిస్తాడు. ాానేను నీ పక్కనే ఉన్నాను. భయపడకు. పుట్ట తవ్వి చూడ్ణ్ణమన్నాడు. కళ్ళు తెరిచి చూసే సరికి తెలతెలవారుతున్నది. పక్కలోని బాలుడు లేడు. పుట్టదగ్గర చెవి పెట్టాడు. ఉచ్ఛాస నిశ్వాసల్లోంచి బీజాక్షరాలు వినిపించసాగాయి. అంతా అయోమయం. తాను నిరంతరం పూజించే నారాయణమూర్తి తనను ఉద్ధరించ వచ్చాడని గ్రహించాడు. గబగబ ఇంటికి వెళ్ళాడు.

స్నాన పానాదులు, నిత్యకృత్యాలు ముగించుకొని గునపం చేత పట్టుకొని, మనుమన్ని వెంట బెట్టుకొని సుందిళ్ళకు జనగామ నుండి వచ్చాడు. పుట్ట పూర్తిగా తవ్వేసరికి మూడు రోజులు పట్టింది. నిద్రాహారాలు మాని పుట్ట తవ్వుతుంటే ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అతనిని చూసి ాపిచ్చిపట్టింద్ణన్నారు. నాల్గవ రోజు తెల్లవారక ముందే గునపం తీసుకొని మట్టిని తొలగించసాగాడు.
కుడివైపు గునపం దెబ్బ తగలగానే ాాఅబ్బా ఆపరా!్ణ్ణ అనే మూలుగు వినిపించిందిట. అంతే! తన అపరాధాన్ని తెలుసుకొని, తాను తాగటానికి తెచ్చి పెట్టుకున్న గోదావరి నీళ్ళతో దెబ్బ తగిలిన భాగాన కడిగాడు. చేతికి రక్తపు మరక, ఆ భాగమంతా ఎరుపు రంగు. సూర్యకిరణాల వెలుగులో పీఠం పెట్టుకొని, చేతులు యోగమువూదతో వున్న శిలా విగ్రహాన్ని చూసి ఆనందంతో ఆశ్చర్యపోయాడు.
ఛాతి ఒకవైపు నలుపు, మరో పార్శం ఎరుపు కలిగిన ఇసుకరాతి విగ్రహం. అయితే, స్వామి దక్షిణాభి ముఖంగా దర్శనమిచ్చాడు. దక్షిణ ద్వారం (దిక్కు) యమధర్మరాజుది. ఈ వైపున్న దేవాలయాల్లోకి ప్రవేశిస్తే యమబాధలుండవని పెద్దలు అంటారు.

కాకతీయులు కట్టిన ఆలయం : క్రీ.శ. 13వ శతాబ్దంలో కాకతీయరాజ వంశస్థులు ఈ దేవాలయం నిర్మించినట్లు సమీపంలోని ఓ శిలాశాసనం ద్వారా తెలుస్తున్నది. దేవాలయానికి ఈశాన్య భాగంలో 200 గజాల దూరాన పురాతన దేవాలయమున్నట్లు ఆలయ శిథిలాలు నేటికీ దర్శనమిస్తాయి. అయితే, నైరుతి దిశలోని కోనేరును కూడ్పించి, ఆ స్థలంలో స్వామివారి భక్తుల సౌకర్యార్థం పెద్ద హాలును దాతలు నిర్మించారు.
శాసన భాష లిపి మాదిరిగా ఉన్నా అక్షర క్రమం సరిగా అర్థం కాకుండా ఉంది. గతకొద్ది కాలం క్రితం భక్తుల కోరిక మేరకు శ్రీలక్ష్మీ అమ్మవారిని ప్రతిష్టించారు. ఈ గుడికి పడమరన 50 గజాల దూరాన కాకతీయుల కాలం నాటి శివాలయం, 100 గజాల దూరాన హన్మంతుని దేవాలయం ఉండటంతో నాడు శివకేశవ భేదం ఇక్కడ పాటించలేదన్నది స్పష్టమవుతోంది. అంతేగాక, సుందిళ్ళ- వేలాల ఎదుదురు ప్రాంతాలు. మధ్యలో గోదావరి, యోగ నృసింహస్వామి, ఆ ఒడ్డున వేలాల మల్లన్న. ప్రకృతి రమణీయమైన ఈ ప్రాంతం ధ్యానానికి, తపస్సుకు అనువైన ామోక్షభూమి్ణగానూ అనాదిగా ప్రసిద్ధమైనట్టు స్థానికులు చెప్తారు.

ఇక్కడ ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో భజన సప్తాహం జరుగుతుంది. కుందారం, సెట్టిపెల్లి, శివ్వారం చుట్టు పక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. అలాగే, ప్రతి ఏడూ ఫాల్గుణ మాసంలో స్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అంతేగాక, ప్రతినెలలో ఎవరో ఒకరు దూరవూపాంతాల నుండి వచ్చి ఏకాహం (24 గంటల భజన) చేసి అన్నదానం చేస్తారు.
ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేస్తే ఈతి బాధలనేకం తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. మానసికంగా బాధపడ్తున్న వారిని, బాలారిష్టాలున్న పిల్లలను తీసుకొని వచ్చి నిద్ర చేయిస్తే, వారికి బాధలు తీరి, సుఖ సంతోషాలతో గడుపుతారంటారు. ఈ మేరకు అలాంటి వారి గాథపూన్నో ప్రత్యక్ష నిదర్శనంగా ప్రజలు వినిపిస్తారు.
భక్తులు ఆలయంలో ఉండటానికి వసతి గదులున్నాయి. 24 గంటలు మంచి (తియ్యని) నీరు అందుబాటులో ఉంటాయి. ఆలయ సిబ్బంది, అర్చకులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. స్వామిని ఈ ప్రాంతంలో గుర్తించిన బ్రాహ్మణుని ఐదవ తరం పూజారి జయంత్‌శర్మ (సుందిళ్ళ నర్సయ్యగారి 6వ కుమారుడు) ఇప్పుడు అర్చకుడిగా ఉన్నారు.

మొక్కులు తీర్చుకునే వారేకాక, స్వామి వారి సన్నిధిలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడానికి కూడా అనువైన పెద్ద హాలు, ఆచార్యులు అందుబాటులో ఉంటారు. ఎండు కొబ్బరి కుడుకలో బెల్లం స్వామికి, ఓడి బియ్యం అమ్మకు పెట్టడం చాలా శ్రేష్టమని పండితులు చెప్తారు.

Adilabad Suryanarayana Swamy Temple

తెలంగాణలో ఎంతో చార్రితక ప్రాధాన్యం గల ‘ఆదిత్యుని ఆలయం’ ఒకటి ఆదిలాబాద్ దగ్గర ఉందన్న సంగతి చాలామందికి తెలియదు.
అది జైనద్ మండల కేంద్రం. ఆదిలాబాద్ పట్టణం నుండి తూర్పువైపున చంద్రాపూర్ మార్గంలో సుమారు 20 కి.మీ. దూరంలో ఈ చిన్న పట్టణం ఉంటది. పూర్వకాలంలో అయితే, ఈ ఊరును ‘ఝేంఝ’ అని పిలిచేవారని, తర్వాత కాలక్షికమేణా అది ‘జైనద్’గా మారిందని చరివూతకారుల కథనం.
ఆదిలాబాద్ జిల్లాలోనే దీనిని ‘అతి ప్రాచీనమైన దేవాలయం’గా చెబుతున్నారు. ఈ ఆలయ నిర్మాణ శైలి అంతా మహారాష్ట్ర, త్రయంబకంలలోని దేవాలయాల రీతిని పోలి ఉంటది. అంతేకాదు, ఈ రకమైన అన్ని ఆలయాలకు ఉపయోగించిన ‘శిలా స్వరూపం’ ఒక్కటే కావడం గమనార్హం.

ఇక్కడి మూల విరాట్టును ‘లక్ష్మినారాయణస్వామి’గా పిలవడం మరో విశేషం. అయితే, స్వామి విగ్రహం తల వెనుక భాగంలో నమ్మశక్యం కాని రీతిలో ‘జ్వాలా తోరణం’ ఉంది. ఈ కారణంగానే ఆయన్ని ‘సూర్యనారాయణస్వామి’గా కూడా భక్తులు పిలుస్తారు. దీనికి మరో కారణం ఏమంటే, మందిరంలో ఒకటిన్నర అడుగుల వైశాల్యంలో ఓ శిలా శాసనం ఉంది. దానిపై దేవనాగరి లిపిలో ఇరవై శ్లోకాలు ఉన్నట్టు చెబుతారు. ఈ శాసనం ‘నమః సూర్యాయ’ అంటూ ప్రారంభమైంది. ఈ రీత్యాకూడా ఇక్కడి స్వామి ‘సూర్యనారాయణుడు’ అయ్యాడు.

ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయమూ ఉంది. అదేమంటే ఏడాదిలో నాలుగు నెలలపాటు సూర్యకిరణాలు స్వామి పాదాలను స్పృశిస్తాయి. సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో మళ్లీ ఫిబ్రవరి, మార్చి నెలల్లో సూర్యుడు తూర్పు మధ్యలో ఉదయించిన కాలంలో ప్రప్రథమ లేలేత కిరణాలు ఈ స్వామి పాదాలను స్పర్శించడం విశేషం.
ఎంతో అరుదైన ఈ దేవాలయం రాష్ట్ర కూటులు లేదా కళ్యాణి చాళుక్యుల కాలంలో నిర్మితమై ఉండవచ్చునని చరివూతకారులు భావిస్తున్నారు. కాగా, ఈ గ్రామంలో నూతన గృహాల నిర్మాణానికి గాను పలువురు పునాదుల కోసం తవ్వకాలు జరిపినప్పుడు పలు శిల్పాలు బయట పడుతుంటాయని స్థానికులు చెబుతున్నారు. అలాగే, పురాతత్వ శాఖ వారు కూడా రెండుమార్లు ఈ దేవాలయం వద్ద తవ్వకాలు జరిపారు.

ప్రస్తుతం ప్రధాన దేవాలయం పక్కన శిథిలమైన మరో శివాలయమూ ఉంది. దీని ముందున్న పుష్కరిణి కూడా బాగా శిథిలమై ఉంది. ప్రస్తుతం అదొక చెరువులా కనిపిస్తోంది. ఒకప్పుడు ఈ ప్రదేశమంతా ఓ పట్టణంగా ఉండి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అయితే, ఆహ్లాదకరంగా గ్రామం పక్కన ఉన్న ఏరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒకప్పుడు వారం వారం సంత జరిగేది. ఇక్కడ పశువుల సంత కూడా ఉండేది. అప్పట్లో చుట్టూ ఉన్న పది, ఇరవై గ్రామాల ప్రజలు ఈ సంతలలో పాల్గొనే వారు. ఇక్కడ పశువుల అమ్మకాలు జోరుగా జరిగేవనీ చెప్తారు. అయితే, ఇప్పుడు ఈ సంతకు ఎవరూ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు.

1985 వరకూ ఇక్కడికి రోడ్డు సౌకర్యం లేదు. వర్షాకాలంలో పట్టణంతో సంబంధం తెగిపోయేది. గ్రామంలోని రోగులనైతే మంచంపై పడుకోబెట్టి ఆదిలాబాద్ తీసుకెళ్లే వారు. ఇప్పుడు చంద్రాపూర్ వరకూ పక్కా రోడ్డయ్యింది. గుడి దాకా రవాణా సౌకర్యం కొంతవరకు మెరుగైంది. ప్రస్తుతం జైదన్ గ్రామంలో ఆరోగ్య కేంద్రమూ ఉంది. దానికి స్వంత భవనం ఏర్పాటైంది. ఉన్నత పాఠశాల, పోలీస్ స్టేషన్ వంటివీ ఉన్నాయి. ఆదిలాబాద్ తాలూకా పరిధిలో జూనియర్ కళాశాల ఉన్న మండలం కేంద్రం ఇదే. కాకపోతే మెరుగైన మంచినీటి సౌకర్యం లేదు. వేసవి కాలంలో ఇక్కడనీటికి కటకటే.

జైదన్‌లోని శ్రీ సూర్యనారాయణ స్వామిపట్ల అనేకమంది భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తారు. సంతానం లేని వారు స్వామి వారిని ‘కొంగు బంగారం’గానూ భావిస్తారు. స్వామి వారి దర్శనానికి నాందేడ్, యవత్‌మాన్, చంద్రాపూర్ (మహారాష్ట్ర) జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో (శుద్ధ ద్వాదశి నుండి బహుళ దశమి దాకా) స్వామి వారి కళ్యాణోత్సవం, రథోత్సవం, జాతరలు వైభవంగా జరుగుతాయి.

Lingamanthula Jathara at Durajpally, Suryapet, Nalgonda District., This Jathara called as Peddagattu Jathara, Lingamanthula Jathara, Gollagattu  Jathara, Durajpally Jathara, in this temple Lord Shiva is there. People called as the lord “Oh Linga Oh Linga”. Every Two years once celebrate for 5 days, this Jathara Nalgonda, Khammam, Warangal District People coming here and celebrate with Non-Veg Food Items. 

తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతర పెద్దగట్టు జాతర. ఇక్కడ భగవంతుడికి, భక్తుడికి మధ్య ఏకం చేసే ఒకే ఒక దివ్యమంత్రం… ‘ఓ లింగా ఓ లింగా’ !! 

జాతర.. సంస్కృతి, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే ఉత్సవం. ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని, జీవన సౌందర్యాన్ని ప్రతిబింబింపజేసే సంరంభం. ప్రజలు తమకు రక్షణ కల్పించిన వారినో, యుద్ధ వీరులనో దేవుళ్లుగా తలచి పూజించే సంబురం. వందల ఏండ్ల చరిత్ర కలిగిన పెద్దగట్టు జాతరకు చాలానే పేర్లున్నాయి. దురాజ్‌పల్లి జాతర, గొల్లగట్టు జాతర.. లింగమంతుల జాతర.. పేరు ఏదైనా, దైవం మాత్రం లింగమంతుడే..

రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు దాదాపు 15 లక్షలకు పైనే జనం వస్తుంటారు.  ప్రజలు ‘‘ఓలింగా..! ఓ లింగా !!’’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ ఆ దేవుడిని వేడుకుంటారు. ఇక్కడి లింగమంతుల జాతరలో  యాదవులు పూజారులు కావడం విశేషం. ‘ఓ లింగా ఓ లింగా’ అనే భక్తుల పిలుపే ఏకైక మంత్రం.

లింగమంతుడికి నైవేద్యం.. పెద్దగట్టు జాతరలో లింగమంతుడు సహా చౌడేశ్వరి (సౌడమ్మ, చాముండేశ్వరి), గంగాభవాని, యలమంచమ్మ, అకుమంచమ్మ, మాణిక్యాలదేవి పూజలందుకుంటారు. వీరిలో లింగమంతుడు శాఖాహారి కావడంతో ఆయనకు నైవేద్యం సమర్పిస్తారు. తక్కిన దేవతలకు జంతుబలి ఇచ్చి సంతృప్త్తి పరుస్తారు.
 

అన్నా, చెల్లెళ్లకు ప్రత్యేకం… పెద్దగట్టు పరిధిలో ఎటుచూసినా ఐదు కిలోమీటర్ల వరకు జాతర రద్దీ కనిపిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులు టెంట్లు ఏర్పాటు చేసుకుని విడిది చేస్తారు. ఇక గట్టు సమీపంలో కోలాహలం అంతా ఇంతా కాదు. అన్నలు తమ చెల్లెళ్లకు జాతరలో గాజులు కొనివ్వడం ఏళ్ల తరబడి వస్తున్న సంప్రదాయం. గజ్జెలు, భేరీలు, తాళాలు, పిల్లనక్షిగోవి శబ్దాలు.. బండ్లు లాగుతున్న ఎద్దుల మెడలో గణగణ మోగే గంటలు..‘ఓలింగా ఓ లింగా’ అంటూ భక్తుల తన్మయం.. మరోవైపు జెయింట్ వీల్స్, జంతువూపదర్శన శాలలు, రంగులరాట్నాల వద్ద యువతీ, యువకుల కేరింతలు, తప్పిపోయిన వారికోసం ఏర్పాటు చేసిన శిబిరాల నుంచి పోలీసుల అనౌన్స్‌మెంట్లు.. పెద్ద మర్రిచెట్టు దగ్గర ఏర్పాటు చేసిన సామాజిక చైతన్య కార్యక్షికమాలు, ప్రత్యేకంగా తయారు చేసిన మిఠాయిల విక్రయాలు, చిన్నపిల్లల బొమ్మల కొనుగోళ్లు, చెరుకు రసాలు.. ఒక ప్రతి ఏటా జాతర వస్తే బాగుండనే ఆలోచనలు మది నిండిపోతాయి. దూరం నుంచి గుట్టను గమనిస్తే మూడువైపులా ఉన్న మెట్ల మార్గంలో భక్తుల రాకపోకలు గట్టుకు పూలమాలలు అల్లినట్లుగా తోస్తుంది.

యాదవుల ప్రత్యేక వేషధారణ – యాదవులు తమకు, తమ సంపదలైన గోవులకు రక్షణగా నిలిచిన లింగమంతుడిని ఇక్కడ ఆరాధిస్తారు. జాతరకు వచ్చే భక్తుల్లో అత్యధికులు యాదవులు. వారు ప్రత్యేక వేషధారణ, వాయిద్యాలతో జాతరకు ఒకరోజు ముందే బంధుమివూతులతో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై ఇక్కడికి చేరుకుంటారు. మగవాళ్లు ఎరుపు రంగు బనియన్, గజ్జెల నిక్కరు ధరించి, కాళ్లకు గజ్జెలు కట్టుకుని, అవుసరాలు పత్యేకమైన తల్వార్లు) చేతుల్లో పట్టుకుని భేరీలు, తాళాల ఢిళ్లిం… భళ్లిం… శబ్దాల నడుమ లయబద్దంగా నడుస్తూ ‘ఓలింగా… ఓ లింగా!!’ అంటూ హోరెత్తిస్తారు.

మహిళలు తడి బట్టలతో పసుపు, కుంకుమ, పూలదండలు, అగరొత్తులతో అలంకరించిన మంద గంపను నెత్తిన పెట్టుకుని నడుస్తారు. ఇంట్లోని ఆడపిల్లలు, సంతానం లేని మహిళలు బోనం కుండ ఎత్తుకుంటారు. తోడుగా వచ్చిన వాళ్లు దేవుడికి బలిచ్చే గొర్రెపోతును తీసుకొస్తుంటారు. ఇక్కడికి రావడానికి ముందుగానే గొర్రెపోతుకు స్నానం చేయిస్తారు. పూలమాల మెడలో వేసి దేవుడు ఉన్న దిక్కువైపు వదిలేస్తారు. దాంతో గొర్రెపోతు తన ఒంటిపై ఉన్న నీళ్లను దులిపేసుకోవడానికి శరీరాన్ని దులిపేస్తుంది. అలా చేయడాన్ని ‘జడత పట్టించడం’ అంటారు. అలా చేయనిపక్షంలో దాని బదులు మరో గొర్రెపోతును తీసుకొస్తారు. జడత ఇచ్చే వరకు నీళ్లు చల్లుతారు. జడత ఇస్తేనే దేవుడు మెచ్చాడని యాదవుల నమ్మకం. లేదంటే ‘నీకు ఏం తక్కువ చేశాం దేవుడా’ అంటూ నిట్టూరుస్తారు.

పెద్దగట్టుకు 200 ఏళ్ల చరిత్ర – పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు చరివూతకారులు చెబుతున్నారు. ఇందుకు పలు, ప్రాంతాల్లో ఆయా సందర్భాల్లో లభించిన శాసనాలే వారికి ఆధారం. కానీ, క్రీ.శ.11వ శతాబ్దంలో రాష్ట్రకూట వంశానికి చెందిన ధ్రువుడు అనే రాజు తన పేరిట ఇక్కడ గ్రామాన్ని నిర్మించాడని, ఆయన పేరిటే ఈ గ్రామం దురాజ్‌పల్లిగా పేరొందినట్లు కొందరి వాదన. కానీ, చరివూతకారులు మాత్రం ప్రస్తుతం పూజలందుకుంటున్న విగ్రహాలకు 200 సంవత్సరాల వయసు ఉంటుందని చెబుతున్నారు. కానీ, గతంలో జాతర జరిగిన గట్టును, అక్కడి విగ్రహాలను ఇంత వరకు ఎవరూ పరిశీలించలేదు. నేటికీ ఆ ప్రయత్నాలు జరగలేదు. ఆ పరిసరాలను గమనిస్తే ఎన్నో ఏళ్ల చరిత్ర ఉండవచ్చని సమాచారం. జాతర విశేషాలను గురించి ఇక్కడ పూజారిగా పనిచేసే 76 ఏళ్ల మట్ట రామనర్సయ్య యాదవ్ మాట్లాడుతూ ‘తమ ముత్తాతల కాలం నుంచి మా వంశీకులు జాతరలో పూజారులుగా వ్యవహరిస్తున్నారని’ చెప్పారు. దీనిని బట్టి జాతరకు దాదాపు వందల ఏళ్ల చరిత్ర ఉంటుందని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో లింగమంతుల చరిత్ర, జాతర తదితర అంశాలపై 2009 సంవత్సరంలో ‘లింగమంతుల అధ్యయన పీఠం’ ఏర్పాటైంది. లింగమంతుల స్వామి కాలం, సమయం, జాతర నేపథ్యం, ఆధారాలు, విశేషాలు తదితర అంశాలపై పీఠం అధ్యయనం చేస్తోంది.

ఉండ్రుగొండ నుంచి దురాజ్‌పల్లికి… దురాజ్‌పల్లికి సమీపంలో ఉండ్రుగొండ అనే గ్రామం ఉంది. దీని శివారులో పెద్ద అటవీవూపాంతం, ఏడు నుంచి ఎనిమిది కొండ గుట్టలు ఉన్నాయి. ఇక్కడ శైవ, వైష్ణవ మతాలు వర్ధిల్లినట్లు తెలిపే ఆనవాళ్లు, రాతి కట్టడాల మధ్యన కోనేరు నిర్మితమై ఉంది. ప్రస్తుతం దురాజ్‌పల్లి సమీపంలో జరిగే లింగమంతుల జాతర గతంలో ఉండ్రుగొండకు సమీపంలోని పెద్దగుట్టపై జరిగేది. అక్కడి నుంచి పెద్దగట్టుకు మారేందుకు కారణమేదైనా… ఓ కథ మాత్రం ప్రచారంలో ఉన్నది. జాతర సమయంలో మందగంప ఎత్తుకుని వెళ్తున్న ఓ గర్భిణి ఉండ్రుగొండ గుట్ట ఎత్తుగా ఉండడంతో అదుపుతప్పి పడిపోయి మృతి చెందిందని, ఆ కారణంతో దేవుడు ఓ వ్యక్తి కలలో కనిపించి తనను పెద్దగట్టుకు మార్చమని చెప్పాడని చెబుతుంటారు. దాంతో 200 ఏళ్లుగా పెద్దగట్టులో జాతర నిర్వహిస్తున్నారు.

ఆలయ నిర్మాతలు వీరే… 1981కి ముందు పెద్దగట్టు జాతరను వెలమదొరలు నిర్వహించగా, ఆ తర్వాత 1982 నుంచి యాదవ కులస్తుల ఆధీనంలో జరుగుతోంది. పెద్దగట్టుపై రెండేళ్ల కిందట కొత్త ఆలయాలు నిర్మించారు. గతంలో ఇక్కడ రెండు చిన్న గుడులు మాత్రమే కనిపించేవి. వీటిని కొన్నేళ్ల కిందట పెద్దగట్టు సమీపంలోని కాసారం గ్రామానికి చెందిన గొర్ల లింగమడ్డి, మెంతెబోయిన భిక్షం యాదవ్ అనే ఇద్దరు లింగమంతుల స్వామి భక్తులు నిర్మించినట్టు సమాచారం.

ఇలా వెళ్లాలి… నల్లగొండ జిల్లాలోని పెద్దగట్టు… హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై దురాజ్‌పల్లి గ్రామ పరిధిలో ఉంది. హైదరాబాద్‌కు 150 కిలో మీటర్లు, సూర్యాపేటకు 6 కి.మీ. దూరంలో ఉంటుంది. విజయవాడ నుంచి వచ్చే భక్తులు కోదాడ మీదుగా చేరుకోవాలి. గుంటూరు వైపు నుంచి వచ్చే వారు మిర్యాలగూడ, నేరేడుచర్ల, గరిడేపల్లి మీదుగా నేరుగా పెద్దగట్టు చేరుకోవచ్చు. వరంగల్, హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు సూర్యాపేట చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక బస్సుల్లో జాతరకు రావచ్చు. అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తుంది. ఇక్కడికి రైల్వే సౌకర్యం లేదు.

జాతర ప్రారంభం ఇలా… ‘గొల్లగట్టు జాతర’గా మరోపేరుతోనూ పిలుచుకునే ఈ జాతర ఐదు రోజులపాటు ఘనంగా జరుగుతుంది. పుష్యమాస అమావాస్య రోజున దిష్టిపూజతో జాతర ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. ఆ రోజున తల్లి, పిల్ల గొర్రెను గట్టుపై బలిస్తారు. దీనినే బలిపూజ అనికూడా పిలుస్తారు. తిరిగి మాఘ శుద్ధ పౌర్ణమికి అటుఇటుగా వచ్చే  జాతర మొదలవుతుంది. కాగా, శనివారం మధ్యాహ్నం నుంచి మూలవిరాట్‌లకు అలంకరణ మొదలవుతుంది. వరంగల్ జిల్లా చీకటాయపాలెం నుంచి యాదవ పూజారులు చౌడమ్మ పల్లకి తీసుకురాగా, సూర్యాపేట నుంచి మకరతోరణం ఇతర ఆభరణాలు గుట్టకు తీసుకువచ్చి అలంకరిస్తారు.
 

జాతర తొలి రోజు: వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు రాత్రి తమ ఇళ్లలో గంపలు వెళ్లదీసే కార్యక్షికమానికి శ్రీకారం చుడతారు. సంప్రదాయ ఆయుధాలు తీసుకుని ఎవరికి వారు తమ వాహనాల్లో రాత్రి లోపే ఇక్కడకు చేరుకుంటారు.
రెండో రోజు:  యాదవ పూజారులు పోలు ముంతలు, బొట్లు, కంకణాలు తదితర కార్యక్షికమాలు నిర్వహిస్తారు. మహిళలు తెల్లవారుజామునే బోనం వండుకుని లింగమంతుల స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. ఇదే రోజున జంతుబలి కొనసాగుతుంది. ఈ రోజున భక్తజన రద్దీ ఎక్కువగా ఉంటుంది.

మూడో రోజు: ‘చంవూదపట్నం’ వేస్తారు. బియ్యం పిండి, పసుపు కలిపిన పదార్థంతో ఆలయాల ఎదుట ముగ్గు వేస్తారు. నాలుగువైపులా గురుగులు ఏర్పాటు చేసి దీపాలు వెలిగిస్తారు.
నాలుగో రోజు: నెలవారం. దేవరపెట్టెను తొలగిస్తారు. ఈ దేవరపెట్టె దిష్టిపూజరోజున ఇక్కడికి చేరుకుంటుంది. తొలగించిన అనంతరం సమీపంలోని కేసారం గ్రామానికి తరలిస్తారు. తిరిగి మరో ఏడాది జరిగే జాతర సమయంలోనే ఈ పెట్టెను తీసుకొస్తారు.
ఐదో రోజు: మకర తోరణం తొలగింపు. మూలవిరాట్‌ల అలంకరణకు ఉపయోగించే ఈ ఆభరణం మొసలి శరీరం, సింహం తలభాగం కలిసిన ఆకృతితో చెక్కి ఉండడం గమనార్హం.

History of Beerappa Festival in Medak Districtబీరప్ప పెద్ద పండుగ

కురుమల కులదైవం బీరప్ప. ఆ దేవున్ని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తూ గొర్రెల కాపర్ల వృత్తిగల కురుమ కులస్తులు జరిపించే అతిపెద్ద పండుగ బీరప్ప పండుగ. ఈ పండుగను ాపెద్ద పండుగ్ణ అని కూడ అంటారు. రోజుల వారీగా ఎనిమిది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ వివరాలు ాబతుకమ్మ్ణకు ప్రత్యేకం.ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నుండి జూన్ వరకు నాలుగు నెలల్లో ఈ పండుగను కురుమలు వారి వారి గ్రామాల్లో ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండుగను శుక్రవారం నుండి శుక్రవారం వరకు అంటే ఎనిమిది రోజులు జరుపుకుంటారు. ఒకసారి పండుగ చేసుకుంటే మళ్లీ ఐదేళ్ల తర్వాత వారి వీలును బట్టి జరుపుకుంటారు.ఈ పండుగలో ఊరి జనం అందరు ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ పాల్గొంటారు. గొర్రెల కాపర్లు తమ గొర్రెల మందలు క్షేమంగా ఉండాలనే కాంక్షతో ఈ పండుగని నిర్వహిస్తారు. పండుగని నిర్వహించడానికి కురుమలలోనే ప్రత్యేకంగా పూజారులుంటారు. వారిని ాబీర్‌నోల్లు్ణ అంటారు. వీళ్ళని ాఒగ్గు పూజారులు్ణ అని కూడా అంటారు. ఏ ఊరి వారైతే పండుగని నిర్వహించదలుస్తారో ముందుగా బీర్‌నోల్లని సంప్రదించి శుభ ముహూర్తాన్ని ఎంపిక చేసుకొని పండుగకు శ్రీకారం చుడతారు. రోజుల వారీగా ఈ పండుగ ఎలా జరుపుకుంటారో చూడండి.

శుక్రవారం తొలిరోజు
కురుమలు ఈ రోజు గ్రామదేవత పోచమ్మను పూజిస్తూ ఇంటి నుండి బోనాలు చేస్తారు. పండుగ ప్రారంభమయ్యేది ఇలాగే. 

శనివారం
కురుమలు ఆ రోజు బీరప్ప గుడిలోని లింగాలను శుభ్రపరచి ఒక గొంగడిలో మూటగా కట్టి, రాత్రివేళ బీర్‌నోల్లకు తెలియకుండా గ్రామ సమీపంలోని బావులలోకాని, చెరువులలో కాని దాచి పెట్టి వస్తారు.

ఆదివారం
ఉదయం బీర్‌నోల్లు ప్రత్యేక వేషాలు ధరించుకొని గత రాత్రి కురుమలు దాచిపెట్టిన లింగాలను వెతకడానికి బయలుదేరుతారు. డోల్లు, తాళాల వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్తారు. మధ్య మధ్యలో కత్తిసాము, కర్రసాము లాంటి విద్యలు ప్రదర్శిస్తూ ప్రజలని ఆనందింపజేస్తారు. లింగాలను వెతకడానికి తీవ్ర ప్రయత్నం చేసి ఎలాగైనా కనుగొంటారు. ఆ లింగాలను తెచ్చేముందు గంగపూజ చేసి, గుడి వద్దకు తెస్తారు. ఇక రాత్రయ్యాక ప్రతి ఇంటి నుండి దేవుని ాపెళ్ళి బోనాలు్ణ చేస్తారు. రాత్రి బోనాల ఊరేగింపు డోలు వాయిద్యాలతో బీర్‌నోల్ల కత్తి, కర్ర సాముల సాహస కృత్యాలతో గుడి వరకు సాగుతుంది. ఆ రాత్రి బీరప్ప కథ చెబుతారు. రాత్రంతా కథ చెబుతూనే ఉంటారు.

సోమవారం
పండుగలో ఇది అతి ముఖ్యమైన రోజు. బీరప్ప – కామరాతిల్ణ కళ్యాణం జరుగుతుంది. ఉదయం నుండి కథ చెబుతూనే ఉంటారు. ఆదివారం రాత్రి ప్రారంభమైన కథ సోమవారం దేవుని పెళ్ళి జరిగే వరకూ చెబుతూనే ఉంటారు. దేవుని పెళ్ళి రోజు కురుమలు వారి బంధువులు సమీప గ్రామాల ప్రజలు, ఆ గ్రామ ప్రజలు, నాయకులు కులాల కతీతంగా పాల్గొని కళ్యాణ కార్యక్షికమాన్ని వీక్షిస్తారు. అనంతరం గావు పడుతారు. పెళ్ళి అనంతరం కురుమలు ఒడి బియ్యం పోసుకుంటారు. ఆ రోజు రాత్రి విందు, వినోదాలతో కురుమ వాడలు కళకళలాడుతాయి.

మంగళవారం
ఉదయం గ్రామ రచ్చబండ వద్ద లేదా గుడి ముందు అదీ కాకపోతే ప్రజలకు అనుకూలంగా ఉన్న చోట ాబీరనోల్లు్ణ కాశీ రామక్క కథ చెబుతారు. అదే కథలో మధ్య మధ్య జనాల వినోదం కొరకు ాజోగు వేషాలు్ణ వస్తాయి. సాయంత్రం ారేణుకా ఎల్లమ్మ్ణ వేషం రాగానే ప్రజలందరు భక్తిశ్రద్ధలతో వీక్షిస్తారు. బీర్‌నోల్లలోని పురుషులే మహిళా దేవతల పాత్రలు ధరిస్తారు. సాయంత్రం ఎల్లమ్మ పాత్రధారుడు ప్రతి కురుమ ఇంటిని సందర్శిస్తాడు.

బుధవారం
బీరప్ప దేవుడు తన ప్రియురాలు కామరాతిని తన వద్దకు తీసుకురావడానికి రకరకాల గారడీ వేషాలు వేసి విజయం సాధిస్తాడు. ఆ సంఘటనను పురస్కరించుకొని బుధవారం రోజున గ్రామ రచ్చబండ దగ్గర గారడీ వేషం కథ చెబుతారు. గారడీ వేష పాత్రధారుడు చేసే విన్యాసాల ముందు మెజీషియన్‌ల ఇంద్రజాల విద్య తక్కువగానే కనిపిస్తుంది. మామిడిటెంకను నాటి నిమిషాల వ్యవధిలోనే మొక్కగా మారుస్తాడు. గంట సమయంలోపే దానిని చెట్టుగా మార్చి, దానికి మామిడికాయలు సృష్టిస్తాడు. ఆ మామిడి కాయలను కోసి వాటి ముక్కలను కురుమలచే తినిపింపచేస్తాడు. అబ్బురపరిచే ఇలాంటి విన్యాసాలు ఎన్నో పలువురిని ఆకట్టుకుంటాయి.
రాత్రి నాగ భోనాలు చేస్తారు. బోనాల ఊరేగింపు ఘనంగా సాగుతుంది. ఈసారి బీరప్ప, కామరాతి, మహంకాళి, బోగన్న వేషాలుంటాయి. బోగన్నను చూస్తే చిన్నపిల్లలు భయపడి తల్లిచాటు దాక్కుంటారు. రాత్రి బోనాల ఊరేగింపు గ్రామ రచ్చబండ దగ్గరకు రాగానే మల్లన్న కథ, సమితుల వాదం కథ చెబుతారు. ఆ కథ చెబుతున్నంత వరకు మహిళలు బోనాలు ఎత్తుకునే ఉంటారు. తెల్లవారు సమయానికి బోనాలు గుడికి చేరుకుంటాయి.

గురువారం
దేవుని నాగ కార్యక్షికమం జరుగుతుంది. మధ్యాహ్నం వరకు కథ చెబుతూనే ఉంటారు. కంప్యూటర్ యుగంలో కూడ కథలు వినడానికి వచ్చే జనం ఆసక్తిని గమనిస్తే జానపద గాథలకున్న గొప్పతనం తెలుస్తుంది. సాయంత్రం అక్క మహంకాళి దేవత అలకవహిస్తే ఆ దేవతను తిరిగి తీసుకురావడానికి బీరప్ప వేషధారి ఆలాపన జనాలకు భావోద్వేగాన్ని కలుగజేస్తుంది. జనాలు కన్నీటి పర్యంతమవుతారు. అక్క మహంకాళి దేవత పాదాలు నేలకి తాకకుండా ఆమె నడిచినంత స్థలంలోను బట్టలు పరుచుకుంటూ స్వాగతం పలుకుతారు. ఈ రోజుతో దాదాపుగా పండుగ కార్యక్రమాలు ముగింపుకు వస్తాయి. 

శుక్రవారం
ఇది పండుగలో చివరిరోజు. కురుమలు గుడి ప్రాంగణంలో కాని, కొద్ది దూరంలో గాని వన భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. వారం రోజుల పాటు జరిగిన పండుగ మధురానుభూతులు మననం చేసుకుంటారు. కార్యక్షికమాన్ని నిర్వహించిన పూజారుల (బీరనోల్లు)కు వీడ్కోలు చెబుతూ గ్రామ పొలిమేర దాటేవరకు వారిని సాగనంపడంతో పెద్దపండుగ పూర్తవుతుంది. అమాయకత్వానికి, నిజాయితీకి మారు పేరయిన కురుమలు జరిపే ఈ పెద్ద పండుగకు ప్రజలందరు సహాయ సహకారాలు అందిస్తారు.రాత్రి బోనాల ఊరేగింపు గ్రామ రచ్చబండ దగ్గరకు రాగానే మల్లన్న కథ, సమితుల వాదం కథ చెబుతారు. ఆ కథ చెబుతున్నంత వరకు మహిళలు బోనాలు ఎత్తుకునే ఉంటారు.


Bagwadgitha in Telugu Read